Home /News /life-style /

IF YOU FACING HAIR FALL PROBLEMS HEAVILY THEN YOU MUST FOLLOW THIS PRECAUTIONS WHILE HEAD BATH PRV

hair fall సమస్య మరీ ఎక్కువగా ఉందా? అయితే తలస్నానం చేసేటపుడు ఈ టిప్స్​ పాటించండి.. జుట్టు రాలదు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. అలాంటి జుట్టు పొడుగుగా (long) పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట.

    జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా (beauty) కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్​ స్పెషలిస్టులను పెట్టుకుంటారు.

    మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అలాంటి జుట్టు పొడుగుగా (long) పెరగాలంటే కొన్ని చిట్కాలు (Hair fall treatment) పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట. కొందరు మంచి జుట్టు (Hair) ఉన్నవారిని చూసిన ప్రతిసారి బాధపడుతుంటారు. అందుకోసం ఇంటి చిట్కాలు (Hair fall treatment) పాటిస్తూ.. రకరకాల ఉత్పత్తులు వాడేస్తుంటారు. అందుకే జుట్టు పొడువుగా ఒత్తుగా పెరగాలంటే కొన్ని తప్పులు చేయడం ఆపేయాలి. అవేంటో ఒకసారి చూద్దాం..

    కండీషనర్‌ ఎంతో మేలు..

    తలస్నానం (hair bath) చేశాక కండీషనర్‌ను వాడటం తప్పనిసరిగా చేయాలి. జుట్టుకు పోషణ ఇవ్వడంతో పాటు మృదువుగా చేయడంలో కండీషనర్‌ ఎంతో మేలు చేస్తుంది. జుట్టు రాలే వాటిని నివారించడంలో కండీషనర్‌ను ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందంగా కనిపించడానికి చక్కటి హేర్‌స్టైల్‌ (hair style) ఉండడం అవసరమే, కానీ స్టైల్‌ కోసమని విపరీతంగా కెమికల్స్‌ వాడడం వల్ల జుట్టు రాలే సమస్య (hair fall) మరింత పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

    జుట్టు రాలడాన్ని (hair fall) నివారించడంలో విటమిన్‌ ఏ (Vitamin A), విటమిన్‌ ఇ, బయోటిన్‌, ప్రొటీన్‌, జింక్‌ తదితర పోషకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.చాలామంది తలకు నూనె రాయడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. క్రమం తప్పకుండా నూనెను వాడడం వల్ల జుట్టు రాలే సమస్య (Hair fall problem)ను నివారించవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.

    మీ శిరోజాల రకానికి అనుగుణమమైన ఏ నూనె అయినా ఎంచుకోవచ్చు. జుట్టు రాలే సమస్యకు మానసిక ఒత్తిడి (stress) ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు. కేవలం జుట్టు రాలే సమస్యే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న అనేక వ్యాధులకు మానసిక ఒత్తిడి ప్రధాన కారణమని ప్రపంచ ఆహార సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. మనం తీసుకునే ఆహార )food) నియమాల ద్వారానే మెరుగైన శిరోజాలను సొంతం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకోసం కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లలతో కూడిన సమతుల ఆహారమే దివ్యౌషదమని వైద్యులు సూచిస్తున్నారు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hair fall, Hair problem tips

    తదుపరి వార్తలు