Home /News /life-style /

IF YOU FACING STOMACH PAIN PROBLEM REGULARLY THEN FOLLOW THESE SIMPLE METHODS TO OVERCOME IT PRV

stomach pain: కడుపు నొప్పి తరుచుగా వస్తుంటే.. ఈ పద్దతులను ఫాలో అవండి.. నొప్పి ఇట్టే తగ్గిపోతుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ సీజన్లో కడుపులో హఠాత్తుగా నొప్పి వచ్చినా.. లేదా ప్రతిసారి తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న కొన్ని ఇంటి నివారణ పద్ధతులను (health tips) అనుసరించండి.

    కల్తీ రాజ్యం నడుస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటుపడిన వారు ప్రతీ దాంట్లోనూ కల్తీలు, నకిలీలు పుట్టిస్తున్నారు. ఆఖరికి మనం తినే ఆహారం (food)లోనూ ఇది మామూలైపోయింది. అయితే కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి (Stomach pain) తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు(problems) వస్తుంటాయి. క్రాంప్స్, మగతగా అనిపించడం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఇలా ఎన్నో సమస్యలకు కడుపునొప్పి (stomach pain) కారణం అవ్వవచ్చు.

    చలికాలంలో కడుపు నొప్పి (stomach pain), అజీర్ణం సమస్యలు ఎక్కువే. ఉష్ణోగ్రతలు పడిపోవడం (Temperature down).. శరీరం చలికి గురవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గడంతోపాటు (Immunity power down).. అలసట, నీరసం కలుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ (digestive system) పై ప్రభావం చూపుతుంది. ఈ సీజన్లో కడుపులో హఠాత్తుగా నొప్పి వచ్చినా.. లేదా ప్రతిసారి తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న కొన్ని ఇంటి నివారణ పద్ధతులను (health tips) అనుసరించండి.

    కలబంద (Aloe vera)లో ఆస్ట్రిజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి . ఇది ఇన్ఫెక్షన్ ను నాశనం చేస్తుంది.  ఇంటర్నల్ బ్లీడింగ్ ను నివారిస్తుంది. ఇది కడుపును చల్లగా ఉంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్దకంను నివాిరస్తుంది. కడుపు నొప్పి  (stomach pain) మరియు క్రాంప్స్ ను నివారిస్తుంది . ఒక గ్లాసు నీళ్ళలో అలోవెరా జ్యూస్ (Aloe vera juice) ను మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం వేళ తాగితే మంచిది. చాలు.

    అల్లం (Ginger) లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . కడుపు నొప్పి  (stomach pain) నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది .  ఇది వికారం, మరియు వాంతులను నివారించడంలో సహాయపడుతుంది . దీనికి కొద్దిగా తేనె కూడా చేర్చి తీసుకోవచ్చు.

    కడుపు నొప్పి తగ్గించడానికి గోరు వెచ్చని ఉప్పునీటి (Lukewarm salt water) చిట్కా గ్రేట్ గా సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో ఒకటి లేదా రెండు చెంచాల ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి, ఆ నీటిని త్రాగాలి . ఇది నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . కడుపు నొప్పి నివారించడంలో ఇది ఒక మంచి పద్దతిగా చెప్పవచ్చు.



    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health Tips, Stomach Pain

    తదుపరి వార్తలు