Home /News /life-style /

IF YOU FACING ANY SLEEPING PROBLEM IN NIGHT THEN IT CAUSES MANY HEALTH ISSUES IN FUTURE FULL DETAILS HERE PRV

Sleep problems: రాత్రి సమయాల్లో నిద్ర సరిగా పట్టడం లేదా? అయితే ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వేళకు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల నిద్ర లేమి (Insomnia) సమస్యలు వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నేటి తరం జనాలు. అయితే సరైన నిద్ర (sleep) శరీరానికి అందకపోతే చాలా సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు

    కరోనా (corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత (peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టని వారున్నారు. నిద్ర (Sleep) ఆరోగ్యానికి ఎంతో మంచిదో అందరికీ తెలిసిన విషయమే. సరైన నిద్ర (sleep) లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడుతుంటాయి. అంతేకాకుండా సరైన నిద్ర (sleep) లేకపోతే చిరాకు టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏ పనిమీద సరిగ్గా కాన్సెంట్రేట్ చేయలేకపోతుంటాం. 

    అతి నిద్ర వల్ల కూడా ఆరోగ్య సమస్యలు (health problems) బాగానే వచ్చిపడతాయి. నిద్ర శరీరానికి ఎంత మోతాదులో కావాలో అంతే మోతాదులో నిద్ర పోవాలి. తక్కువ నిద్ర పోయినా ఎక్కువ నిద్ర పోయినా ఆరోగ్య సమస్యలు (health problems) తప్పవు అని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. అయితే నేటి కాలంలో మాత్రం నిద్రకు అంతగా విలువ ఇవ్వడం లేదు. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న నేటి తరం జనాలు... అతి తక్కువ సమయం నిద్రపోవడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. అంతేకాకుండా ఒత్తిడుల కారణంగా కూడా రాత్రి సమయాల్లో నిద్ర రాక అలాగే మేల్కొండి పోయి నిద్రలేమి (Insomnia)కి గురవుతున్నారు.  దీని ద్వారా చిన్న వయసులోనే ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారు.

    నిద్రపోకపోతే ఏమవుతుందిలే..

    వేళకు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల నిద్ర లేమి (Insomnia) సమస్యలు వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నేటి తరం జనాలు. అయితే సరైన నిద్ర (sleep) శరీరానికి అందకపోతే చాలా సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు... కానీ ఎవరు వాటిని మాత్రం పట్టించుకోరు. ఇక ఆరోగ్య సమస్యలు (health problems) వచ్చిన తరువాత హాస్పిటల్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే ఒక రోజు నిద్ర సరిగ్గా పోకపోయినా ఎంతో ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. చాలామంది ఒకరోజు నిద్రపోకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్క రోజు నిద్ర (sleep) పోయినా అది ఎంతో ప్రభావం చూపుతుందని వైద్యులు అంటున్నారు.

    డీఎన్ఏ లో ఎన్నో మార్పులు..

    ఒక్క రోజు నిద్ర పోకపోయినా డీఎన్ఏ (DNA) లో ఎన్నో మార్పులు జరుగుతాయని.. హాంకాంగ్ కు  చెందిన షూ వేస్ చాయ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. నిద్రని కోల్పోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తన పరిశోధనలో తేలిందని ఈ శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన కొంత మందిపై చేసిన పరిశోధనలో విషయం తేలిందని ఆయన వెల్లడించారు. ఒక్కరోజు నిద్రపోకపోతే దాని ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు (experts) చెబుతున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు (health problems) వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Sleep tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు