Home /News /life-style /

HOWM MUCH FREEDOM IS OKAY FOR TEENS PVN

Freedom for Teens : టీనేజ్ పిల్లలకు తల్లిదండ్రులు ఎంత ఫ్రీడమ్ ఇస్తే బెటర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Freedom for Teens : పిల్లలు యుక్తవయస్సులోకి ప్రవేశించినట్లయితే వారి ఆలోచనలు సాధారణంగా మారుతాయి. అంచనాలు కొంచెం పెరుగుతాయి. టీనేజ్ లోకి(Teenage)వచ్చాక తనను తాను పెద్దగా, బాధ్యతగల వ్యక్తిగా భావించడం ప్రారంభిస్తారు.

    Freedom for Teens : పిల్లలు యుక్తవయస్సులోకి ప్రవేశించినట్లయితే వారి ఆలోచనలు సాధారణంగా మారుతాయి. అంచనాలు కొంచెం పెరుగుతాయి. టీనేజ్ లోకి(Teenage)వచ్చాక తనను తాను పెద్దగా, బాధ్యతగల వ్యక్తిగా భావించడం ప్రారంభిస్తారు. ఇదే సమయంలో స్వేచ్ఛ లేదా ఫ్రీడం(Freedom)ను పొందాలని వారు భావిస్తారు. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు తనపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని భావిస్తుంటారు. అయినప్పటికీ, ఇది అపరిపక్వ వయస్సు, ఎక్కువ ప్రాపంచిక అనుభవం లేకపోవడం వల్ల, యుక్తవయస్కులు కొన్ని విషయాల్లో తీసుకున్ప నిర్ణయాలు తలకిందులవడం,చేసిన పనులు ఎదుటివారికి ఇబ్బంది కలిగించడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ప్రతీ విషయంపపై ఆంక్షలు విధించడం వంటి పనలు చేయడం వల్ల..పిల్లలు విసుగు చెంది కుటుంబ సభ్యులకు తెలియకుండా తప్పుడు పనులు చేయడం ప్రారంభిస్తారు. అందుకే పిల్లలకు ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలి..ఏ విధంగా ఫ్రీడమ్ ఇవ్వడం ద్వారా వారు ఉత్తమంగా,క్రమశిక్షణతో ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

    ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి
    నిపుణులు తెలిపిన ప్రకారం...యుక్తవయస్సు కోసం తనను తాను సిద్ధం చేసుకోవడానికి పిల్లలకు తగినంత స్వేచ్ఛను ఇవ్వండి. వారికి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి అనేదానికి సమాధానం ప్రతి తల్లిదండ్రులకు, వారి పిల్లలకు భిన్నంగా ఉండవచ్చు. అయితే, మీ పిల్లలను నమ్మండి. మీ విశ్వాసం పిల్లలలో బాధ్యత భావాన్ని కలిగిస్తుంది. పిల్లల వయస్సు ఎంత, ఎంత పరిణతి చెందారు, ఏదైనా అనుభవం వల్ల మానసికంగా బాధపడ్డారా అనే విషయాలను గుర్తుంచుకోవాలి. దీని తర్వాత మాత్రమే, వారికి ఏ విషయంలో ఫ్రీడమ్ ఇవ్వాలో నిర్ణయించండి.

    Chanakya Niti : అలాంటి తల్లిదండ్రులు పిల్లల పాలిట శత్రువులే!

    Heath And Fitness Tips : వర్షాకాలంంలో ఆరోగ్యంగా,ఫిట్ నెస్ తో ఉండాలంటే ఇలా చేయండి

    ఈ విషయాలను గుర్తుంచుకోండి
    16 ఏళ్ల వయస్సు వారిని మాత్రమే కొన్ని పనులు సొంతంగా చేసుకోనివ్వండి. పిల్లల వయస్సు దీని కంటే తక్కువగా ఉంటే వారిని అర్థరాత్రి వరకు మెలకువగా ఉండనివ్వవద్దు.డ్రైవింగ్ చేయడానికి అనుమతించవద్దు. ఇవన్నీ చేయడానికి కొన్నాళ్లు వేచి ఉండమని చెప్పండి.



    పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు నియమాలను కూడా చెప్పండి. తద్వారా వారు స్వేచ్ఛను దుర్వినియోగం చేయలేరు, క్రమశిక్షణలో ఉంటారు.

    పిల్లలు మరింత దౌర్జన్యంగా లేదా దుర్భాషలాడినట్లయితే వారికి మీరు విధించే శిక్ష గురించి కూడా వారికి వివరించండి.
    Published by:Venkaiah Naidu
    First published:

    Tags: Children, Freedom, Lifestyle, Parents

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు