IF THE STOMACH PAIN PROBLEM IS SEVERE THEN IT CAN BE AVOIDED IMMEDIATELY WITH THESE LITTLE HOME REMEDIES PRV
Stomach pain home remedies: కడుపు నొప్పి సమస్య తీవ్రంగా ఉంటే ఈ చిన్న చిన్న చిట్కాలతో వెంటనే దూరం చేసుకోవచ్చు
ప్రతీకాత్మక చిత్రం
కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి (Stomach pain) తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు(problems) వస్తుంటాయి.
ఉరుకుల పరుగుల జీవితం. టెక్నాలజీ పెరిగిపోతోంది. మనుషుల కంటే డబ్బులకే విలువ పెరిగిపోయింది. కల్తీ రాజ్యం నడుస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటుపడిన వారు ప్రతీ దాంట్లోనూ కల్తీలు, నకిలీలు పుట్టిస్తున్నారు. ఆఖరికి మనం తినే ఆహారం(food)లోనూ ఇది మామూలైపోయింది. అయితే కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి (Stomach pain) తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు(problems) వస్తుంటాయి. క్రాంప్స్, మగతగా అనిపించడం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఇలా ఎన్నో సమస్యలకు కడుపునొప్పి(stomach pain) కారణం అవ్వవచ్చు. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటించి (Stomach pain home remedies) కడుపు నొప్పిని దూరం చేసుకోవచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం..
సోంపు నీరు బెటర్..
ఆహారం తిన్న (After eating) వెంటనే అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. వెంటనే సోంపు నీరు తాగాలి. ఇందుకోసం ఒక కప్పు నీటిలో 1 టీస్పూన్ సోంపు కలపి రాత్రంతా వదిలెయ్యాలి. ఉదయాన్నే వడకట్టి.. ఆ నీటిని వేడిచేసి తీసుకోవాలి. ఒకవేళ రుచి (taste)ని పెంచుకోవడానికి మీరు ఒక టీస్పూన్ తేనె కలుపుకోవచ్చు.
ఆహారం తిన్న తర్వాత కడుపులో మంట (pain in stomach), నొప్పి వంటి సమస్యలు ఏర్పడితే వెంటనే కొద్ది మొత్తంలో బెల్లం తినడం మంచిది. ఇది ఆహారాన్ని జీర్ణం (digest) చేసే ఎంజైములను విడుదల చేస్తాయి. అలాగే కడుపులో మంట సమస్య తగ్గుతుంది. తిన్న తర్వాత కడుపులో మంట, నొప్పి (pain) వంటి సమస్యలు రెగ్యులర్గా ఉన్నవాళ్లు.. ఎక్కువగా అలోవేరా జ్యూస్ తీసుకోవడం ఉత్తమం. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అలేగ పేగులో నీటి శాతానని పెంచుతుంది. కడుపు నొప్పి (stomach pain) సమస్యలు ఎక్కువగా ఉన్నవారికి ఈ జ్యూస్ చాలా ఎక్కువగా పనిచేస్తుంది. అయితే తక్కువ మోతాదులో ఈ అలోవేరా జ్యూస్ తీసుకోవాలి.
పచ్చిమిర్చి, మసాలా (masala) దినుసులు తినడం వలన చాలా మందిలో ఎసిడిటి (acidity) సమస్య ఏర్పడుతుంది. దీంతో తమకు ఇష్టమైన ఆహారం (food) తీసుకోవడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అలాగే ఈ సమస్యల నుంచి బయటపడేందుకు అనేక రకాల సప్లిమేంట్స్ ఉపయోగిస్తుంటారు. ఇక మరికొందరిలో ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో మంట (stomach problem), నొప్పి వంటి సమస్యలు కలుగుతుంటాయి. ఈ సమస్యలను మీ వంటగదిలో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.