మీకు తెలుసా.. నీటి కొరతను తీర్చేందుకు గాలి నుంచి నీటిని తయారుచేస్తున్నారు..

నీటికొరత సమస్యను తీర్చేందుకు శాస్త్రవేత్తలు రోజుకో కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సరికొత్త హైడ్రోజెల్‌ని తయారు చేశారు అమెరికా శాస్త్రవేత్తలు.

Amala Ravula | news18-telugu
Updated: March 19, 2019, 3:38 PM IST
మీకు తెలుసా.. నీటి కొరతను తీర్చేందుకు గాలి నుంచి నీటిని తయారుచేస్తున్నారు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 19, 2019, 3:38 PM IST
గాలిలో ఉండే తేమ నుంచి నీటిని సృష్టించే సరికొత్త ప్రయోగంలో అమెరికా పరిశోధకులు విజయం సాధించారు. ఇలా తయారైన నీటిని తాగొచ్చని చెబుతున్నారు. నీటి విపత్తలు, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రయోగం చక్కని ఫలితాలనిస్తుంది. ఈ విధానంలో హైడ్రోజెల్స్‌ని ఉపయోగించారు. ముందుగా వీటిని గాలి తగిలే చోట పెడితే ఆ గాలి ఉండే నీటిని గ్రహిస్తాయి. అనంతరం, వీటిని వేడిచేస్తే ఆ నీరు బయటికొస్తుంది.
తేమ, పొడి వాతావరణ పరిస్థితుల్లో ఈ హైడ్రోజెల్స్ గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడతాయి. గాల్లో ఉండే 5 లక్షల ఘనపు కిలోమీటర్ల మేర నీటినిల్వలున్నాయి. వీటిని ఈ సరికొత్త వ్యవస్థ విజయవంతంగా ఒడిసిపడతాయి. కిలో హెడ్రోజెల్‌తో రోజుకు 50లీటర్ల వరకూ నీరు ఉత్పత్తి అవుతుంది. దీని ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ హైడ్రోజెల్స్ త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.
First published: March 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...