హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Seasonal Diseases: సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..

Seasonal Diseases: సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కొద్దిరోజులుగా వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయింది. ఇలా సీజ‌న్ మారిన‌ప్పుడు సాధార‌ణంగా ర‌క‌ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా వ‌ర్షాకాలంలో జ‌లుబు, వైర‌ల్ ఫీవ‌ర్లు, ఇత‌ర‌త్రా అంటువ్యాధులు వ్యాపించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కొద్దిరోజులుగా వాతావ‌ర‌ణం (weather) పూర్తిగా మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్క‌డ‌క్క‌డ మోస్త‌రు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలా సీజ‌న్ మారిన‌ప్పుడు సాధార‌ణంగా ర‌క‌ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా వ‌ర్షాకాలంలో జ‌లుబు, వైర‌ల్ ఫీవ‌ర్లు, ఇత‌ర‌త్రా అంటువ్యాధులు (seasonal disases) వ్యాపించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఓ పక్క కరోనా మరో పక్క సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి పోషకాహారం తీసుకుంటూ రోగనిరోధశక్తిని (Immunity power) పెంపొందించుకోవాలి. అలాగే పరిశుభ్రత కూడా చాలా అవసరం. లేదంటే మన దగ్గరి నుండి మిగతా వారికీ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి ప్రభావంతో రోగనిరోధక శక్తికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వవలసి వస్తుంది. ఇమ్మ్యూనిటి పవర్ అధికంగా ఉండడం వల్ల శరీరంలో రోగకారక క్రిములతో పోరాడే శక్తి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదు.

  వాతావరణంలోని మార్పుల వల్ల అనేక రకాల వ్యాధులు తలెత్తడం సహజం. కానీ వాటిని లైట్ తీసుకుంటే మాత్రం తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మీ ఆరోగ్యం గురించి ఏ చిన్న అనుమానం తలెత్తినా మీ సొంత వైద్యం కాకుండా.. నిపుణుల సలహా తీసుకున్నాకే ఆయా మాత్రలు, సప్లిమెంట్స్‌ వేసుకోవాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.

  జాగ్రత్తలు ఇవే..

  వండుకునే ఆహారం విషయంలో జాగ్రత్త తప్పనిసరి.

  ఉదయం వండినవి రాత్రి, రాత్రి మిగిలిపోయినవి మరునాడు ఉదయం తినడం అస్సలు మంచిది కాదు.

  నీటిని శుద్ధి చేసుకుని లేదా వేడి చేసుకుని తాగ‌డం మంచిది. పరగడుపున వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగై, విరోచనం సాఫీగా జరుగుతుంది.

  ఆవ‌పిండితో చేసిన వంట‌కాలు తిన‌డం వ‌ల్ల అంటువ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

  ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుండి కొంతమేర బయటపడవచ్చు. సీజనల్ వ్యాధుల పట్ల మరీ నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదకరంగా మారే అవకాశం వుంది. దీనితో శరీరం సహకరించకపోగా నీరసం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు తోడవుతాయి. కాబట్టి మనం తినే ఆహరం నుండి మొదలుపెడితే మిగతా అన్ని విషయాల్లోనూ పరిశుభ్రత పాటిస్తే అంటువ్యాధులను తరిమికొట్టొచ్చు. అయితే చర్మ వ్యాధులన్నీ అంటువ్యాధులు కావడంతో వాటి పట్ల అప్రమత్తత అవసరం.

  Published by:Rajasekhar Konda
  First published:

  Tags: Health Tips

  ఉత్తమ కథలు