హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Holi 2022: మీ శరీరంపై హోలీ రంగులు తొలగడానికి.. సింపుల్ హోం రెమిడీస్..

Holi 2022: మీ శరీరంపై హోలీ రంగులు తొలగడానికి.. సింపుల్ హోం రెమిడీస్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Holi 2022: ముఖం, చర్మాన్ని రోజ్ వాటర్‌తో శుభ్రం చేసుకోవడం ద్వారా మొండి రంగులను వదిలించుకోవచ్చు.

కరోనా తర్వాత చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న హోలీ ( Holi 2022)  వచ్చేసింది. హోలీ ఆడిన తర్వాత వాటి తాళుకు  మరకలు (Color marks) పోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. వీటి తయారీలో వాడే హానికరమైన కృత్రిమ రసాయనాలు చర్మం, జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఈ రంగులు చర్మంపై ఏర్పర్చే మొండి మరకలను వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

నిమ్మరసం, తులసి ఆకులు, అశ్వగంధ, శీకాకాయ పొడిని కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి అరగంట వరకు ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే మొండి రంగులు వదులుతాయి. కొబ్బరి పాలు, పెరుగు కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని కూడా ఇందుకు వాడవచ్చు. ఇవి సహజ కండిషనర్‌గా పనిచేస్తాయి. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురుకావు.జుట్టు, మాడుపై పేరుకునే రంగుల వ్యర్థాలను సహజ మార్గాల్లో తొలగించుకోవచ్చు.

ఇది కూడా చదవండి:  వేసవిలో తక్షణమే ఈ 5 వస్తువులను తీసుకోవడం ఆపేయండి.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి


చర్మ సంరక్షణకు వాడే సున్నిపిండికి రంగుల అవశేషాలను తొలగించే శక్తి ఉంటుంది. దీన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. పసుపు, కర్పూరం, గులాబీ పొడి, బియ్యం, చందనం పొడి, నిమ్మ లేదా నారింజ తొక్కలను కలిపి పొడిగా చేసుకోవాలి. రంగుల మరకలు ఉన్న చోట ఈ పిండితో స్క్రబింగ్ చేసుకోవాలి. దీన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకున్నా ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనె, నువ్వుల నూనె, బాదం నూనె వంటి సహజ నూనెలతో శరీరం, ముఖంపై మసాజ్ చేయాలి. దీనివల్ల రంగుల అవశేషాలు చర్మ రంధ్రాల్లోకి పోకుండా, పై పొరల్లోనే ఉంటాయి. బాగా మర్దన చేసిన తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

ఇది కూడా చదవండి: Holi 2022: రంగుల హోలీకి ఇంట్లోనే నేచురల్ కలర్స్ తయారు చేసుకోండి...



ముఖం, చర్మాన్ని రోజ్ వాటర్‌తో శుభ్రం చేసుకోవడం ద్వారా మొండి రంగులను వదిలించుకోవచ్చు. ముల్తానీ మట్టి లేదా సున్నిపిండిని వాడిన తరువాత రోజ్ వాటర్ వాడటం వల్ల చర్మం మెరుపును సంతరించుకుంటుంది. కనుబొమలపై ఏర్పడే మొండి రంగులను నిమ్మరసం సాయంతో తొలగించుకోవచ్చు. దూదిని నిమ్మరసంలో ముంచి కనుబొమలపై మర్దన చేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.

ముఖం, కాళ్లు చేతులను నేచురల్ మిసెల్లార్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి. దీన్ని మేకప్ తొలగించడానికి కూడా వాడతారు. మార్కెట్‌లో లభించే ఆర్గానిక్ మిసెల్లార్ వాటర్‌ను ఎంచుకుంటే దుష్ప్రభావాలకు దూరంగా ఉండవచ్చు. ఇది చర్మంపై కనిపించే రంగుల మరకలను పూర్తిగా తొలగిస్తుంది. గోళ్లలో పేరుకుపోయే మొండి మరకలను కూడా వదిలిస్తుంది.

First published:

Tags: Holi, Holi 2022

ఉత్తమ కథలు