టెక్నాలజీ పెరిగిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యానికి(health) కూడా సమయం కేటాయించలేని పరిస్థితి. సరైన సమయానికి ఆహారం(food) తినక అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలలో నివసించే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ బిజీ లైఫ్లో శరీరం, అందంపై ప్రత్యేక శ్రద్ధ వహించే సమయమే లేకుండా పోతుంది. దీంతో చిన్న వయసులోనే ముఖంపై(face) ముడతలు(wrinkles) వస్తున్నాయి. చాలా మందికి ముఖం తెల్లగా వున్నా కాని మెడ (neck) మాత్రం నల్ల (Black)గా ఉంటుంది. దాని కోసం బ్యూటీ పార్లర్ల (beauty parlors) చుట్టూ తిరుగుతూ వుంటారు. అయితే ఆ అవసరం లేదు. ఇక ఆ మెడ నలుపు తగ్గి అందంగా తెల్ల (White)గా మారడానికి ఈ పద్ధతులు (beauty tips) పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.
బాదం నూనె (Almonds Oil). మెడ (Neck) నలుపు (black) తగ్గించడంలో రెగ్యులర్ గా ఈ నూనె (Oil)ను మెడకు అప్లై చేయవచ్చు. నూనెను గోరువెచ్చగా చేసి తర్వాత మెడకు అప్లై చేయాలి. ఈ పద్దతిని రోజూ ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. అరటీస్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుని, అందులో ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ (Rose water) మిక్స్ చేసి మెడకు పూర్తిగా అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
అప్పుడు మెడ నలుపు అనేది తగ్గిపోతుంది. నిమ్మరసం (lemon juice) సహజ సిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది. ఈ నిమ్మ రసాన్ని ఉపయోగించడం వల్ల మెడ నలుపు తగ్గుతుంది. నిమ్మరసంలో కొద్దిగా నీళ్ళు (water) మిక్స్ చేసి మెడకు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మంను తెల్లగా మార్చడంలో టమోటో (tomato) గొప్పగా పని చేస్తుంది. టమోటోను మెత్తగా పేస్ట్ (paste) చేసి మెడకు పూర్తిగా అప్లై చేయాలి.
20 నిముషాల తర్వాత మంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం (results) ఇస్తుంది. బంగాళదుంప (potatoes) మెడ నలుపును తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ హోం రెమెడీని నేరుగా ఉపయోగించవచ్చు. బంగాళదుంపను కట్ చేసి, మెడ నల్లగా ఉన్న ప్రదేశంలో అప్లై (apply) చేస్తూ మర్దన చేయాలి. ఇలా నలుపు (blackness) తగ్గే వరకూ రోజూ ప్రయత్నించవచ్చు. ఇక ఈ పద్ధతులు పాటిస్తే బ్యూటీ పార్లర్ (beauty parlor) కూడా వెళ్లే అవసరం ఉండదు. కాబట్టి ఈ సహజ సిద్ధమైన పద్ధతులు పాటించండి. సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beauty tips, Face mask, Life Style