హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Ayurvedic Medicine: ఈ ఆయుర్వేద మిశ్రమంతో వైరల్ ఇన్ఫెక్షన్లకు చెక్.. బోలెడు ప్రయోజనాలు..

Ayurvedic Medicine: ఈ ఆయుర్వేద మిశ్రమంతో వైరల్ ఇన్ఫెక్షన్లకు చెక్.. బోలెడు ప్రయోజనాలు..

Photo Credit : Shutterstock

Photo Credit : Shutterstock

Ayurvedic Medicine: ఈ సీజన్‌లో వైరల్ ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టే ఆయుర్వేద పద్ధతులు కొన్ని ఉన్నాయి. మన ఇంట్లో ఉండే అల్లం, తులసి, తేనెతో తయారు చేసే మిశ్రమంతో సీజనల్ ఇన్పెక్షన్లను దూరం చేసుకోవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం వర్షాకాలం (Monsoon Season) మూగిసి, చలి తీవ్రత పెరుగుతోంది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు (Tempratures) క్రమంగా పడిపోతున్నాయి. అయితే ఈ వాతావరణ మార్పుల ప్రభావం మన శరీరంపై పడుతుంది. కొంతమందిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఫలితంగా ఈ సీజన్‌లో వైరల్ ఇన్పెక్షన్లు వ్యాపిస్తాయి. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు ముక్కు, గొంతు, నాడీ, జీర్ణాశయ సమస్యలకు కారణమవుతాయి. దీంతో దగ్గు, తుమ్ములు, జ్వరం వంటివి వేధిస్తాయి. అయితే ఇలాంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టే ఆయుర్వేద పద్ధతులు కొన్ని ఉన్నాయి. మన ఇంట్లో ఉండే అల్లం, తులసి, తేనెతో తయారు చేసే మిశ్రమంతో సీజనల్ ఇన్పెక్షన్లను దూరం చేసుకోవచ్చు.

దగ్గు, జలుబు, గొంతు నొప్పితో పాటు మరెన్నో వ్యాధులకు ఉపశమనం కలిగించే నేచురల్ మెడిసిన్‌ అల్లం. ఇందులో జింజెరాల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు, అలర్జీలను దూరం చేస్తాయి. అల్లంలోని యాంటీ-మెడినల్ లక్షణాలతో సీజనల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు.

ఈ సీజన్‌లో పొగమంచు, చలి గాలుల తీవ్రత పెరిగే కొద్దీ, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే అత్యంత శక్తివంతమైన మూలికలలో ముఖ్యమైనది తులసి. వైరస్‌తో పోరాడే అనేక యాంటీ-మైక్రోబయల్ ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి. దగ్గును తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, కాలేయాన్ని శుద్ధి చేయడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిడిని దూరం చేయగలిగే లక్షణాలు తులసి ఆకుల్లో ఉంటాయి. ఇన్ని ఆయుర్వేద గుణాలు ఉన్న అల్లం, తులసిని.. కాస్త తేనెతో కలిపి తీసుకుంటే ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. అల్లం, తులసిని నీటిలో వేసి మరిగించి, తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేదా టీ రూపంలో కూడా తాగవచ్చు.

* ఆయుర్వేద మిశ్రమం

ప్రతిరోజూ ఉదయం తేనె, తులసి మిశ్రమాన్ని తీసుకుంటే అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. ఈ ఆయుర్వేద మెడిసిన్.. సీజనల్ మార్పులతో వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెడుతుంది. అల్లం, తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు జలుబును కలిగించే వైరస్‌తో సమర్థంగా పోరాడతాయి. తులసిలోని సమ్మేళనాలు ఇన్‌ఫ్లమేషన్‌ను దూరం చేస్తాయి.

అందుకే ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి ఈ మిశ్రమాన్ని సిఫారసు చేస్తారు ఆయుర్వేద నిపుణులు. ఈ మూలికల మిశ్రమంలో కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, జింక్, ఐరన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మన శరీరానికి అందిస్తాయి.

ఆయుర్వేదం ప్రకారం.. తులసి, అల్లం, తేనె సమ్మేళనం వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగులకు త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజంతా చురుకుగా ఉండే శక్తిని పెంచుతాయి.

First published:

Tags: Ayurvedic health tips, Health care, Life Style, Viral infection

ఉత్తమ కథలు