Health Tips : కిడ్నీ సమస్యలున్నట్లు తెలిపే లక్షణాలివే..

ప్రతీకాత్మక చిత్రం

కొన్నిసార్లు కిడ్నీ సమస్యలు ఎలాంటి లక్షణాలు లేకుండానే దాడిచేస్తాయి. కానీ, కొన్నింటినీ గమనించి ముందుగానే కిడ్నీ ప్రాబ్లమ్స్‌ని తెలుసుకోవచ్చు. అవేంటంటే..

  • Share this:
నీరసం, బలహీనత...కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే విటమిన్ డీని సంగ్రహిస్తాయి. దీనివల్ల ఎముకలు బలంగా మారడమే కాకుండా ఎరిత్రోపొయెటిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. కిడ్నీ సమస్యలున్నవారికి ఈ హార్మోన్ విడుదల కాదు. కాబట్టి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోయి.. కండరాలు, మొదడు బలహీనమవుతాయి.
రుచి కోల్పోవడం..  కిడ్నీసమస్యలున్నప్పుడు రక్తంలో మలినాలు, వ్యర్థాలు పేరుకుపోతాయి. దీంతో.. నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ అంటే రుచిని చూసే గుళికల పనితీరు ప్రభావం తగ్గుతుంది. దీంతో.. రుచిని మనం గుర్తించలేం. అంతేకాదు.. దుర్వాసనతో కూడిన శ్వాస వస్తుంది. అంతేకాదు, నోటిలో లోహపు తరపు రుచి సమస్యలు వస్తాయి.
పాదాలు, చేతుల వాపు.. శరీరంలో మలినాలు, రసాయనాలు పేరుకుపోయి పలుచోట్ల వాపు కనిపిస్తుంది. ముఖ్యంగా.. చీలమండలు అంటే పాదాల వద్ధ కీళ్లు, పాదాలు, చేతులు ఉబ్బి వాస్తుంటాయి.
కళ్లు ఉబ్బడం.. శరీరంలోంచి మనకు అవసరమైన ప్రోటీన్లు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. దీంతో ప్రోటీన్ల లోపం తలెత్తి కళ్ల చుట్టూ ఉబ్బుతాయి.
నిద్రలేమి.. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తంలో చేరే వ్యర్థాలు.. బయటికి విసర్జించబడవు. ఈ ప్రభావం శరీర భాగాలపై పడి నిద్రలేమి సమస్య ఎదురవుతుంది.
చర్మం పొడిబారడం.. కిడ్నీ సమస్యలున్నప్పుడు తగినంత లవణాలు కొనసాగకపోవడంతో చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. దీంతో.. చర్మం పొడిబారి దురద వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఇవే కాకుండా, మూత్రంలో మంట, మూత్రం రంగు మారడం, అధిక రక్తపోటు వంటి లక్షణాల ద్వారా కిడ్నీ సమస్యలను గుర్తించొచ్చు. అయితే.. వీటిని ముందుగా గుర్తించి ట్రీట్‌మెంట్ చేయించడం వల్ల త్వరగా సమస్య నుంచి బయటపడొచ్చు.

ఈ వీడియో కూడా చూడండి..

First published: