ఈ నాలుగు పనులు చేస్తే చాలు 100కు పైగా రోగాలు మీ దరిచేరవు...

100కు పైగా రోగాలకు దూరంగా ఉండాలంటే ఈ నాలుగు నియమాలు పాటిస్తే చాలు. అవేంటో తెలుసుకుందాం…

news18-telugu
Updated: September 28, 2020, 1:27 AM IST
ఈ నాలుగు పనులు చేస్తే చాలు 100కు పైగా రోగాలు మీ దరిచేరవు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆరోగ్యమే మహాభాగ్యమనే మాట అందరికి తెలుసు కాని, దానిని పాటించడంలో చాలా మంది దూరంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటేనే మనషి ఏదైనా చేయగలడు. అది మరిచిపోయి మనిషి చాలా కాలం అయ్యింది. డబ్బుంటే చాలు ఏదైనా చేయగలదు అని ఫిక్స్ అయిపోయి దాని కోసం పరుగులు తీసి, విలువైన ఆరోగ్యాన్ని దూరం చేసుకుంటున్నారు. 100కు పైగా రోగాలకు దూరంగా ఉండాలంటే ఈ నాలుగు నియమాలు పాటిస్తే చాలు. అవేంటో తెలుసుకుందాం…

చాలా మంది నీళ్ళు చాలా ఫాస్ట్ గా తాగుతారు. అందులోనూ ఎండాకాలం అంటే ఇంకా ఫాస్ట్ గా తాగుతారు. కాని నీళ్ళు టీ, కాఫీ ఎలా తాగుతామో అలా తాగితే మంచిది. నీళ్లను సిప్ చేస్తూ తాగడం వలన ప్రతి గుటక నీటితో, మన నోటిలో ఉండే లాలాజలం కొంత మొత్తంలో శరీరంలోకిపోతుంది. దీంతో ఎలాంటి హాని కలగదు.అంతేకాకుండా నీళ్లను గటగటా తాగడం వల్ల శరీరంలోని హైడ్రోక్లోరిన్ ఎక్కువ మొత్తంలో చర్య జరపాల్సి ఉంటుంది. దాంతో అధిక ఎసిడిటి ఏర్పడుతుంది.

బాగా చల్లగా ఉండే నీటిని ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. శరీరంలో ఎప్పుడు ఎదో ఒక క్రియ జరుగుతూనే ఉండటం వలన మన శరీరంచాలా వేడిగా ఉంటుంది. దానికి తోడు చల్లటి నీళ్ళు తాగితే రెండు భిన్న వ్యతిరేకమైన టెంపరేచర్ మన శరీరం మీద పడి చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎండాకాలం చల్లటి నీళ్ళు కావాలంటే కుండలో నీళ్ళు తాగితే మంచిది.

భోజనం తినడానికి ముందు, తరవాత కూడా అరగంట నీళ్ళు తాగకండి. ఎందుకంటే తిన్న ఆహారం పొట్టలోని ఈసోపేగాస్‌లోకి వెళతాయి. అక్కడ హైడ్రాలిక్ యాసిడ్ సూక్ష్మక్రిములను చంపేసి కొంత ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలు చేస్తుంది. తక్కువ పీహెచ్ విలువ కలిగిన హైడ్రోక్లోరిన్ యాసిడ్ ఎంజైమ్‌లకు ఉపయోగపడి మనం తిన్న ఆహారం త్వరితంగా జీర్ణమైశక్తిని విడుదలయ్యేలా చేస్తుంది. ఈ ప్రక్రియ జరుగుతున్నా సమయంలో మనంతిన్న వెంటనే నీళ్లు తాగితే, మన జీర్ణ వ్యవస్థ నెమ్మెదిస్తుంది. దానితో జీర్ణం తర్వాత వ్యర్థలు శరీరంలో అలాగే మిగిలిపోతాయి. దానితో అనేక రోగాలు వస్తాయి.

పొద్దున్న నిద్ర లేవగానే ౩ గ్లాసులు నీళ్ళు తాగిన తరవాతే ఏ పనైనా చేయండి. రాత్రి రాగి చెంబులో నీళ్ళు పోసి ఉదయాన్నే ఆ నీళ్ళు తాగితే కూడా చాలా మంచిది. నిద్రలేవాగానే నీళ్లు తాగడం వల్ల రాత్రి నుంచి ఉదయం వరకు శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలన్నీ మల, మూత్ర విసర్జన రూపంలో బయటకి వెళ్తాయి. ఇలా చేయడం వల్ల మలమూత్ర విసర్జన రెండూ ఒకేసారి పూర్తవుతాయి. ఒకేసారి రెండు విసర్జిస్తే వారికి రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ.
Published by: Krishna Adithya
First published: September 28, 2020, 1:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading