మంచుతో కప్పబడిన కొండల నడుమ సూర్యోదయాన్ని చూస్తూ... పక్షుల కిలకిల రాగాలు వింటూ.. అల్లం ఛాయ్ ఆస్వాదిస్తూ... ల్యాప్‌టాప్ ముందు పెట్టుకొని పనిచేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. మీ పని పూర్తైన తర్వాత ప్రకృతి అందాలను వీక్షించడం, అడవిలో నడవడం, కొండలపై జాలువారుతున్న నీటిలో స్నానం చేయడం, నక్షత్రాల క్రింద విందు చేయడం వంటివి ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది కదా. ఊహకందని ఈ సన్నివేశాలను నిజం చేయనున్నాయి అనేక ఐటీ కంపెనీలు. తమ యువ టెకీలకు మరో రెండు వారాల్లోనే ఈ అవకాశాన్ని కల్పించనునాయి.
Indian Navy Jobs 2020: ఇంటర్ పాసైనవారికి ఇండియన్ నేవీలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
RRB Jobs 2020: ఆర్ఆర్బీ అభ్యర్థులకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్
ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన అనేక సాఫ్ట్వేర్, అనుబంధ కంపెనీలు 2020 డిసెంబర్ 31 వరకు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంను ఎంపికను తీసుకోవచ్చని ప్రకటించడం తెలిసిందే. కోవిడ్–19 ప్రభావంతో మూతపడిన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తమ కార్యకలాపాలు ప్రారంభిస్తుండటంతో ఇప్పటివరకు ఇంట్లోనే ఉండి విసుగు చెందుతున్న టెకీలకు ఈ వెకేషన్ ప్లాన్ చేస్తున్నాయి ఐటీ కంపెనీలు. గత ఆరు నెలలుగా లాక్డౌన్, అన్లాక్డౌన్, సోషల్ డిస్టన్స్ వంటి వాటితో విసుగు చెందిన హైదరాబాద్‌లోని టెక్ యువకులు తమ బ్యాగేజ్, ల్యాప్టాప్లకో వర్క్ అండ్ వెకేషన్‌కు రెడీ అవుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ట్రావెల్ కంపెనీ ఆఫ్బీట్రాక్స్ ఫౌండర్ వందన విజయ్ మాట్లాడుతూ "లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉండి విసుగు చెందిన అనేక మంది టెక్ నిపుణులను కాటేజీలు, హోటల్స్, హోమ్ స్టేస్, రూరల్ కమ్యూనిటీస్ ఆహ్వానిస్తున్నాయి. తక్కువ మంది వ్యక్తులతో, కోవిడ్ నిబంధనల్లో భాగంగా సామాజిక దూరం పాటిస్తూ, కాలుష్యం లేని పరిశుభ్రమైన గాలి పీల్చుతూ తమ కార్యకలాపాలను చేసేలా అన్ని రకాల వసతులను కల్పించేందుకు ఆయా పర్యాటక సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి" అని చెప్పారు.
SBI ATM: ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు లేవా? డిపాజిట్ మెషీన్లో ట్రై చేయండి ఇలా
Aadhaar Charges: ఆధార్ సెంటర్లో చెల్లించాల్సిన అసలు ఛార్జీలు ఇవే
ఇప్పటికే అనేక మంది యువకులు తమ వెకేషన్‌ను బుక్ చేసుకున్నారని ఆమె తెలిపారు. అన్‌లాక్ 4 లో భాగంగా అనేక పర్యాటక ప్రదేశాలు తెరుచుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్, లడఖ్, కేంద్రపాలిత ప్రాంతంలోకి ప్రవేశించే టూరిస్టులు తమతో కోవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్‌ను వెంటబెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక కాటేజీలో నెల రోజుల పాటు బస చేయడానికి సుమారు రూ.20,000 పైగా ఛార్జ్ అవుతుంది. దీనిలో బెడ్రూమ్, కిచెన్, బాల్కనీ, ఎలక్ట్రిసిటీ, వైఫై వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి టూరిస్ట్ సంస్థలు. హైదరాబాద్‌లోని ఖరీదైన మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ఏరియాల్లో అయ్యే ఖర్చు కన్నా ఇక్కడ అయ్యే ఖర్చు తక్కువనే అభిప్రాయపడుతున్నారు అనేక మంది టెక్ యువకులు. మరింకెందుక ఆలస్యం మీ బ్యాగ్ సర్ధుకొని వెకేషన్‌కు రెడీ అవ్వండి. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. హ్యాపీగా పనిచేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lockdown, Unlock 4.0, Work From Home