Home /News /life-style /

IF STOMACH PAIN PROBLEM IS SEVERE THEN IT CAN BE AVOIDED IMMEDIATELY WITH THIS LITTLE HOME REMEDIES PRV

Stomach pain: కడుపు నొప్పి ఎక్కువగా బాధిస్తే ఈ ఇంటి చిట్కాను పాటించండి.. నొప్పి మటుమాయం అవుతుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చలికాలంలో కడుపు నొప్పి, అజీర్ణం సమస్యలు ఎక్కువే. ఉష్ణోగ్రతలు పడిపోవడం (Temperature down).. శరీరం చలికి గురవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. ప్రతిసారి తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పెడితే కొన్ని ఇంటి నివారణ పద్ధతులను (health tips) అనుసరించండి.

ఇంకా చదవండి ...
    ఆధునిక యుగంలో కల్తీ రాజ్యం నడుస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటుపడిన వారు ప్రతీ దాంట్లోనూ కల్తీలు, నకిలీలు పుట్టిస్తున్నారు. ఆఖరికి మనం తినే ఆహారం(food)లోనూ ఇది మామూలైపోయింది. అయితే కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి (Stomach pain) తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు(problems) వస్తుంటాయి. క్రాంప్స్, మగతగా అనిపించడం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఇలా ఎన్నో సమస్యలకు కడుపునొప్పి(stomach pain) కారణం అవ్వవచ్చు.

    చలికాలంలో కడుపు నొప్పి, అజీర్ణం సమస్యలు ఎక్కువే. ఉష్ణోగ్రతలు పడిపోవడం (Temperature down).. శరీరం చలికి గురవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గడంతోపాటు (Immunity power down).. అలసట, నీరసం కలుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ (digestive system) పై ప్రభావం చూపుతుంది. ఈ సీజన్లో కడుపులో హఠాత్తుగా నొప్పి వచ్చినా.. లేదా ప్రతిసారి తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న కొన్ని ఇంటి నివారణ పద్ధతులను (health tips) అనుసరించండి.

    వాము (bishops weed)లో ఉండే థైమోల్ గ్యాస్ ఏర్పడకుండా అడ్డుకుంటుంది. అందుకే పూర్వకాలం నుండి మన పెద్దలు కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు వామును ఔషధంగా ఇచ్చేవారు. వాము జీర్ణక్రియ జరగడానికి జాగ్రత్తలు తీసుకుంటుంది. అజీర్ణం సమస్యలు, అసిడిటీ మరియు యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలకు వాము విత్తనాలను తీసుకోవడం ఉత్తమ సహజ నివారణగా పనిచేస్తాయి.

    ఆ చిట్కా కోసం పావు స్పూన్ సైంధవ లవణం తీసుకోవాలి. సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతులు, రాక్ సాల్ట్ లేదా సైంధవ లవణం కడుపులో నులిపురుగులు, గుండెల్లో మంట, ఉబ్బరం, మలబద్ధకం, కడుపు నొప్పి మరియు సొంతులు వంటి వివిధ జీర్ణ రుగ్మతలకు ఇంటి నివారణగా ఉపయోగించబడుతుంది.

    సైంధవ లవణం అందుబాటులో లేనప్పుడు మామూలు ఉప్పు (salt)తో, పావు స్పూన్ వాముని దంచి ఆ పొడిని దవడలో పెట్టి నములుతూ రసాన్ని తీసుకోవడం వలన కడుపులో చేరిన గ్యాస్ తేన్పు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఇది రుచిలో కొంచెం ఎగరు, మాటుగా ఉంటుంది. అలా ఉందని బయటకు ఉమ్మి వేయకుండా నములుతూ మింగాలి. తర్వాత ఒక అరగ్లాసు గోరువెచ్చని నీటిని (Lukewarm water) తాగడం వలన జీర్ణం మరియు కడుపు నొప్పికి అజ్వెన్ చాలా సహాయకారిగా ఉంటుందని నిరూపించబడిన వాస్తవం. ఇలా మీకు కడుపు నొప్పి వచ్చినప్పుడే కాకుండా కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు, అన్నం అరగక కడుపులో ఇబ్బంది, గుండెల్లో మంట, క్రేన్పులు వస్తున్నప్పుడు కూడా ఈ చిట్కాను పాటించవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Salt, Stomach Pain

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు