Home /News /life-style /

IF YOU FACING STOMACH PAIN PROBLEM REGULARLY THEN FOLLOW THIS SIMPLE TIPS TO GET RID OF THAT PAIN PRV

Stomach pain: కడుపు నొప్పి తరుచుగా వస్తోంటుందా? అయితే జాగ్రత్త.. ఈ టిప్స్​ పాటించి నొప్పి దూరం చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కడుపు నొప్పి కొద్దిమందికి చీటికిమాటికీ వస్తుంటుంది. ఆ సమయంలో బాధ వర్ణనాతీతం. నిద్ర పట్టదు. నిల్చోనివ్వదు, కూర్చోనివ్వదు. అయితే అలాంటి వారు ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​.

    కరోనా చాలామంది జీవితాలను ఛిద్రం చేసింది. ఆరోగ్య వంతులకు ఏం కాలేదుకానీ, అప్పటివరకు అనారోగ్యం బారిన పడినవారిని మాత్రం తీసుకెళ్లింది. ఇక ఇపుడు కరోనా మరో వేవ్​ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే మన ఆరోగ్యం విషయంలో చాలాజాగ్రత్తలు తీసుకోవాలి. గుండె సమస్యలు, మధుమేహం సమస్యల వాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇతర రోగాల విషయంలో అజాగ్రత్త పనికిరాదు. ముఖ్యంగా కడుపునొప్పి (stomach pain) . కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు (problems) వస్తుంటాయి. క్రాంప్స్, మగతగా అనిపించడం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఇలా ఎన్నో సమస్యలకు కడుపునొప్పి (stomach pain) కారణం అవ్వవచ్చు.

    కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి (Stomach pain) తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.  కడుపు నొప్పి, అజీర్ణం సమస్యలు ఎక్కువే. ఉష్ణోగ్రతలు పడిపోవడం (Temperature down).. శరీరం చలికి గురవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గడంతోపాటు (Immunity power down).. అలసట, నీరసం కలుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ (digestive system) పై ప్రభావం చూపుతుంది. ఈ సీజన్లో కడుపులో హఠాత్తుగా నొప్పి వచ్చినా.. లేదా ప్రతిసారి తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న కొన్ని ఇంటి నివారణ పద్ధతులను (stomach pain remedies) అనుసరించండి.

    లెమన్ జ్యూస్ ని గోరువెచ్చని నీటి కాంబినేషన్..

    లెమన్​ జ్యూస్​ కూడా కడుపు నొప్పి (stomach pain)  తగ్గించడానికి చాలా మంచిది. లెమన్ జ్యూస్ ని గోరువెచ్చని నీటి కాంబినేషన్ తో కలిపి తీసుకుంటే తప్పకుండా కడుపు నొప్పి నుండి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు వేడి నీటిలో కొంచెం నిమ్మరసం పిండి అందులో కొద్దిగా తేనెను మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి తీసుకుంటే తప్పకుండా కడుపు నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.

    కడుపు నొప్పి  (stomach pain) నుండి తక్షణ ఉపశమనం కలిగించడంలో పుదీనా ఒక మంచి హోం రెమడీ (stomach pain remedies) అని చెప్పవచ్చు. సాధారణంగా కొన్ని పుదీనా ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి, నోట్లో వేసుకొని బాగా నమిలి మ్రింగాలి.అప్పుడు కడుపు నొప్పి తగ్గిపోతుంది.లేదా పుదీనా ఆకులను వేసి బాగా టీ తయారు చేసుకొని రోజు త్రాగితో కడుపు నొప్పి నుండి తక్షణమే మంచి ఉపశమనం పొందవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health care, Stomach Pain

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు