హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Home Remedies: మీ చర్మంపై పగుళ్లు వస్తున్నాయా..? ఈ టిప్స్‌తో మృదువుగా మార్చుకోండి..

Home Remedies: మీ చర్మంపై పగుళ్లు వస్తున్నాయా..? ఈ టిప్స్‌తో మృదువుగా మార్చుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Home Remedies: కొంతమందికి ఎల్లప్పుడూ చేతులు పొడి బారడంతో పాటు చర్మంపై పగుళ్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అలర్జీలు, ఇతర అనారోగ్యాలకు కూడా ఈ సమస్య కారణమవుతుంది. అయితే హ్యాండ్స్‌ను క్లీన్‌గా ఉంచుకోవడంతో పాటు వాటి హైజిన్‌‌ను ఈ ఇంటి చిట్కాలతో మెయింటేన్ చేయొచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రస్తుత వర్షాకాల సీజన్‌ (Rainy Season)లో వాతావరణం (Climate) ఒక్కసారిగా మారిపోతోంది. కొన్ని రోజులు వరుసగా వర్షాలు, మరికొన్ని రోజులు ఉక్కపోత.. ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి చర్మ సంరక్షణ ఒక సవాలుగా మారుతుంది. కొంతమందికి ఎల్లప్పుడూ చేతులు పొడి బారడంతో పాటు చర్మంపై పగుళ్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అలర్జీలు, ఇతర అనారోగ్యాలకు కూడా ఈ సమస్య కారణమవుతుంది. అయితే హ్యాండ్స్‌ను క్లీన్‌గా ఉంచుకోవడంతో పాటు వాటి హైజిన్‌‌ను ఈ ఇంటి చిట్కాలతో మెయింటేన్ చేయొచ్చు. ఆ టిప్స్ ఏవో తెలుసుకుందాం.

* కలబంద జెల్

ఆయుర్వేద మందుల తయారీలో వాడే కలబందతో చర్మ సమ్యలకు చెక్ పెట్టవచ్చు. కలబంద గుజ్జును పగుళ్లు వచ్చిన చేతులకు అప్లై చేస్తే, సమస్య దూరమవుతుంది. ఈ జెల్ చర్మంపై తేమ శాతాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని అప్లై చేసిన తర్వాత చేతులను మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

* గోరువెచ్చని నీటితో క్లీనింగ్

మన రెగ్యులర్ పనుల్లో భాగంగా ఎక్కువ సేపు చేతులతో వర్క్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో హ్యాండ్ స్కిన్ రఫ్‌గా మారుతుంది. అలా చేతులు పొడి బారడంతో పాటు వాటిపైన పగుళ్లు వస్తాయి. ఎక్కువ సమయం వర్షంలో తడిసినా, చేతులు పొడిబారవచ్చు. అవి పోవాలంటే చేతులను గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఆ తర్వాత వస్త్రంతో తుడుచుకుని క్రీమ్ లేదా లోషన్ అప్లై చేస్తే మీ హ్యాండ్స్ సాఫ్ట్ అండ్ స్మూత్‌గా మారుతాయి.

* పాలతో ఇలా..

పాలలో ఉండే పోషకాలు చేతులను తేమగా ఉంచడంలో తోడ్పడుతాయి. గోరువెచ్చని పాలలో చేతులను పది నిమిషాల పాటు ఉంచితే మీ చేతులు సాఫ్ట్‌గా మారుతాయి. దీనివల్ల చేతులపైన ఉన్న చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.

ఇది కూడా చదవండి : కొబ్బరి చట్నీ తినడం వల్ల చాలా ప్రయోజనాలు.. తెలుసుకోండి..

* తేనె

రఫ్‌గా మారిన చేతులను స్మూత్ అండ్ సాఫ్టర్ చేసుకోవడం కోసం తేనెనూ ఉపయోగించొచ్చు. చేతులపైన తేనెను అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత చేతులను పరిశుభ్రమైన నీటితో కడుక్కోవాలి. అంతే మీ చేతులు మృదువుగా తయారవుతాయి.

* మాయిశ్చరైజర్స్

పగుళ్లు వచ్చి పొడి బారిన చేతులను మొదట వాటర్‌తో క్లీన్ చేయాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. తద్వారా చర్మంపైనున్న డ్రైనెస్ తొలగిపోతుంది. ఆ తర్వాత చేతులును క్లీన్ చేయాలి. అప్పుడు హ్యాండ్ క్రీమ్ గానీ లోషన్ గానీ అప్లై చేయడం ద్వారా మీ హ్యాండ్స్‌పైన ఉన్న స్కిన్ తేమ శాతం నింపుకొని సాఫ్ట్‌గా మారుతుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Health care, Healthy food, Life Style, Skin care

ఉత్తమ కథలు