• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • IF I HAVE SEX WITH A SEX WORKER THE CONDOM IS BLOWN AWAY CAN I GET AIDS MK

సెక్స్ వర్కర్ తో శృంగారంలో పాల్గొంటే...కండోమ్ ఊడిపోయింది...నాకు ఎయిడ్స్ వస్తుందా...?

సెక్స్ వర్కర్ తో శృంగారంలో పాల్గొంటే...కండోమ్ ఊడిపోయింది...నాకు ఎయిడ్స్ వస్తుందా...?

(ప్రతీకాత్మక చిత్రం)

మీ వయస్సులో సెక్స్ చేయాలనే కోరికలు కలగడం సహజమే..అందుకోసం మీరు ఎంపిక చేసుకున్న పద్ధతి మాత్రం తప్పు అనే చెప్పాలి. సెక్స్ వర్కర్స్ సాధారణంగా అపరిచత వ్యక్తులతో శృంగారం చేస్తుంటారు. వారిలో ఒక్కరికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నా ఆమె ద్వారా మరికొంత మందికి సోకే ప్రమాదం ఉంది.

  • Share this:
    ప్రశ్న: నా పేరు మహేష్ (పేరు మార్చాం) వయస్సు 23 సంవత్సరాలు, నేను ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని, వృత్తి రీత్యా నేను పూనేలో స్థిరపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో నా ఫ్రెండ్స్ ఒత్తిడి చేయగా, కాల్ గర్ల్ ను బుక్ చేసుకున్నాము. అయితే కాస్త భయంగానే వారితో సెక్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ క్రమంలో కండోమ్స్ వాడాను. అయితే అనుకోకుండా నేను వాడిన కండోమ్ సెక్స్ వర్కర్ యోనిలోనే ఊడిపోయింది. స్ట్రోక్స్ ఇస్తున్న సమయంలో కండోమ్ లేదని తెలిసి నాకు గుండె ఆగినంత పనయ్యింది. నాకు హెచ్ఐవీ వస్తుందేమోనని భయపడ్డాను. వెంటనే టెస్ట్ చేయించాను. నెగిటివ్ వచ్చింది. మళ్లి నెల రోజుల తర్వాత కూడా టెస్ట్ చేయించాను అప్పుడు కూడా నెగిటివ్ వచ్చింది. అయితే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 90 రోజుల తర్వాత కూడా నేను హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్నాను. అప్పుడు కూడా నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ నాలో భయం తగ్గలేదు. ఏంచేయాలి...నాకు ఎయిడ్స్ వస్తుందా...

    Five tips, Youth, First time sex, sexual relationship, Life partner, wife, husband, కుర్రాళ్లు, భర్త, భార్య, శృంగారం, మొదటిసారి శృంగారం, సెక్స్
    ప్రతీకాత్మక చిత్రం


    జవాబు: మీ సమస్యను అర్థం చేసుకోగలం...మీ వయస్సులో సెక్స్ చేయాలనే కోరికలు కలగడం సహజమే..అందుకోసం మీరు ఎంపిక చేసుకున్న పద్ధతి మాత్రం తప్పు అనే చెప్పాలి. సెక్స్ వర్కర్స్ సాధారణంగా అపరిచత వ్యక్తులతో శృంగారం చేస్తుంటారు. వారిలో ఒక్కరికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నా ఆమె ద్వారా మరికొంత మందికి సోకే ప్రమాదం ఉంది. అయితే మీ విషయంలో మాత్రం మీరు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే మీకు హెచ్ఐవీ సోకలేదని అర్థం చేసుకోవచ్చు. చాలా దేశాల్లో 90 రోజుల తర్వాత చేసిన టెస్టులను ప్రామాణికంగా వ్యవహరిస్తున్నారు. 99 శాతం హెచ్ఐవీ కేసుల్లో కేవలం 44 రోజులకే బయటపడతాయి. కానీ మీరు మూడు నెలల తర్వాత కూడా టెస్ట్ చేయించుకున్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇక ముందు ముందు మీరు సెక్స్ వర్కర్ల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. అలాగే మీకు భయం కలిగితే కౌన్సిలర్ ను కలవండి. వారితో మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. భవిష్యత్తులో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. అసురక్షిత శృంగారంతో కేవలం హెచ్ఐవీ మాత్రమే కాదు, సిఫిలిస్, గనేరియా లాంటి సుఖ వ్యాధులు సైతం సోకే ప్రమాదం ఉంది.
    Published by:Krishna Adithya
    First published: