Remove Lizards From Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

ప్రతీకాత్మక చిత్రం

Remove Lizards From Home: కొంతమంది తాము వేటికి భయపడం అని చెబుతూనే బల్లిని చూస్తే మాత్రం ఆమడదూరం పోతారు. గోడ మీద బల్లి కనిపిస్తే.. కేకలు వేస్తారు. ప్రతీ ఇంట్లో ఎక్కడో ఒక చోటు బల్లులు కనిపిస్తూనే ఉంటాయి. వీటి వల్ల కొంతమందికి విసుగు అనిపిస్తుంటుంది. అయితే వీటిని ఎలా వదిలించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

 • Share this:
  కొంతమంది తాము వేటికి భయపడం అని చెబుతూనే బల్లి(Lizard)ని చూస్తే మాత్రం ఆమడదూరం పోతారు. గోడ మీద బల్లి కనిపిస్తే.. కేకలు వేస్తారు. ప్రతీ ఇంట్లో ఎక్కడో ఒక చోటు బల్లులు కనిపిస్తూనే ఉంటాయి. వీటి వల్ల కొంతమందికి విసుగు అనిపిస్తుంటుంది. ఎక్కడ వచ్చి అవి తమ మీద పడతాయో అనే అనుమానం కూడా వస్తుంటుంది. చాలా మంది ఇళ్లల్లో బల్లులు ఉండటం సహజం. అయితే ఈ బల్లులను చూస్తే కొందరు భయం(Fear)తో పారిపోతుంటారు. బల్లులు ఉన్న ప్రాంతానికి అస్సులు రారు. బల్లులను పోగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిని బయటకు వెళ్లగొట్టే ప్రయత్నాలు చేసినా.. మళ్లి వస్తుంటుంది.

  Weight Loss Tips : త్వరగా బరువు తగ్గాలా.. అయితే ఈ 6 మర్పులు చేయండి..


  ఇంట్లో గోడలపై ఉండే చిన్న చిన్న పురుగుల కోసం తరచూగా వస్తుంటాయి. వాటిని బయటకు తరిమికొట్టాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే మళ్లీ కనిపించవు. అయితే వాటిని ఎలా వదిలించుకోవాలో ఇక్కడ మనం తెలుసుకుందాం.. మొదటగా మనం ఏం చేయాలంటే..

  ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. యాంటీ బ్యాక్టీరియా సోల్యుషన్‌తో ఇంటి లోపల గోడలు, ఫ్లోర్‌ను క్రమం తప్పకుండా క్లీన్‌ చేయాలి. కిటికీలు, మూలాలను శుభ్రంగా ఉంచుకోవాలి. కాఫీ, టొమాకో పౌడర్‌ని నీటితో కలిపి ముద్దలా చేయాలి. ఆ ముద్దలను గోడలపై అతికించాలి. నెమలి ఈకలను చూస్తే బల్లులు భయపడిపోతాయి. వాటికి కూడా ఇంట్లో పెడితే బల్లులు దరి చేరవు. వెలుతురుకు బల్లులు ఆకర్షితమవుతాయి.

  Daily Walking Tips: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నడకలో ఇలాంటి మార్పులు చేయండి.. వివరాలు తెలుసుకోండి..


  అందుకే వీలయినప్పుడల్లా బల్పులను ఆర్పేస్తే బల్లులు పెద్దగా రావు. గుడ్డు పొట్టుతో కూడా బల్బులను తరిమేయవచ్చు. ఆహారం దొరకకుంటే బల్లులు వాటంతవే వెళ్లిపోతాయి. అందుకే క్రిములు కీటకాలు ఉండకుండా చూసుకోండి. అలాగే ఘాటైన ఉల్లి వాసనంటే బల్లులకు పడదు. ఉల్లిరసాన్నిగోడలపై స్ప్రే చేస్తే బల్లులు వెళ్లిపోతాయి.

  ఉల్లిగడ్డలను ముక్కలుగా కోసి కిటికీలు, మూలల్లో ఉంచినా సరిపోతుంది. నాఫ్తలీన్ గోళీల వాసనకు బల్లులు పారిపోతాయి. వాటిని ఇంట్లో అక్కడక్కడా ఉంచితే ప్రయోజనం ఉంటుంది. ఇక బిర్యానీ ఆకులను మండించి ఆ పొగని ఇంటి మొత్తం వ్యాపించేలా చేయాలి. ఆ వాసనకు బల్లులు ఉండలేవు. ముఖ్యంగా ఇంటి గోడలపై క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. ఫర్నిచర్‌ను గోడలకు ఆనించి ఉంచకూడదు. అంతే కాకుండా కోడి గుడ్డు పెంకులు.. మొక్కల చుట్టూ బల్లులు ఎక్కువగా ఉంటాయి. దీనికి కోడి గుడ్డు పెంకు ఆ మొక్కల దగ్గర పెట్టి ఉంచాలి. దీనివల్ల బల్లులు ఆ దగ్గరకు రావు. మనకు దగ్గర్లో గోడమీద బల్లి వెళ్తూ కనిపించిందే అనుకోండి.. వెంటనే దాని మీద చల్లటి నీరు పోయాలి.

  అప్పుడు అది వెంటనే కింద పడిపోతుంది. దానిని అప్పుడు మీరు తీసి.. బయటకు వెళ్లగొట్టే అవకాశం ఉంటుంది. ఇంట్లో బల్లులు ఎక్కువగా కనపడే చోట కర్పూరం పొడి చేసి చల్లాలి. అలాగే పొడి చల్లలేని చోట కర్పూరం బిళ్ళలు పెడితే బల్లులు ఆ ఘాటు వాసనకి రావు. అలాగే ఆ ఘాటు వాసన పోయిన తరువాత మళ్ళి కొత్తవి వెయ్యాలి. లెమన్ గ్రాస్ ని కాల్చి ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయండి.

  పురుషుల కంటే మహిళల్లోనే అవి ఎక్కువగా ఉండటానికి గల కారణం ఏమిటి..? తాజా అధ్యయనంలో సంచలన విషయాలు..


  ఆ వాసన వాటికి పడదు.లేదంటే లెమన్ గ్రాస్ ని ఆయిల్ లో ముంచి ఎక్కడైతే బల్లులు దర్శనమిస్తున్నాయో, అక్కడ కొన్ని చుక్కలు పోయండి. అలా కాదు అంటే లెమన్ గ్రాస్ ని అక్కడే వెలాడదీయండి. ఇలా పైన చెప్పిన చిట్కాలను పాటిస్తే.. బల్లుల బెడద తప్పుతుంది.
  Published by:Veera Babu
  First published: