IF YOU FACING SHOULDER PAIN REGULARLY THEN FOLLOW THIS SIMPLE TIPS TO GET RID OF THAT PAIN FULL DETAILS HERE PRV
Shoulder pain remedies: పనిచేశాక భుజం నొప్పిగా అనిపిస్తుంటుందా? అయితే ఈ చిట్కాలతో నొప్పికి చెక్ పెట్టండి..
ప్రతీకాత్మక చిత్రం
భుజం నొప్పికి పెయిన్ కిల్లర్స్ (pain killers) తీసుకుని తమ పనిని పూర్తి చేస్తుంటారు. కానీ, పదేపదే నొప్పి నివారణ మందులు తీసుకోవడం శరీరానికి ప్రయోజనకరం కాదట. అందుకే ఈ ఒంటినొప్పులు తగ్గించడానికి కొన్ని చిట్కాలు ( health tips) పాటిస్తే సరి.
కరోనా తగ్గాక మనిషికి శారీరక శ్రమ పెరిగింది. రోజంతా పనిచేసి ఇంటికి చేరుకున్నాక ఒంటినొప్పులు (body pains) మరో బాధను తెచ్చిపెడుతాయి. కనీసం హాయిగా పడుకుందామనుకున్నా.. ఇంటి బాధ్యతలు నిల్చోనివ్వవు, కూర్చోనివ్వవు. మరోవైపు కరోనా తెచ్చిన సమస్యలు మనిషిని అతలాకుతలం చేసింది. సగటు జీవి ఆర్థికంగానూ బలహీన పడటంతో మళ్లీ గాడిలో పడటానికి నానా తంటాలు పడుతున్నారు. ఎక్కువ సమయం పనిచేస్తున్నారు. దీంతో శారీరక శ్రమ అధికమవుతోంది. నొప్పులు (pains) తెచ్చిపెడుతోంది. అటువంటి పరిస్థితిలో చాలా సార్లు వారు కూడా పెయిన్ కిల్లర్స్ (pain killers) తీసుకుని తమ పనిని పూర్తి చేస్తుంటారు. కానీ, పదేపదే నొప్పి నివారణ మందులు తీసుకోవడం శరీరానికి ప్రయోజనకరం కాదట. అందుకే ఈ ఒంటినొప్పులు తగ్గించడానికి కొన్ని చిట్కాలు (Shoulder pain remedies ) పాటిస్తే సరి. ఇక చాలామందిలో భుజం నొప్పి చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాని అసలు భుజం నొప్పి (shoulders pain) తగ్గదు. ఇక భుజం నొప్పితో తీవ్రంగా బాధపడేవారు ఖచ్చితంగా ఈ సింపుల్ టిప్స్ పాటించండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది.
నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె ..
ఒక గిన్నె తీసుకుని అందులో మూడు స్పూన్ల పసుపు (Turmeric) ఇంకా అలాగే నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె (coconut oil)వేసి బాగా కలపాలి. ఇక ఈ మిశ్రమాన్ని (mixer) మీ భుజాలకు అప్లై చేసిన తరువాత అది బాగా డ్రై అయ్యే వరకూ ఉండాలి. ఇక ఆ తర్వాత వేడి నీరుతో శుభ్రం చేసుకోవాలి. ఇక ఇలా కనుక రోజూ ఉదయం ఇంకా సాయంత్రం కనుక చేస్తే.. మీకు మీ తీవ్రమైన భుజం నొప్పి నుంచి శాశ్వత ఉపశమనం అనేది మీకు లభిస్తుంది.
ఇలా స్నానం (bath) చేస్తే..
బకెట్ వేడి నీటిలో ఒక అర కప్పు వరకు ఎప్సోమ్ ఉప్పు (Epsom salt) వేసి బాగా కరిగించండి. ఇక అపై ఈ నీళ్లతో స్నానం చేయండి. ఇలా ప్రతి రోజు ఉదయం ఇంకా సాయంకాలం కనుక ఇలా స్నానం (bath) చేస్తే మీ కండరాల యొక్క ఒత్తిడి అనేది తగ్గిపోయి మీకు రక్త ప్రసరణ అనేది బాగా మెరుగుపడుతుంది. ఇక దీంతో మీకు భుజాల నొప్పి (shoulder pain) వెంటనే తగ్గిపోతుంది.
ఐస్ థెరపీ (Ice therapy) కూడా తీవ్రమైన భుజాల నొప్పిని ఎంతో సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇక ఒక కాటన్ క్లాత్ లో ఐస్ ముక్కలను చుట్టు దీనిని మీ భుజాలపై (shoulders) ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచుకుంటే. క్రమ క్రమంగా మీ భుజం నొప్పి అనేది తగ్గుతుంది. అలాగే భుజాల నొప్పికి పసుపు (turmeric) కూడా ఓ చక్కటి మంచి మెడిసిన్ అని చెప్పాలి.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.