Home /News /life-style /

IB HUBS STARTUP SCHOOL A SPRINGBOARD TO SUCCESS FOR STUDENT STARTUPS IN INDIA CR

విద్యార్థులకు ఉచితంగా స్టార్టప్ శిక్షణా శిబిరం... ఎలా అప్లై చేసుకోవాలంటే...

ఐబీ హబ్స్ స్టార్టప్

ఐబీ హబ్స్ స్టార్టప్

స్టార్టప్ ఆలోచనలో ఉన్న విద్యార్థులకు 4 వారాల ఉచిత శిక్షణా శిబిరం... అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలు, సీనియర్లతో చర్చలు, సమావేశాలు, సలహాలు...

ఇప్పుడు అంతా స్టార్టప్ సామ్రాజ్యం నడుస్తోంది. సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చే యువతరం... వ్యాపార రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారు. అయితే బుర్రలో ఎన్నో ఆలోచనలు ఉన్నా వాటిని అమలులోకి ఎలా తేవాలో తెలియక వెనకడుగు వేస్తుంటారు చాలామంది. అలాంటి వారికి చేయూత నిచ్చేందుకు ఐబీ హబ్స్ ఓ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తోంది. స్టార్టప్ ఏర్పాటు చేయాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు, ఐబీ హబ్స్ 4 వారాల ఉచిత శిక్షణా శిబిరాన్ని ‘ఐబీ హబ్స్ స్టార్టప్ స్కూల్’ అనే పేరుతో నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థులలో ఎంట్రప్రెన్యూర్ షిప్ సంస్కృతిని విస్తరింప చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తోన్న ఈ శిక్షణాశిబిరం... ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా నిర్వహించిన... మే 13 నుంచి మూడో ఎడిషన్ నిర్వహిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం, సమాచార సేకరణ, విషయం గురించి అవగాహణ ఉన్న నేటితరం యువతలో అపార శక్తిసామర్థ్యాలు దాగి ఉన్నాయి. సరియైన మార్గనిర్దేశం చేస్తే, వారి ఆలోచనలు మరింత వేగంగా వృద్ధి చెందుతాయి. ఐబీ హబ్స్ స్టార్టప్ స్కూల్ ఇటువంటి యువ ఎంట్రప్రెన్యూర్లకు స్టార్టప్ స్థాపనకు కావాల్సిన మార్కెటింగ్ స్ట్రాటెజీ, సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక వనరుల సమీకరణ ఎలాగో నేర్పిస్తూ, స్టార్టప్ ప్రపంచంలోని ఒడిదుడుకులను అధిగమించి విజయతీరాల్ని చేరడమెలాగో ఈ ఉచిత శిక్షణా శిబిరంలో విద్యార్థులకు బోధిస్తారు.
శిక్షణ శిబిరం వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...

వ్యాపార రంగంలో అనుభవజ్ఞులైన వారి ఉపన్యాసాలు, సలహాలు, సంభాషణలు, ముఖా-ముఖి చర్చలు, ప్రభావవంతమైన టీంలను తయారుచేయడం వంటి వివిధ కార్యకలాపాలతో విద్యార్థులలో ఎంట్రప్రెన్యూరియల్ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతో పాటు కస్టమర్-సెంట్రిక్ ఉత్పత్తులు తయారుచేయడం, వ్యాపార వ్యూహరచనలు చేయడంలో ప్రోత్సహిస్తుంది. ప్రోగ్రాంలో పాల్గొనే విద్యార్థులు తమ ఆలోచనలను ఆచరణలోకి మలిచే విషయంలో కేవలం మెంటార్లే కాకుండా పూర్వ విద్యార్థులు కూడా సహాయపడుతున్నారు. హైదరాబాద్, లక్నోలో నిర్వహించిన ఐబీ హబ్స్ స్టార్టప్ స్కూల్ 2018 ఎడిషన్ క్లాసుల్లో 2017 విద్యార్థులు పాల్గొని, వారి అమూల్యమైన స్టార్టప్ అనుభవాలను జూనియర్లతో పంచుకున్నారు. నదులు, ప్రవాహాలలో మునిగిపోతున్నవారిని కాపాడటానికి, అద్భుతమైన ట్రాకింగ్ పరికరాలను తయారుచేసిన ‘బెస్టో బెల్ట్స్’ అనే స్టార్టప్ కంపెనీ ప్రతిష్టాత్మక ‘ఎంఐటీ - ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ బూట్క్యాంప్ 2019’లో స్థానం సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంపికయ్యే వారు 0.13% మాత్రమే. అలాగే వ్యర్థాలను వేరుచేసే పరికరాలను తయారుచేసిన స్టార్టప్ కంపెనీ ‘ట్రాష్కాన్’ కూడా సీఐఐ ‘బెస్ట్ ఉమన్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ 2018’ అవార్డును గెలుచుకుంది.

ఐబీ హబ్స్ స్టార్టప్ స్కూల్‌ చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ లింకును క్లిక్ చేయండి: https://ibhubs.co/
First published:

Tags: Start-Up

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు