మానవ శరీరంలో అతి ముఖ్యమైనది బ్రెయిన్ (brain), అది కరెక్టు పనిచేయకపోతే మనిషి జీవచ్ఛవమే. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎక్కువయ్యాయి. అయితే చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్ (brain strokes) వచ్చే ముందు పసిగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని శరీర భాగాలకు రక్త సరఫరా(Blood supply) జరగకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఆక్సిజన్ కణాల్లోకి సరఫరా నిలిచిపోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉందని, ఇలాంటి సమయంలో ఆరోగ్యం(health)పై ప్రత్యేక శ్రద్ద(care) వహించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొన్ని సార్లు బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించిన సమస్యలు ముందే పసిగడితే ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. ప్రమాదం జరగడానికి కొన్ని రోజులు, గంటల ముందే కొన్ని లక్షణాలు గుర్తించినట్లయితే ఎంతో మేలని అంటున్నారు వైద్య నిపుణులు(experts). వాటిపై అవగాహన ఉంటేనే సమస్యను ముందే పసిగట్టవచ్చని చెబుతున్నారు.
మనుషుల్లో చేతులు, కాళ్లు మొద్దు బారడం, సాధారణమైన లక్షణమే అయినా బ్రెయిన్ స్ట్రోక్ ముందు ఇలా జరుగుతుంది. అయితే ముఖం, చేతులు, కాళ్లు ఒక వైపు మాత్రమే మొద్దు బారడం జరుగుతుంది. కంటి చూపులో కూడా సమస్య ఏర్పడుతుంది. నెల ముందు నుంచే కంటి చూపులో తేడా కనిపిస్తుంది. కళ్లు మసకబారడం లాంటివి ఉత్పన్నమవుతాయని తేలింది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన చాలా మంది ఆడవాళ్లలో కనిపించిన లక్షణం తలనొప్పి. చాలా మంది తల వెనుక భాగంలోనే అలా అనిపించినట్లు ఉంటుంది. ఒక్కో సమయంలో స్పృహ కూడా కోల్పోయి పడిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్ అని గుర్తించాలంటున్నారు. ఇక ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి.
ఈ స్ట్రోక్ వచ్చే ముందు 10 శాతం మంది మహిళలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. ఈ స్ట్రోక్ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంటుంది. మహిళల్లో స్ట్రోక్ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు. ఉన్నట్టుండి కొన్ని విషయాలు మార్చిపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు తెలుస్తుంటాయి. అంతేకాకుండా వికారం, వాంతులు, మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు, వికారంగా ఉండటం వంటివి కనిపిస్తాయి. ఇక చూపులో సమస్యతో పాటు భ్రమ పడుతున్నట్లు కూడా అనిపిస్తుంటుందట. అప్పటికే పోస్టిరియర్ భాగంలో సర్యూలేషన్ సమస్య వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ స్ట్రోక్ వచ్చే ముందు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల మెదడులో రక్త గడ్డ కట్టే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు గర్భస్రావాలు జరుగుతుంటాయి. అది స్ట్రోక్ రిస్క్ ను పెరిగేలా చేస్తుందని అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ వెల్లడిస్తోంది. అడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే డీహెచ్ఈఏ హార్మోన్ వెంటనే తగ్గిపోతుంది. దాని కారణంగా ఈస్ట్రోజన్లు, ఆండ్రోజన్స్ తగ్గిపోతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే ఎక్కువగా టెన్షన్‌కు గురి కాకుండా ఉండటం మంచిది. అధికంగా ఆలోచించడం కంటే యోగా, ధ్యానం లాంటివి చేసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలని వెల్లడిస్తున్నారు. లేకపోతే ఇలా ఆరోగ్యం బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health care, Life Style