వర్షాకాలంలో ఇవి చేస్తే... మీ చర్మం మెరవడం ఖాయం

పెరుగు, పసుపు, తేనే కూడా వర్షాకాలంలో చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

news18-telugu
Updated: September 22, 2019, 3:35 PM IST
వర్షాకాలంలో ఇవి చేస్తే... మీ చర్మం మెరవడం ఖాయం
మెరిసే చర్మం కోసం ఈ ఆహారం తీసుకోండి..
news18-telugu
Updated: September 22, 2019, 3:35 PM IST
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. మబ్బుల పట్టిన ఆకాశంతో అంతటా చల్లగా అయిపోయింది. వర్షకాలంతో పాటు.. అనేక వ్యాధులు, సమస్యలు కూడా వెంటే వస్తుంటాయి. కొన్నిచోట్ల వర్షాలకు బురద,వాననీరు ఎక్కడికక్కడే నిల్వ ఉంటాయి. దీంతో అవి చూస్తే చాలా చికాకుగా అనిపిస్తుంటుంది. అందుకే వానకాలంలో మనమంతా మరింత అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా పరిసరాల్ని మరింత పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

వర్షాకాలంలోకూడా మన ముఖ సౌందర్యాన్ని రక్షించుకోవాలంటే కొన్ని పద్ధతులు తప్పక పాటించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తుంటారు. వర్షాకాలంలో చర్మం పట్ల చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. వర్షకాలంలోని చల్లటి వాతావరణం కారణంగా మన చర్మం పగిలిపోవడం,ఊడిపోవడం, మంట పెట్టడం, దురదపెట్టడం, లాంటి సమస్యలతో బాధపెడుతుంటాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే వెజులీన్ వంటి క్రీములు శరీరానికి రాస్తూ ఉండాలి.

వర్షకాలంలో వీలైనంతవరకు సబ్బులకు దూరంగా ఉండాలి. వర్షకాలంలో కూడా చర్మం డ్రైగా అయిపోవడం, పగిలిపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి, మరి వీటికి చెక్ పెట్టాలంటే మనం ఒళ్లు రుద్దుకునేందుకోసం సబ్బుల పట్ల జాగ్రత్తలు వహించాలి. రోజు ఒళ్లంతా కాస్త మంచి నూనెను రాసుకుని ఆ తర్వాత శనగపిండితో ఒంటిని రుద్దుకంటూ స్నానం చేయాలి. ఇప్పుడు మార్కెట్‌లో సున్నిపిండి కూడా మనకు అందుబాటులో దొరుకుతుంది కాబట్టి... ఇంట్లో తయారు చేసుకోవడానికి టైం లేనివాళ్లు... మార్కెట్‌లో దొరుకుతున్న సున్నిపిండిని వాడితే సరిపోతుంది.

పెరుగు, పసుపు, తేనే కూడా వర్షాకాలంలో చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మాస్క్ లా వేసుకునేటప్పడు... పోడిచర్మం వారు తేనే రోజ్ వాటర్, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగివేయాలి.. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు. ఇంకా అరటిపండు, యాపిల్, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిగా మారకుండా ఉండదు. మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనే కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్ చేసుకోవాలి. ఇలా వానాకాలంలో వారానికి ఒకసారి చేస్తే.. చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది. చర్మం పగిలినట్టుగా ఉంటే.. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత వెనిగర్ కలిపిన నీళ్లను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే చలికాలంలో దొరికే అన్ని రకాల పళ్లను, కాయకూరలను తినడం ద్వారా కూడా చర్మాన్ని చక్కగా ఉంచుకోవచ్చు మరి.
First published: September 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...