IF YOU ARE SUFFERING FROM HEART DISEASES BETTER TAKE FISHES ONCE IN WEEK RNK
Heart diseases: గుండెజబ్బు ఉన్నవారు చేపలు తింటే ఏమవుతుందో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
Eating small fishes: చిన్న చేపల్లో కాల్షియం, కొన్ని మైక్రో న్యూట్రియెంట్స్ ఉంటాయి. చేపల్లో విటమిన్ ఏ, డీ, అయోడిన్ ఉంటాయి. చేపల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించే శక్తి కూడా ఉంటుంది.
ఈ రోజుల్లో గుండెజబ్బుల Heart disease బారిన పడుతున్నవారు ఎక్కువతున్నారు. దీనికి ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ దీనికి బాధితులుగా మారుతున్నారు. అయితే, లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుంటే గుండెజబ్బులకు దూరంగా ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వారానికి రెండుసార్లు చేపలు Fishes తినడం వల్ల గుండె జబ్బులు లేదా స్ట్రోక్ ఉన్నవారు గుండె సమస్యలను నివారించవచ్చు. కొత్త అధ్యయనం ప్రకారం చేపల్లో ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి సీవీడీ ప్రతికూల సమస్యలను తగ్గిస్తుంది.
ప్రతివారం ఓమేగా 3 అధికంగా ఉండే చేపలు తిన్న వ్యక్తుల్లో ఎక్కువ రిస్క్ ఉన్నవారిని ఆరవ వంతు మందిని గుండెపోటు, స్ట్రోక్ సమస్యలను తగ్గుముఖం పట్టాయి. ఆండ్రూ మెండే, మెక్మాస్టర్ విశ్వవిద్యాలయంలోని అసోసియేట్ ప్రొఫెసర్, పరిశోధన అసోసియేట్ ప్రొఫెసర్ ప్రకారం గుండె జబ్బులు ఉన్న వ్యక్తులు చేపలు తినడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. వాస్కులర్ రోగులకు చేపల వినియోగం, ముఖ్యంగా ఆయిలీ చేపలు హృదయ సంబంధిత ప్రయోజనాలు కలిగించవచ్చు అన్నారు.
జామా ఇంటర్నెషనల్ మెడిసిన్ జర్నల్ అధ్యయనం ప్రకారం 1,92,000 మంది వ్యక్తులు ఈ సమస్య నుంచి బయట పడ్డారు. ఇందులో 52 వేల మందికి సీవీడీ సమస్య ఉంది. ఈ పరిశోధన 25 ఏళ్లుగా పీహెచ్ఆర్ఐ నిర్వహించిన అనేక అధ్యయనాల డేటాపై ఆధారపడి ఉంది. గుండె జబ్బులు లేదా పక్షవాతం లేని వ్యక్తుల్లో చేపలు తినడం వల్ల ప్రయోజనం లేదు.
గుండె జబ్బులకు తక్కువ ప్రమాదం ఉన్న వ్యక్తులు ఒమేగా 3 అధికంగా ఉండే చేపలను తినడం ద్వారా సీవీడీ నుంచి కొంత రక్షణ పొందవచ్చని పరిశోధకులు తెలిపారు. అయితే, ఆరోగ్య ప్రయోజనాలు అధిక ప్రమాదం ఉన్నవారి కంటే తక్కువ ఉంటుంది.
చేపల వల్ల ప్రయోజనాలు..
చేపలు చాలా సులభంగా జీర్ణమయ్యే పోషకాలు కలిగి ఉంటాయి. చేపలు కూడా అద్భుతమైన ప్రోటీన్ ఆహారం. ఇందులో విటమిన్ బీ12 కలిగి ఉంటుంది. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి గుండెను దెబ్బతినకుండా కాపాడతాయి. చిక్కుళ్లు, గింజలు తినే అవకాశం లేనివారు ఈ చేపలు తినవచ్చు. చేపల్లో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇతర అన్ని పోషకాలు ఉన్నాయని గమనించండి. అవి మీ గుండెను కాపాడతాయి. ఆయువును కూడా పెంచుతాయి.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.