Home /News /life-style /

IF YOU FACING HAILFALL PROBLEM REGULARLY THEN YOU MUST INCLUDE THIS FOOD IN YOUR DIET AFTER THAT YOUR HAIR WOULD BE STRONG PRV

hair fall treatment: మీ జట్టు రాలిపోతుంటే మీరు తినే ఆహారంలో ఈ పదార్థాలు తప్పక తీసుకోండి.. జుట్టు బలంగా అవుతుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అనారోగ్యకరమైన ఆహారం వల్ల సంభవించే కాలేయ వ్యాధులు తరచుగా జుట్టు రాలిపోవడం మరియు చుండ్రు వంటి జుట్టు సమస్యలతో ముడి పడి ఉంటాయి. కాబట్టి, ముందు సరిగ్గా తినడం ముఖ్యం.

    ఆకర్షణీయమైన పొడవాటి జుట్టు మీ అందాన్ని రెట్టింపు (Double) చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే, కొంతమంది తమ జుట్టు (Hair) ఎక్కువగా ఊడిపోతుందని బాధపడిపోతుంటారు. వాతావరణంలో అధిక తేమ కారణంగా తలపై చుండ్రు ఏర్పడుతుంది. ఈ చుండ్రు సమస్య కేవలం తలపైనే కాదు కనుబొమలు, భుజాలపై కూడా ఏర్పడి చర్మం పొడిబారేలా చేస్తుంది. చుండ్రుకు చెక్​పెట్టేందుకు ఇంటర్నెట్‌లో అనేక పద్ధతులు ఉన్నాయి. కానీ సరైన వాస్తవాలను (hair fall treatment) తెలుసుకొని మాత్రమే వాటిని ప్రయత్నించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

    అధిక పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, హెయిర్ డ్రయర్స్​ విపరీతంగా వాడటం, అలర్జీ వంటి కారణాల వల్ల జుట్టు సమస్య తరచూ వేధిస్తుంటుంది. ఈ సమయంలో వెంట్రుకలు పెలుసుగా తయారై జట్టు పలుచబడుతుంది. దీంతో విపరీతంగా జుట్టు రాలిపోయి చిన్న వయస్సులోనే బట్టతల వచ్చే ప్రమాదం ఉంది.

    జుట్టు పెరుగుదలను (Hair growth) వేగంగా ప్రోత్సహించడానికి ఉపయోగపడే అన్ని పదార్ధాలతో పాటు, కనీస అవసరమైన వాటిలో ఒకటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. మీరు లోపల నుండి ఆరోగ్యంగా లేనప్పుడు వివిధ పదార్ధాలను తలకు పట్టించడం వల్ల ఎటుంవంటి ప్రయోజనం ఉండదు.

    అనారోగ్యకరమైన ఆహారం (Unhealthy food) వల్ల సంభవించే కాలేయ వ్యాధులు తరచుగా జుట్టు రాలిపోవడం మరియు చుండ్రు వంటి జుట్టు సమస్యలతో ముడి పడి ఉంటాయి. కాబట్టి, ముందు సరిగ్గా తినడం ముఖ్యం. జుట్టు పెరిగే ప్రక్రియను వేగవంతం చేయడానికి మరియు మీ జుట్టు బలంగా మరియు మెరిసేలా చేయడానికి మీ ఆహారంలో తగినంత ప్రోటీన్ల (Proteins)ను చేర్చాలని తెలుసుకోండి. జుట్టు పెరుగుదలను పెంచడానికి మరియు మీ జుట్టుకు పరిమాణాన్ని మెరుగుపర్చడానికి కొబ్బరి మరియు డ్రై ఫ్రూట్స్ కూడా సమానంగా అవసరం.

    ఆకుకూరలు (Greens), పండ్లు (Fruits), మొలకలు, నట్స్ మరియు పెరుగు లను మీ ఆహారంలో ఎప్పుడూ చేర్చాలి. జుట్టు మరియు క్యూటికల్స్ పెరుగుదలను నిర్వహించడానికి విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి పండ్ల రూపంలో విటమిన్ల వినియోగం, ముఖ్యంగా సిట్రస్ పండ్ల వినియోగం కూడా చాలా అవసరం.

    డీహైడ్రేషన్ ను నివారించండి మరి మీ శరీరంలోని నీటి (water) శాతాన్ని తగినంతగా నిర్వహించండి. డీహైడ్రేషన్ పొడి చర్మం మరియు నిస్తేజమైన జుట్టుకు దారితీస్తుంది. నెత్తి (స్కాల్ప్)కి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి తగినంత నీరు త్రాగాలి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hair fall, Hair problem tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు