ప్రధాని మోదీ బ్యూటీ టిప్... ఆయన మెరిసే చర్మ సౌందర్య రహస్యం ఇదే...

తన చర్మం ఎప్పుడూ ప్రకాశవంతంగా కనిపించడానికి గల రహస్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయటపెట్టారు.

news18-telugu
Updated: January 25, 2020, 2:50 PM IST
ప్రధాని మోదీ బ్యూటీ టిప్... ఆయన మెరిసే చర్మ సౌందర్య రహస్యం ఇదే...
సాహసబాలలతో ప్రధాని నరేంద్ర మోదీ (Image;PIB)
  • Share this:
తన చర్మం ఎప్పుడూ ప్రకాశవంతంగా కనిపించడానికి గల రహస్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయటపెట్టారు. ప్రధానమంత్రి బాల పురస్కారం పొందిన 49 మంది విద్యార్థులతో న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా తన చర్మ సౌందర్య రహస్యాన్ని ఆయన బయటపెట్టారు. మీలో ఎవరైనా రోజుకు నాలుగుసార్లు చమటోడుస్తారా? అని ఆ పిల్లలను ప్రధాని ప్రశ్నించారు. వారు దానికి సమాధానం ఇచ్చారు. అనంతరం మాట్లాడిన నరేంద్ర మోదీ విద్యార్థులు ఎప్పుడూ శారీరకంగా ఉత్తేజంగా ఉండాలని, చమటోడ్చితే అందంగా కనిపిస్తారని తెలిపారు.

‘చాలా సంవత్సరాల క్రితం కొందరు నన్ను అడిగారు. నా ముఖం ఎందుకు అంత మెరిసిపోతుందని ప్రశ్నించారు. నా సమాధానం చాలా సింపుల్. నేను చాలా కష్టపడతాను. చాలా చమటోడుస్తాను. ఆ చెమటతో నా ముఖానికి మసాజ్ చేస్తాను. దీంతో నా ముఖం మెరుస్తూ ఉంటుంది.’ అని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు చెప్పారు.

బాలలు చేసిన సాహసాలను ప్రధాని మోదీ వారిని అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి తాను అప్పుడప్పుడు స్ఫూర్తి, ఉత్తేజం పొందుతానని చెప్పారు. ‘కొంతసేపటి క్రితం నేను మిమ్మల్ని కలిసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డా. భిన్నరంగాల్లో మీరు చూపిన ప్రతిభ అమోఘం. ఇంత చిన్న వయసులోనే మీరు ఎంతో గొప్ప పనిచేశారు. అమేజింగ్.’ అని ప్రధాని మోదీ సాహసబాలలను అభినందించారు.

First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు