దంతాలు (Teeth) మనిషి అందాన్ని ఎక్కువచేసేవి. ఆహారం బాగా నమిలి తినడానికి ఆయుధం లాంటిది. అయితే ఏది పడితే అది తినడం వల్లనో.. దెబ్బలు తగలడం వల్లనో పళ్లు దెబ్బతింటాయి (teeth damage). దీంతో ఒక్క పన్ను నొప్పి (Teeth pain) పుట్టినా ఎక్కువగా బాధ కలుగుతుంది. ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. దంతాల ఇన్ఫెక్షన్లు, పుచ్చిపోవడం, కొత్త దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వ్యాధి తదితర కారణాల వల్ల ఈ నొప్పి ( Teeth Pain) ఏర్పడుతుంది. కానీ, ఇది ఒక్కసారి మొదలైందంటే.. అంత ఈజీగా తగ్గదు. ఈ నొప్పి తగ్గాలంటే తప్పకుండా డెంటిస్టును సంప్రదించాల్సిందే. ఒక వేళ మీ వద్ద అంత సమయం లేకున్నా.. తక్షణ ఉపశమనం కావాలన్నా. కొన్ని చిట్కాలు (health tips) పాటిస్తే నొప్పులు (teeth pain) తగ్గుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
కొన్నిసార్లు దంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ద్వారా కూడా పంటి నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గోరు వెచ్చటి నీటిలో కాస్త ఉప్పు (salt) వేసి నోట్లో వేసుకొని బాగా పుకిలించాలి. దీంతో దంతాల చుట్టూ, మధ్య పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. నొప్పి (teeth pain) నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకోవడం వల్ల అప్పటికప్పుడు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇక పంటి నొప్పిని తగ్గించడంలో వెల్లుల్లి (Garlic) కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటి బయోటిక్ గుణాలు తీవ్రమైన పంటి నొప్పి (teeth pain) నుంచి కూడా వెంటనే రిలీఫ్ అందిస్తుంది. వెల్లుల్లిని బాగా దంచి అందులో కొంచెం ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది.
ఇక చిగుళ్ల నొప్పికి చెక్ పెట్టడానికి ఆవ నూనెలో ఒక చిటికెడు ఉప్పు (salt) ను కలిపి చిగుళ్లపై మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. ఇక పంటి నొప్పి ఉన్న సమయంలో తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. దీనివల్ల సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. లవంగాలు కూడా పంటి నొప్పికి మంచి చిట్కాగా ఉపయోగపడతాయి. నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కాలి దీంతో నొప్పి (teeth pain) నుంచి ఉపశమనం లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Teeth