Home /News /life-style /

IF YOU ADDICTED TOO MUCH WITH ALCOHOL AND TROUBLED WITH A DRINKING PROBLEM THEN GET OUT OF IT THESE SIMPLE TIPS PRV GH

Alcohol: డ్రింకింగ్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ సూచనలతో సమస్య నుంచి బయటపడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మద్యపానం (alcohol consumption) అనేక అనారోగ్యాలకు, అనర్థాలకు దారితీస్తుందనే విషయం అందరికీ తెలుసు.ఈ భయంకరమైన అడిక్షన్ (alcohol addiction) నుంచి బయటపడేందుకు కొన్ని పనులు చేయాలని అంటున్నారు వైద్య నిపుణులు.

మద్యపానం (alcohol consumption) అనేక అనారోగ్యాలకు, అనర్థాలకు దారితీస్తుందనే విషయం అందరికీ తెలుసు. అయితే ఆరోగ్యాన్ని కబళించేస్తుందని తెలిసినా కొందరు మద్యపాన అలవాటు (drinking habit) మానలేరు. ఈ అలవాటు ఒక వ్యసనంగా మారి రోజువారీ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాదు శారీరక మానసిక సమస్యలు వేధిస్తాయి. ఈ సమస్యలను గుర్తించిన వెంటనే ఈ భయంకరమైన అడిక్షన్ (alcohol addiction) నుంచి బయటపడేందుకు కొన్ని పనులు చేయాలని అంటున్నారు వైద్య నిపుణులు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

మద్యపానం వల్ల సమస్యలను ఎదుర్కొంటుంటే, ఒక వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాలి. అలాగే మీరు ఎంత మొత్తంలో మద్యం సేవిస్తారు.. దానివల్ల మీరు అనుభవిస్తున్న సమస్యలన్నింటిని గురించి డాక్టర్ కు వెల్లడించాలి. మద్యపానం అలవాటు తగ్గించుకునేందుకు వైద్యులు సమర్థవంతమైన మార్గాలు సూచిస్తారు.

ఇది కూడా చదవండి: మద్యం తాగిన భర్త కిడ్నాప్​.. భర్త ప్రాణాల కోసం మానాన్ని పణంగా పెట్టిన ఇల్లాలు.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..

మీరు వాటిని అనుసరించడం ద్వారా మద్యపానం (Alcohol) అలవాటును క్రమక్రమంగా మానేయడం సాధ్యమవుతుంది. అయితే ఒకేసారి మద్యం మానేస్తే అది చాలా ప్రాణాంతకం. అందుకే ఈ విషయంలో వైద్యులను సలహా అడగడం మంచిది. అలాగే మద్యపానం కారణంగా తలెత్తే సమస్యలకు కళ్లెం వేయడానికి ఏదైనా మెడిసిన్ వాడాలని అనుకున్నా.. దాని గురించి డాక్టర్లను అడగాలి.

* మద్యం (Alcohol) మానేసిన తర్వాత మీలో ఈ లక్షణాలు కనిపిస్తే మీరు మెడిసిన్ వాడాల్సిందే..

- నిద్రలేచిన తర్వాత ఆందోళన

- చెమట, వణుకు

- ఉదయం వేళ వికారం

- వాంతులు

- మూర్ఛలు లేదా ఫిట్స్

* హెల్దీగా, కంట్రోల్ లో ఉండటం

మద్యపానం మానడం అనేది మీరు వేసే మొదటి అడుగు మాత్రమే. పూర్తిగా మద్యం మానేయాలంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఇందుకు మీకు సుదీర్ఘ కాలంపాటు సపోర్ట్ సిస్టం (Support system) అనేది తప్పనిసరి. సపోర్ట్ సిస్టం అంటే ఫ్రెండ్స్ అయినా కావచ్చు లేదా కుటుంబ సభ్యులు, భాగస్వామి ఇలా ఎవరైనా కావచ్చు.

ఇది కూడా చదవండి : రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?

* ఆల్కహాల్ డీటాక్సిఫికేషన్

శరీరం మద్యపానానికి ఎంతోకాలంగా అలవాటు పడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒకేసారి మద్యపానం మానేస్తే పైన చెప్పినట్లుగా రకరకాల సమస్యలు (Problems) పుట్టుకొస్తాయి. అందుకే మెడికల్లీ సపోర్టెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీల సేవలను ఉపయోగించుకోవడం మంచిది.

* ఇంటెసివ్ రీహాబిలిటేషన్

కొందరు వ్యక్తులు ఆల్కహాల్ (Alcohol) లేకుండా బతకలేరు. మద్యపానానికి దాసోహం అన్నట్లుగా వీరు ఆల్కహాల్ పై ఫిజికల్ గా ఆధారపడతారు. వీరు ఇతరుల నుంచి ఎంత సహాయం పొందిన మద్యపానాన్ని మాత్రం మానేయలేరు. ఇలాంటి మద్యం బాధితులు ఇంటెన్సివ్ రీహాబిలిటేషన్ సేవలు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.ఆమె కంటే నాలుగేళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటానని పెద్దల ముందుకు వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..

ఇది కూడా చదవండి: అయ్యో ఎంత పని చేశావమ్మా... డాక్టర్​ చెప్పాడని నిండు గర్భిణి అయి ఉండి ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నావా..? 
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Alcohol, Health care

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు