Home /News /life-style /

HOW TO STOP HAIRFALL IN MONSOON PVN

Hair Fall : హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా..ఇలా చేస్తే వెంట్రుకలు ఊడిపోయే సమస్యకు చెక్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వర్షాకాలంలో జుట్టు రాలే సమస్య సర్వసాధారణం. ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్(Hair Products)వాడినా జుట్టు రాలడం ఆగదు. అందుకే వర్షాకాలంలో కొన్ని ప్రత్యేకమైన జుట్టు సంరక్షణ చిట్కాలను పాటిస్తే జుట్టు రాలడాన్ని చిటికెలో దూరం చేసుకోవచ్చు.

Stop Hair Fall : వర్షాకాలం(Monsoon) అంటే ఇష్టం ఉండదనిది ఎవరికి చెప్పండి. వర్షాన్ని ఆస్వాదించేందుకు కొందరు ఇష్టపడగా, ఎండ వేడిమిని అనుభవించి రుతుపవనాల రావడంతో ఆనందించేవారు మరికొందరు. అయితే, రుతుపవనాల వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయండోయ్. అందులో జుట్టు రాలడం(Hair Fall) కూడా ఒకటి. నిజానికి వర్షాకాలంలో జుట్టు రాలే సమస్య సర్వసాధారణం. ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్(Hair Products)వాడినా జుట్టు రాలడం ఆగదు. అందుకే వర్షాకాలంలో కొన్ని ప్రత్యేకమైన జుట్టు సంరక్షణ చిట్కాలను పాటిస్తే జుట్టు రాలడాన్ని చిటికెలో దూరం చేసుకోవచ్చు.

వర్షాకాలంలో జుట్టు తరచుగా తడిసిపోతుంది. అటువంటి పరిస్థితిలో.. చాలా మంది తడి జుట్టును పొడిగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. జుట్టుని ముడి వేసుకుంటారు. దీని కారణంగా జుట్టు బలహీనంగా మారి రాలడం ప్రారంభమవుతుంది. అందువల్ల, వర్షపు నీటిలో తడిసిన తర్వాత, తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. శుభ్రమైన నీటితో జుట్టును కడగాలి. గాలిలో ఆరిన తర్వాత మాత్రమే జుట్టును ముడివేసుకోవాలి

పొడి షాంపూ ఉపయోగించండి
వర్షంలో జుట్టు తడిసినప్పుడు మొదటగా తడి జుట్టును కాగితపు టవల్ తో తుడిచి, నీటిని తీసివేయండి. ఇప్పుడు జుట్టు యొక్క అన్ని భాగాలపై డ్రై షాంపూని స్ప్రే చేయండి. జుట్టును శుభ్రమైన నీటితో కడగడం మర్చిపోవద్దు.

Hair on palm : మన అరచేతిలో,అరికాలుపై వెంట్రుకలు ఎందుకు రావో తెలుసా

హెయిర్ కవర్
వర్షాకాలంలో... వర్షాలు లేకపోయినా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జుట్టును స్కార్ఫ్ లేదా టోపీతో కప్పి ఉంచుకోవాలి.

జుట్టు తేమ
వర్షాకాలంలో జుట్టుకు పోషణ కోసం ఆయిల్ బేస్డ్ సీరమ్‌ని ఉపయోగించడం మంచిది. ఇది కాకుండా, ప్రతి 15 రోజులకు ఒకసారి జుట్టును డీప్ కండిషనింగ్ చేయండి. అలాగే, వర్షాకాలంలో టీ, కాఫీ వంటి కెఫీన్ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించండి.



ఆహారం మీద దృష్టి
వర్షాకాలంలో జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి, జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోడానికి ఆహారంపై శ్రద్ధ పెట్టడం మర్చిపోవద్దు. వేయించినవి లేదా జంక్ ఫుడ్ తినకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఇవి తింటే జుట్టు రాలడం మరింత పెరుగుతుంది.

తక్కువగా ఉండేలా చూడాలి
వర్షాకాలంలో మీ జుట్టు తక్కువగా ఉండేలా ప్రయత్నించండి. దీనితో, మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం మీకు కష్టంగా ఉండదు. మీ జుట్టు రాలడం కూడా దానంతటదే తగ్గుతుంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Hair fall, Hair Loss, Hair problem tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు