Home /News /life-style /

IF YOU FACING HAIR PROBLEMS LIKE HAIR FALL HEAVILY THEN FOLLOW THIS METHODS REGULARLY AFTER THAT YOUR HAIR WOULD BE STRONG PRV

hair problem tips: జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే.. ఈ రెండు చిట్కాల్లో ఏదో ఒకటి ట్రై చేయండి చాలు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

చర్మం పొడిబారి చుండ్రు, జుట్టు రాలే సమస్యలు చాలా మందికి వస్తుంటాయి. అందుకే వారానికి రెండు సార్లయినా నూనె (Oil two times in a week) అప్లై చేయాలి. అందుకే ఇప్పుడు ఆ సహజ పదార్థాలతో జుట్టుని కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

    చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (fall) జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే (hair fall) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (hair problem tips) మంచి ఫలితాలను ఇస్తాయి.

    ఒకప్పుడు ప్రకృతిలో దొరికే శీకాయ, కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. ప్రతివారం నూనె (oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు (hair) అందరికీ ఉండేది. కానీ ఇప్పటి కాలుష్యం, షాంపూలు, హెయిర్ ప్రొడక్ట్స్ పూర్తిగా రసాయనాలకు అలవాటు పడిపోయారు. ఇవి జుట్టుకు ఎంతో నష్టం చేస్తున్నాయి. చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై చేయరు. దానివలన తలలో చర్మం పొడిబారి చుండ్రు, జుట్టు రాలే (hair fall) సమస్యలు వస్తాయి. అందుకే వారానికి రెండు సార్లయినా నూనె (Oil two times in a week) అప్లై చేయాలి.  ఇప్పుడు ఆ సహజ పదార్థాలతో జుట్టు (hair)ని కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.. పసుపు (Turmeric)తో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మం (skin)తో పాటు.. జుట్టు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఇందులోని యాంటీబయోటిక్ గుణాలు కేశ సంరక్షణకు బాగా పనికొస్తాయి.

    పసుపుతో పాటు.. ఇంట్లో లభించే దినుసులతో.. నల్లటి పొడవైన జుట్టును సొంతం చేసుకోవాలంటే ఓ పద్ధతిని పాటించండి. తొలుత నాలుగు టీస్పూన్ల పసుపును.. కప్పు పచ్చిపాలలో వేసి.. ఆ తర్వాత రెండు టీస్పూన్ల తేనెతో మిక్స్  చేసి మిశ్రమాన్ని తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి.. తర్వాత అంచుల వరకూ రుద్దుతూ అప్లై చేసుకోవాలి. ఆపై గంట పాటు అలాగే ఉంచి.. తర్వాత గోరు వెచ్చని నీరు, షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ఆరోగ్యకరమైన కేశాలు మీ సొంతమవుతాయి.

    మన జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలంటే దానికి కావాల్సింది ప్రొటీన్. జుట్టు పెరుగుదలకు కావాల్సిన మొదటి పదార్థం ఇది. ఆ ప్రోటీన్ ఎక్కువ లభించేది గుడ్డు (Egg)లోనే. అంతే కాదు.. గుడ్డు (Egg)లో సల్ఫర్, జింక్, ఐరన్, సెలీనియం, ఫాస్పరస్, అయోడిన్ వంటివన్నీ ఉంటాయి. అందుకే దీన్ని అప్లై చేసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. గుడ్లు సాధారణంగా జుట్టు పెరుగుదలకు తోడ్పడడం మాత్రమే కాకుండా..  దానికి తేమను కూడా అందిస్తాయి.

    గుడ్డులో (Egg) లభించే ఏ,ఇ,డి విటమిన్లు.. మన కుదుళ్లను బలంగా మార్చి జుట్టు రాలడాన్ని అరికడతాయి. అలాగే మీ జుట్టు మృదువుగా మెరుస్తూ కనిపించేలా చేస్తాయి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఎగ్ ప్యాక్‌ని కనీసం వారానికి ఒకసారైనా వేసుకోవడం. ఈ ప్యాక్ తయారు చేయడానికి అవసరమైనవి – ఒక గుడ్డు, టీ స్పూన్ ఆలివ్ నూనె, టీ స్పూన్ తేనె.

    ఎగ్ ప్యాక్ తయారుచేయాలంటే.. తొలుత గుడ్డును బౌల్‌లో వేసి బాగా బీట్ చేయాలి. తర్వాత అందులో కొద్దికొద్దిగా ఆలివ్ నూనె, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా మీ జుట్టుకు అప్లై చేయాలి. దీన్ని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్ల నీటితో తలస్నానం చేయాలి. గోరు వెచ్చని లేదా వేడి నీటిని వాడడం వల్ల గుడ్డు మిశ్రమం వెంట్రుకలకు అంటుకుపోతుంది. కాబట్టి.. తప్పనిసరిగా చల్లని నీటినే ఉపయోగించాలి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Egg, Hair problem tips, Turmeric

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు