Kitchen tips: ఈ ఒక్క పనిచేస్తే.. స్పైడర్‌ వెబ్ పర్మినెంట్‌గా రాదు!

కొన్ని రకాల చిట్కాలతో మన సమయం ఆదా అవ్వడంతోపాటు డబ్బు కూడా వృథా అవ్వదు. అందుకే ఒక వస్తువు వినియోగించేటపుడు దాని పూర్వాపరాలు తెలుసుకోని వాడాలి.

కొన్ని రకాల చిట్కాలతో మన సమయం ఆదా అవ్వడంతోపాటు డబ్బు కూడా వృథా అవ్వదు. అందుకే ఒక వస్తువు వినియోగించేటపుడు దాని పూర్వాపరాలు తెలుసుకోని వాడాలి.

  • Share this:
మనం ఇంటిని అందంగా ఉంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అయినా.. వారం తిరగగానే మళ్లీ దుమ్మూధూళితో పేరుకుపోతుంది. అదేవిధంగా కొన్ని పనులు మనకు తెలియకపోవడం వల్ల డబ్బు కూడా వృథా అవుతుంది. అయితే, కొన్ని చిట్కాలతో ఆరోగ్యంగా, అందంగా ఇంటిని ఎలా మలుచుకోవాలో తెలుసుకుందాం.

  1. అద్దాన్ని శుభ్రం చేసేటపుడు మెత్తటి కాటన్‌ క్లాత్‌ను తీసుకుని వేడినీటిలో ముంచి.. దాంతో అద్దం క్లీన్‌ చేస్తే.. చక్కగా మెరుస్తుంది.

  2. ఇక ఇలా మిర్రన్‌ను శుభ్రం చేసేటపుడు క్లీనింగ్‌ ఎలిమెంట్లను డైరెక్టుగా అద్దానికి చల్లుతారు. అలా చేయకూడదు.. ఏదైనా కాటన్‌ క్లాత్‌ తీసుకుని దానిపై చల్లి తుడవాలి.

  3. చదువుకునే పుస్తకాలు పెట్టుకునే బుక్‌షెల్ఫ్సలో కూడా చిన్న పురుగులు చేరుతుంటాయి. వాటిని అలాగే వదిలేస్తే.. అవి బుక్స్‌ను కూడా తినేస్తాయి. అలాకాకుండా ఉండాలంటే.. ఆ ప్రదేశంలో కాస్త చందనం పొడిని చల్లితే పురుగులు పట్టవు.

  4. మనం ఏదైనా వస్తువులను అంటించడానికి గ్లూ ఉపయోగిస్తాం. అందులో కాసింత అలాగే ఉండి.. కొన్ని రోజుల తర్వాత అది ఎండిపోతుంది. గ్లూలో కొద్దిగా గ్లిజరిన్‌ వేసి వేడిచేయాలి. మళ్లీ గ్లూ ఎప్పడిలాగే మారిపోతుంది.


నిల్వ చేసిన పిండిలో పురుగులు చేరుతున్నాయా? ఈ విధంగా తరిమేయండి!




  1. స్కూల్‌కు వెళ్లే పిల్లలు వైట్‌ షూ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే, వాటిపై మరకలు పడతాయి. అవి కాస్త మొండి మరకలు ఉంటే ఎంత ఉతికినా... పోవు. అటువంటపుడు దూదిని తీసుకుని నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌లో ముంచి మరకపై రుద్దాలి. మంచి రిజల్ట్‌ ఉంటుంది.

  2. మిక్సీలో మసాలాలు గ్రైండ్‌ చేసిన తర్వాత కడిగినా.. కూడా వాసనపోదు. అటువంటప్పుడు ఆ మిక్సీ జార్‌లో ఎండిపోయిన బ్రెడ్‌ ముక్కలు వేసి ఒకసారి తిప్పితే సరిపోతుంది.

  3. మన ఇంటిని తరచూ శుభ్రం చేసినా.. దుమ్మూధూళితో మళ్లి స్పైడర్‌వెబ్‌లు వస్తాయి. అటువంటపుడు ఉన్న బూజు దులిపి,ని మ్మరసం కలిపిన నీటిని ఆ ప్రాంతంలో స్ప్రే చేయాలి. ఇలా వారానికి ఒకసారి 5 వారాలు చేస్తే.. పర్మినెంట్‌గా బూజు పట్టదు. ఎందుకంటే సాలెపురుగులకు పులుపు వాసన అస్సలు పడదు. నిమ్మకు బదులు వెనిగర్‌ కూడా వాడచ్చు.

Published by:Renuka Godugu
First published: