తప్పా..? ఒప్పా..? ఇంట్లో భార్య లేని సమయంలో ఆమెతో..

ఓ రోజు ఒంట్లో నలతగా ఉండి సంతోష్ ఆఫీస్‌కు వెళ్లలేదు. సంతోష్ భార్య కూడా తన దగ్గరి బంధువుల పెళ్లి ఉంటే రెండు రోజుల ముందే ఊరెళ్లింది. బయటికెళ్లి బ్రేక్ ఫాస్ట్ చేసి ఇంటికెళ్లి టీవీ చూస్తూ కూర్చున్నాడు సంతోష్. ఎప్పట్లాగే... పదిన్నర ప్రాంతంలో మహేశ్వరి సంతోష్‌కు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగింది. ఇంట్లో ఉన్నాను. అదేంటి ఆఫీస్ కు వెళ్లలేదా అని అడిగితే ఫీవరిష్‌గా ఉంటే వెళ్లలేదన్నాడు.

news18-telugu
Updated: September 19, 2019, 11:19 AM IST
తప్పా..? ఒప్పా..? ఇంట్లో భార్య లేని సమయంలో ఆమెతో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ నగరానికి చెందిన 27 ఏళ్ల కుర్రాడు సంతోష్ (పేరు మార్చాం) మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. 2012లోనే ఐదంకెల జీతం వస్తుండటంతో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. పెళ్లి చేసుకునేందుకు సంతోష్ కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో సంతోష్ కు సరైన జోడిని వెతకడంలో తలమునకలయ్యారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. ఐదారు సంబంధాలు చూశారు. సంతోష్ కూడా వెళ్లి పెళ్లి చూపులు చూశాడు. ఇలా ఓ రోజు కూకట్ పల్లి హౌజింగ్ బోర్డులో మహేశ్వరి (పేరు మార్చాం) అమ్మాయిని పెళ్లి చూపులు చూశాడు సంతోష్. ఇద్దరు చూపులు కలిశాయి. ఇరు వర్గాల వారు సమ్మతం వ్యక్తం చేశారు. ఇక పెళ్లే తరువాయి అనుకుంటున్నారు. నల్గొండ నుంచి మరో ముఖ్యమైన బంధువు రావాల్సి ఉంది. ఆయన వచ్చాక కట్న కానుకలు మాట్లాడుకుందాం అనుకున్నారు. అంతా బాదానే జరిగినంది కాబట్టి పెళ్లి చూపుల సందర్భంగా పక్కకు వెళ్లి మాట్లాడుకున్నారు సంతోష్, మహేశ్వరి. ఇద్దరు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు. అదే రోజు సాయంత్రం నుంచి ఇద్దరి మధ్యా ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. అన్ని విషయాలు పంచుకున్నారు. పొడిపొడిగా మొదలైన మాటలు ప్రేమ కబుర్లు చెప్పుకునే వరకు వెళ్లాయి. ఇలా వారం గడిచిపోయింది.

నల్గొండ నుంచి అనుకున్న బంధులు వచ్చారు. కట్న కానుకలు మాట్లాడుకోవడం కోసం ఇరు కుటుంబాల వారు కూకట్‌పల్లిలోని మహేశ్వరి ఇంటికి చేరారు.కట్న కానుకలు మాట్లాడుకునే సమయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. సంతోష్ వాళ్ల నాన్న నల్గొండ బంధువుపై నోరు జారాడని మాటామాటా పెరిగింది.ఇది కుదరదని సంబంధం క్యాన్సల్ చేసుకున్నారు. పెళ్లి సంబంధం చెడిపోవడం సంతోష్ కు ఇష్టం లేదు. మహేశ్వరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. మా అంకుల్ ని మీ నాన్న అంతలా మాటలంటాడా...? ఏమొద్దు. విడిపోదాం అని తెగేసి చెప్పేసింది. ఇక చేసేది లేక సంతోష్ కూడా తనను తాను సర్ది చెప్పుకొని ముందుకు సాగాడు.


సీన్ కట్ చేస్తే... 2018 జూన్. తన కుమారున్ని స్కూల్ లో చేర్పించేందుకు వెళ్లాడు సంతోష్... రిసెప్షన్ దగ్గర ఓ అమ్మాయి గుడ్ మార్నింగ్ సార్... వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటూ స్వాగతం పలికింది. మా అబ్బాని ఎల్.కె.జి లో చేర్పించాలి. డిటెయిల్స్ చెప్పండి అంటూ అడిగాడు సంతోష్... రిసెప్షనిస్ట్ పాఫ్లెంట్ అందిస్తున్న సమయంలో ఇద్దరి చూపులు కలిశాయి.రెండు క్షణాలు తదేకంగా చూసుకున్నారు. ఆ రిసెప్షనిస్ట్ ఎవరో కాదు... ఎనిమిదేళ్ల క్రితం తాను పెళ్లి చూపూలు చూసిన మహేశ్వరి. వారంలోనే ఓ అనుబంధాన్ని పెనవేసుకున్న అమ్మాయి. మరో క్షణంలో తేరుకొని... త్వరత్వరగా అప్లికేషన్ ఫిల్ చేసి మహేశ్వరిని మరోసారి చూడకుండానే మరో స్టాఫ్ మెంబర్‌కి అప్లికేషన్ ఇచ్చేసి వెళ్లిపోయాడు సంతోష్. ఇంటికెళ్లి ఆ అమ్మాయికి సంబంధించిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. చీచీ.. నాకూ పెళ్లయింది... అమ్మాయికి కూడా అయి ఉంటుంది.చెడుగా ఆలోచించకూడదని అనుకొని తన పనిలో తాను నిమగ్నమయ్యాడు సంతోష్. సాయంత్రం ఐదు గంటల సమయంలో సంతోష్ ఆఫీస్ నుంచి ఇంటికెళ్తూ ఓ పాన్ షాప్ దగ్గర ఆగి దమ్ము కొడుతున్న సమయంలో ఫోన్ రింగ్ అయింది. ఓ తీయని గొంతు హలో అంటూ పలకరించింది. గుర్తుపట్టావా అంటూ ప్రశ్నించింది. సంతోష్ ఊహూ అన్నాడు.

నేను మహీ అదే మహేశ్వరిని అంది. గుర్తుపట్టినా గుర్తుపట్టనట్టు నటించి ఏ మహేశ్వరి అని ప్రశ్నించింది. ఫోజు చాల్లే... ఓవర్ యాక్షన్ చేయకు నేను అంటూ చొరవగా మాట కలిపింది. సంతోష్ ఇష్టంగానే మాటలు కలుపుతూ అయిష్టత ప్రదర్శింస్తున్నాడు అమెతో.అలా మాటలు కంటిన్యూ అయ్యాయి. ఒకరినొకరికి మాటలు పెరిగాయి. సమయం దొరికినప్పుడల్లా మాట్లాడుకుంటున్నారు. మహేశ్వరికి కూడా పెళ్లియింది. భర్త బ్యాంకులో పని చేస్తాడు. పెళ్లయి ఏడేళ్లయినా సంతానం కలగలేదు. ఇలా ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ తరచూ మాట్లాడుకుంటున్నారు.


ఓ రోజు ఒంట్లో నలతగా ఉండి సంతోష్ ఆఫీస్‌కు వెళ్లలేదు. సంతోష్ భార్య కూడా తన దగ్గరి బంధువుల పెళ్లి ఉంటే రెండు రోజుల ముందే ఊరెళ్లింది. బయటికెళ్లి బ్రేక్ ఫాస్ట్ చేసి ఇంటికెళ్లి టీవీ చూస్తూ కూర్చున్నాడు సంతోష్. ఎప్పట్లాగే... పదిన్నర ప్రాంతంలో మహేశ్వరి సంతోష్‌కు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగింది. ఇంట్లో ఉన్నాను. అదేంటి ఆఫీస్ కు వెళ్లలేదా అని అడిగితే ఫీవరిష్‌గా ఉంటే వెళ్లలేదన్నాడు. అవునా.. తిన్నావా మరి అని అడిగింది. సంతోష్ ఊ అన్నాడు. మరి లంచే అంటే.. స్విగ్గీలో ఆర్డర్ ఇస్తాలే అన్నాడు. మహేశ్వరి ఓకే అని పెట్టేసింది. మరో ఐదు నిమిషాల తర్వాత.. మళ్లీ ఫోన్ చేసింది. మీ ఇళ్లు మా స్కూల్ కు ఎంత దూరంలో ఉంటుందని అడిగింది. టూ కిలో మీటర్స్ అన్నాడు. ల్యాండ్ మార్క్స్ చెప్పాడు. అంతలోనే ఎందుకని అడిగాడు. ఏంలేదు.... మీ ఇంటికి వద్దామని అనింది మహేశ్వరి... సంతోష్ కంగారుగా హే... ఎందుకు అన్నాడు.ఊరికే అంటూ టెన్ మినిట్స్‌లో సంతోష్ చెప్పిన ఓ ల్యాండ్ మార్క్ దగ్గర ఉంటాను వచ్చి పిక్ చేసుకో అనింది. వద్దని వారించే లోపు... అక్కడికి వచ్చి ఫోన్ చేస్తానని చెప్పింది.

అన్నట్టుగానే ఐదు నిమిషాల్లో మహేశ్వరి కాల్ వచ్చింది సంతోష్‌కి. వెళ్లి ఆమెని ఇంటికి తీసుకొచ్చాడు. ఇళ్లు చూపించాడు. ఎప్పట్లగానే మాట్లాడుకుంటున్నారు. నేను వంట చేస్తానని చొరవ తీసుకొని చేసింది. వంట పూర్తి కాగానే ఇద్దరూ కలిసి భోజనం చేశారు. కూర్చొని మాట్లాడుకున్నారు.కొంచెం కాంప్రమైజ్ అయి ఉంటే ఇద్దరం భార్య భర్తల్లా ఉండేవాళ్లం అనింది మహేశ్వరి. సర్లే... దేనికయినా రాసి పట్టి ఉండాలన్నాడు సంతోష్.... అలా మాట్లాడుతూనే మహేశ్వరి... సంతోష్ ని కిస్ చేసింది. గట్టిగా హత్తుకుంది.... ఈ హఠాత్ పరిణామానికి సంతోష్ కాస్త కంగారు పడ్డాడు. అయినా అమెను వారించలేక పోయాడు. ఆమె మరి కొంచెం ముందుకెళ్లింది. సంతోష్ ఆమెను అనుసరించాడు. అలా ఇద్దరు ఒక్కటయ్యారు.


అప్పట్నుంచి సంతోష్, మహేశ్వరి సమయం దొరికినప్పుడల్లా కలుస్తూ ఉన్నారు. భర్త కళ్లు గప్పి మహేశ్వరి... భార్య కళ్లుగప్పి సంతోష్ గుట్టుగా సంసారాన్ని సాగిస్తున్నారు. ఇలా కొంత కాలం గడిచింది. 2019 మే నెలలో నేను నెల తప్పాను. ఇప్పుడు మూడో నెల.. థాంక్స్ సంతోష్... నాకిది చాలు... కళ్లల్లో నీ రూపం కడుపులో నీ ప్రతిరూపం అంటూ మురిసిపోయింది. సంతోష్‌కు మాత్రం మైండ్ బ్లాంక్ అయింది. తాను చేసింది తప్పా...? ఒప్పా..? అంటూ మథనపడుతున్నాడు. ఇంతకు సంతోష్ చేసింది సరైందేనా...? కాదా...? మీరేమంటారు.మీ అభిప్రాయాలు,అనుభవాలు మాతో పంచుకోండి : news18telugu@gmail.com
First published: September 19, 2019, 11:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading