హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

పనిమనిషితో సెక్స్ చేశాను...ఆమెను వదలలేకపోతున్నా...నా భార్యకు తెలిస్తే ఎలా...

పనిమనిషితో సెక్స్ చేశాను...ఆమెను వదలలేకపోతున్నా...నా భార్యకు తెలిస్తే ఎలా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చివరకు ఓ రోజు బలహీన క్షణంలో నేను ఆమెకు నా కోరిక గురించి చెప్పాను. అందుకు ఆమె వద్దని వారించబోయినప్పటికీ, మౌనంగా ఉండిపోయింది. మౌనం అర్థాంగీకారంగా భావించి నేను ఆమెతో సెక్స్ చేశాను.

ఓ సోదరుడు..

ప్రశ్న:  నా పేరు రాము ( పేరు మార్చాం) నేను ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని, నా వయస్సు 40 సంవత్సరాలు, నాకు 12 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. ఓ బాబు కూడా ఉన్నాడు. చక్కగా నా సంసారం సాగిపోతోంది. అయితే గత ఏడాది విధించిన లాక్ డౌన్ కారణంగా నేను ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్నాను. అయితే నా భార్య హెల్త్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తోంది. ఆమె తప్పనిసరిగా హాస్పిటల్ విధుల కోసం వెళ్లాల్సి వచ్చేది. దీంతో నేను నా పిల్లవాడితో కలిసి ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకునే వాడిని, ఈ క్రమంలోనే ఓ పనిమనిషి సుజాత( పేరుమార్చాం)ను పని చేసేందుకు కుదుర్చుకున్నాం. సుజాత వయస్సు నా కన్నా నాలుగు సంవత్సరాలు చిన్నది. ఇంటికి వచ్చి అన్ని పనులు చకచక చేసి ఎవరితో మాట్లాడకుండా తన నెమ్మదిగా నడుచుకునేది. నా భార్య ఆసుపత్రి నుంచి వచ్చేలోగా అన్ని పనులు అయిపోయేవి. ఈ క్రమంలోనే నేను సుజాత మంచి చెడును మందలించేవాడిని, అయితే ఆమె భర్త ఓ వికలాంగుడని, చాలా కష్టాల్లో ఉన్నాను అని చెప్పుకొచ్చేది. దీంతో ఆమెపై నాకు జాలికలిగింది. ఆమెకు అప్పుడప్పుడు ఆర్థిక సాయం చేసేవాడిని ఆ క్రమంలోనే ఆమెతో నాకు సాన్నిహిత్యం కొంత పెరిగింది. ఒంటరిగా ఇంట్లో ఉండటంతో ఏకాంతం కూడా తోడవడంతో ఆమెతో కాస్త చనువుపెంచుకున్నాను. క్రమంగా ఆమెపై నాకు లైంగిక వాంఛలు మొదలయ్యాయి. చివరకు ఓ రోజు బలహీన క్షణంలో నేను ఆమెకు నా కోరిక గురించి చెప్పాను. అందుకు ఆమె వద్దని వారించబోయినప్పటికీ, మౌనంగా ఉండిపోయింది. మౌనం అర్థాంగీకారంగా భావించి నేను ఆమెతో సెక్స్ చేశాను. ఇద్దరం ఆ రోజు నుంచి శారీరక సంబంధంలో ఉన్నాము. కానీ ఈ విషయం నా భార్యకు తెలియదు. కానీ నేను చేసేది తప్పని నాకు అర్థం అవుతోంది. సుజాత కూడా పశ్చాత్తాపపడుతోంది. నేను ఏ విషయం తేల్చుకోలేకపోతున్నాను. పరిష్కారం చూపండి..

జవాబు...

మీరు చెప్పిన సమస్య కాస్త జటిలమైనదే. ఇందులో మీరు చాలా రిస్క్ తీసుకున్నారనే చెప్పాలి. మన సామాజిక కట్టుబాట్ల ప్రకారం, వివాహేతర బంధాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తాయి. అంతేకాదు కుటుంబాలు విడిపోవడంలో ఈ వివాహేతర బంధాలదే పెద్ద పాత్ర, మీకు మీ భార్యతో ఎలాంటి తగాదాలు, వైవాహిక జీవితంలో గొడవలు లేకుండా సాఫీగా సాగుతుందని అర్థం అవుతోంది. కానీ మీకు మీ పనిమనిషితో ఒక బలహీన క్షణంలో శారీరక సంబంధం ఏర్పడింది. అయితే ఇది చట్ట ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా వివాహేతర సంబంధం ఏర్పరుచుకోవడం నేరమేమీ కాదు! అంటే... ఇందులో మహిళదీ తప్పు కాదు, పురుషుడిదీ తప్పు కాదు. ఇద్దరికీ వివాహం అయినా సరే పరస్పరం ఇష్టపడితే చాలు... శృంగారంలో పాల్గొనవచ్చు. కానీ ఇది సామాజిక తప్పిదం. దీని ప్రాతిపదికన విడాకులు కోరవచ్చు. మీ విషయంలో కూడా ఇది జరిగే అవకాశం ఉంది. మీ భార్యకు మీ వివాహేతర బంధం గురించి తెలిస్తే వెంటనే విడాకులు సైతం కోరే అవకాశం ఉంది. అందుకే మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ విషయంలో మీరు పశ్చాత్తాపపడుతున్న సంగతి అర్థం అవుతోంది. అలాగే మీతో పాటు సంబంధం పెట్టుకున్న మహిళ కూడా పశ్చాత్తాపడుతున్నారు. అయితే మీరు సుజాతను వదలలేకపోతున్నారు. ఆమెతో రోజు లైంగిక బంధం కావాలి అనుకుంటే, మీ భార్యకు మీ పరిస్థితిని తెలపండి. ఆ తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకొని మీరు సుజాతతో కలిసి జీవితం పంచుకోండి.

ఈ వీడియోను క్లిక్ చేసి చూడండి...Subscribe చేయండి...ఒక వేళ మీరు మీ వివాహ బంధాన్ని కొనసాగించాలి అనుకుంటే మాత్రం మీరు వెంటనే మీ వివాహేతర బంధానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. అలాగే మంచి కౌన్సిలర్ ను కలిసి మీ సమస్యలకు పరిష్కారం వెతుక్కోండి. అలాగే మీ భార్యకు జరిగిన పొరపాటును వివరించి ఇద్దరు కౌన్సిలింగ్ ద్వారా పరస్పరం మీ సమస్యను పరిష్కారించుకోండి. ముఖ్యంగా మీ పిల్లవాడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీ నిర్ణయం తీసుకోండి.

First published:

Tags: Sexual Wellness

ఉత్తమ కథలు