హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Almond Milk benefits: ప్రతిరోజూ ఈ సమయంలో బాదం పాలను ముఖానికి రాసుకుంటే సహజమైన మెరుపు వచ్చి ముడతలు పోతాయి

Almond Milk benefits: ప్రతిరోజూ ఈ సమయంలో బాదం పాలను ముఖానికి రాసుకుంటే సహజమైన మెరుపు వచ్చి ముడతలు పోతాయి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Almond Milk benefits: బాదం పాలకు మీ చర్మ సమస్యలను దూరం చేసే శక్తి ఉంది. బాదం మిల్క్‌ను ఈ విధంగా చర్మానికి అప్లై చేస్తే మీ అందం పెరుగుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vizianagaram

Almond Milk benefits:  దుమ్ము, మట్టి,పెరుగుతున్న కాలుష్యం ఒకరి ఆరోగ్యం,చర్మాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. అయితే కాలుష్యం (Pollution) రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ సమస్యలన్నీ పొడి చర్మాని (Dry skin) కి దారితీస్తాయి. దీనిపై పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే వీటన్నింటి నుంచి ఉపశమనం పొందేందుకు మీరు రసాయన (Chemical) ఉత్పత్తులను వాడుతున్నారంటే, మీరు ఇప్పుడే మానేయాలి. ఈ ఉత్పత్తులు మీకు తక్షణ ఫలితాలను అందించవచ్చు కానీ కాలక్రమేణా మీ చర్మాన్ని అనేక విధాలుగా దెబ్బతీస్తుంది. దీనికి మీరు ఇంటి నివారణలతో మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ హోం రెమెడీస్ మీకు ఫలితాలను ఇవ్వడానికి 4 నుండి 5 రోజులు పడుతుంది కానీ అవి మీ చర్మానికి ఎటువంటి హాని కలిగించవు.

ఇది కూడా చదవండి: హత్య చేసింది ఎవరో కనుక్కోండి - మీరు ఎంత తెలివైనవారో చూడండి!

ఈ రోజు మనం బాదం పాలు గురించి మీకు చెప్తాము. బాదం పాలకు అనేక చర్మ, ఆరోగ్య సమస్యలను నయం చేసే శక్తి ఉంది. బాదం మిల్క్‌ను ముఖానికి రాసుకుంటే మొటిమల నుంచి వచ్చే అనేక ఇతర సమస్యలు నయమవుతాయి. కాబట్టి బాదం పాలను ముఖానికి పట్టించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి.

పొడి చర్మానికి ఉత్తమమైనది..

మీ చర్మం చాలా పొడిగా ఉంటే బాదం పాలు మీకు ఉత్తమం. దీని కోసం, మీరు చల్లని పాలలో బాదం ముక్కలను వేసి, ఆపై ఈ పాలను మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత ఈ పాలను ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డ్రై స్కిన్ తొలగిపోయి ఇన్ఫెక్షన్ దరిచేరదు.

ఇది కూడా చదవండి: మీరు థ్రిల్లింగ్ అనుభవంతో ట్రైన్ జర్నీ చేయాలనుకుంటున్నారా? దక్షిణ భారతదేశంలోని సుందరమైన మార్గాలు..

చర్మానికి తాజాదనాన్ని తీసుకురావడానికి

బాదం పాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు పని చేస్తాయి. ఇందులో లాక్టిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది, ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. దీని కోసం మీరు రాత్రంతా నిద్రించడానికి బాదం పాలను అప్లై చేసి, ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోండి. ఇలా చేయడం వల్ల మీ ముఖం సహజమైన కాంతిని సంతరించుకుంటుంది.

ముడతలు ..

ఆహారం ,పానీయాలు బ్యూటీ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై ముడతలు రావడం ప్రారంభమవుతాయి. ముడతలు పోవాలంటే బాదం పాలతో ముఖానికి మసాజ్ చేయండి. వృద్ధాప్య ప్రభావం ముఖంపై కనిపించకుండా చేస్తుంది ఈ పాలు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )

Published by:Renuka Godugu
First published:

Tags: Almonds, Beauty tips

ఉత్తమ కథలు