D Prasad, News18, Kadapa
మన పల్లెటూళ్ళలలో ఊరి చివరన మరియు పొలాల గట్ల వెంబడి ఆకాశాన్ని తాకుతున్న తాటి చెట్లు మనకు కనపడతాయి. వేసవి కాలంలో వీటి నుండి వచ్చే టువంటి తాటి ముంజలూ చాల ప్రత్యేకం. మరియు చాలామందికి ఇష్టమైన ఆహారం.ఈ మండుతున్న వేసవి తాపానీ తగ్గించడానికి మనకి కావాల్సిన వాటిలో ఈ తాటి ముంజలు కూడా ప్రధానమైనవి. మరి వేసవి వచ్చేసింది. ఈ తాటి ముంజలకి కూడా ఇదే సరైన సమయం. నగరంలో మండుతున్న వేసవికి తట్టుకుని నిలబడాలంటే ఇలాంటి చలువ చేసే పదార్థాల్ని మన తినాల్సిందే. ఇప్పటికే కడప నగరంలో చల్లటి పండ్ల రసాలు, శీతల పానియాలకి మంచి డిమాండ్ ఉంది. అలాగే ఈ వేసవిలో దొరికే కర్బూజా, దోసవంటి వాటికి మంచి గిరాకీ వుంది.
ప్రస్తుతం తాటికాయలకు గతంలో ఎన్నడూలేనంత డిమాండ్ ఉంది. కడపలో తాటి ముంజల వ్యాపారం జోరుగా సాగుతోంది. మండిపోతున్న వేసవి వాతావరణంలో ఈ తాటి ముంజలు శరీరానికి చల్లదనాన్ని చేకూర్చే అద్భుతమైన ఆహారం. నగర శివారులోని పల్లెల నుంచి తాటి ముంజలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం తాటి ముంజల ధర డజను రూ.100 వరకు పలుకుతోంది.
ఈ తాటి ముంజలు రుచికే కాదండి.. మన శరీర ఆరోగ్యానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం వంటివి పుష్కలంగా కలిగి ఉండి, శరీరంలోని వ్యర్థాలన్నింటినీ బయటకు పంపి మలబద్దకాన్ని తరిమికొడతాయి. దీవివలన జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇవి శరీరాన్ని చల్లబరిచేందుకు ఎంతో సహకరిస్తాయని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. మరి ఇన్ని లాభాలున్న ఈ తాటి ముంజలని ప్రజలు కూడా ఎగబడి కొంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News, Summer tips