హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Nail Biting: గోళ్లు కొరికే అలవాటు ఎందుకు వస్తుంది..? ఈ అలవాటును ఇలా దూరం చేసుకోండి..!

Nail Biting: గోళ్లు కొరికే అలవాటు ఎందుకు వస్తుంది..? ఈ అలవాటును ఇలా దూరం చేసుకోండి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nail Biting: గోళ్లలో సార్మేనేలా, క్లేబ్సిల్లా అనే హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఒనికోఫాగియా ఉన్నవారిలో ఇది నోటి ద్వారా శరీరంలోకి వెళ్లి ఫుడ్ పాయిజన్‌కు కారణమతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు గోళ్లు కొరుక్కోవడానికి కారణాలేంటి, ఈ అలవాటును దూరం చేసే మార్గాలేంటో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రతి ఒక్కరికి ఏదో ఒక అలవాటు (Habit) ఉంటుంది. అది మంచిదైనా లేదా చెడుదైనా కావచ్చు. కొన్ని చెడు అలవాట్లను మానుకోవాలని ఎంతో ప్రయత్నిస్తుంటాం. అయినా సాధ్యం కాదు. అలాంటి అలవాట్లలో ఒకటి గోళ్లు కొరుక్కోవడం (Nail Biting). వైద్య పరిభాషలో దీన్ని ఒనికోఫాగియా (onychophagia) అంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో గోళ్లు కొరుక్కొనే అలవాటు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏ పనైనా చేసేటప్పుడు ఇంట్రెస్ట్ లేకపోతే చాలా మంది గోళ్లు కొరుకుంటారు. అయితే గోళ్లలో సార్మేనేలా, క్లేబ్సిల్లా అనే హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఒనికోఫాగియా ఉన్నవారిలో ఇది నోటి ద్వారా శరీరంలోకి వెళ్లి ఫుడ్ పాయిజన్‌కు కారణమతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు గోళ్లు కొరుక్కోవడానికి కారణాలేంటి, ఈ అలవాటును దూరం చేసే మార్గాలేంటో తెలుసుకుందాం.

* అసహనం, నిరాశ

ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు లేదా నిరాశకు లోనైనప్పుడు చాలా మంది గోళ్లు కొరుక్కుంటారు. లేకపోతే ఎవరికోసమైనా ఎదురుచూస్తున్నప్పుడు కూడా కొందరికి ఈ అలవాటు ఉంటుంది. గోళ్లు కొరుక్కోవడం ఒకసారి అలవాటు అయితే దాన్ని మానుకోవడం చాలా కష్టం. రోజువారీ దినచర్యలో అది భాగం అవుతుంది.

* సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ కారణంగా..

గోళ్లు కొరుక్కోవడం చాలా సాధారణమైన అలవాటు. అయితే కొంతమంది అదేపనిగా ఎప్పుడు చూసినా వేళ్లను నోటిలో పెట్టుకుని గోళ్లను కొరుక్కుంటారు. డిప్రెషన్, టూరెట్ సిండ్రోమ్ లేదా సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు అదే పనిగా గోళ్లు కొరుకుతారని వైద్యులు చెబుతున్నారు.

* ఏకాగ్రత లేనప్పుడు

ఏదో ఒక పనిపై తీవ్రంగా దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా మంది ఉద్దేశపూర్వకంగా గోళ్లు కొరుకుతారు. అయితే వారికి పని మీద సరైన ఏకాగ్రత లేకనే ఇలా చేస్తుంటారు. పాఠాలు వినే సమయంలో చాలా మంది విద్యార్థులకు ఇంట్రెస్ట్ లేక గోళ్లు కొరుక్కోవడం తరచూ చూస్తుంటాం. కొంతమంది ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు ఆసక్తి లేకపోయినా ఇలా చేస్తుంటారు.

* ఈ అలవాటుకు ఇలా చెక్ చెప్పండి..

- ఎలాంటి సందర్భాల్లో గోళ్లు కొరుకుతున్నారో గుర్తించండి. ఆ టైమ్‌లో ఇందుకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో ఆలోచించండి.

- స్ట్రెస్ బాల్ వాడుతూ ఈ అలవాటు నుంచి బయట పడవచ్చు.

- మీకు నచ్చిన ఆటపై దృష్టి కేంద్రీకరించండి.

- ఎప్పటికప్పుడు గోళ్లను చిన్నగా కత్తిరించుకోండి.

* వైద్య సహాయం తీసుకోవాల్సిన సందర్భాలు..

రోజుకు ఒకటి రెండుసార్లు గోళ్లు కొరుక్కొనే అలవాటు ఉంటే అదేమీ పెద్ద సమస్య కాదు. అయితే గోర్ల దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. ముఖ్యంగా గోరు ఇన్ఫెక్షన్, గోరు రంగు మారడం, గోర్లు వంకరగా మారినప్పుడు, గోళ్ల చుట్టూ రక్తస్రావం, చర్మం నుంచి గోరు వేరుకావడం, గోర్లు సన్నగా మారడం లేదా గట్టిపడటం, గోర్లలో వృద్ధి లేకపోయినప్పుడు, గోళ్ల చుట్టూ వాపు లేదా నొప్పిగా ఉంటే తప్పనిసరిగా వైద్యుని సంప్రదించడం మంచిది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Health care, Lifestyle

ఉత్తమ కథలు