Home /News /life-style /

IF YOU FACING DANDRUFF PROBLEM IN HAIR THEN FOLLOW THSE SHIKAYA AND KUNKUDU PACKS PRV

Beauty tips: జుట్టులో చుండ్రు సమస్య అధికంగా ఉందా? అయితే ఈ శీకాయ, కుంకుడు కాయల ప్యాక్​లతో దూరం చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శీకాయ, కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. ప్రతివారం నూనె (oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు (hair) అందరికీ ఉండేది. చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై (apply) చేయరు. దాని వలన తలలో చర్మం పొడిబారి చుండ్రు (dandruff), జుట్టు రాలే సమస్యలు వస్తాయి

ఇంకా చదవండి ...
  మనిషి అందానికి కేశాలు (hair) కూడా ముఖ్యమే. కానీ, సగటు జీవిలో జుట్టు రాలిపోతుండటాన్ని (hair loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని (beauty) రెట్టింపు చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (fall) జరుగుతుంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్ల జుట్టు (white hair) చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ (Products) కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (beauty tips) మంచి ఫలితాలను ఇస్తాయి.

  ఒకప్పుడు ప్రకృతిలో దొరికే శీకాయ, కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. ప్రతివారం నూనె (oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు (hair) అందరికీ ఉండేది. చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై (apply) చేయరు. దాని వలన తలలో చర్మం పొడిబారి చుండ్రు (dandruff), జుట్టు రాలే సమస్యలు వస్తాయి. కొన్ని సహజ పద్దతులతో జుట్టుని కాపాడుకోవచ్చు (save hair). చుండ్రు సమస్యతోను, అలాగే జుట్టు రాలిపోయే (hair fall) సమస్యతో బాధ పడుతూ ఉంటారు. ఇక అలా అనేక జుట్టు సమస్యలతో బాధ పడేవారు ఈ పద్ధతులు పాటించండి.

  శీకాయ కుంకుడుకాయ..

  శీకాయ, కుంకుడుకాయలు జుట్టుకి చక్కటి క్లెన్సర్స్‌గా (cleaners) పనిచేస్తాయి. మాడుని శుభ్ర పరుస్తాయి (clean). వీటిలో ఉండే విటమిన్‌-ఎ, కె, సి,డీలు జుట్టును ఆరోగ్యం (healthy hair)గా ఉంచుతాయి. ముందుగా ఈ కాయల్ని వేడి నీళ్లల్లో వేసి మరగనివ్వాలి. అందులోనే గుప్పెడు మందార పూలూ కూడా వేయాలి. బాగా కాచిన ఆ నీళ్లను చల్లారాక వడకట్టాలి. ఆపై వాటితో తలస్నానం చేస్తే సరి. జుట్టు మెత్తగా మారుతుంది. చుండ్రు (dandruff) సమస్య దరిచేరదు.

  కాస్టర్ ఆయిల్..

  కాస్టర్ ఆయిల్ అత్యంత ప్రయోజనకరమైన నూనె (oil)లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆముదం నూనె వాడడం వల్ల జుట్టు మృదువుగా పెరుగుతుంది. ఈ నూనె జుట్టుకు తేమను ఇస్తుంది . తెల్ల  వెంట్రుకల (WHITE HAIR)ను తగ్గిస్తుంది. మంచి ఫలితాలను పొందడానికి, వారానికి రెండుసార్లు జుట్టుకు కాస్టర్ ఆయిల్ వాడింది.

  ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

  కలబందని గుజ్జును తీసుకుని  మీ జుట్టుకు రాయండి.  రాసుకున్న ఒక గంట తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చెయ్యటం వలన చుండ్రు సమస్య తగ్గుతుంది. సమపాళ్లలో గోరింటాకు, మెంతికూరల్ని తీసుకుని రుబ్బుకోవాలి. దీనికి చెంచా పెరుగు, కాస్త నిమ్మరసం కలిపి వెంట్రుకలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే కురులు నిగనిగలాడతాయి.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

  ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి  ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ayurveda, Beauty tips, Dandruff, Healthy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు