కాల్షియం లోపం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలివే..

ప్రతీకాత్మక చిత్రం

ఈ మధ్యకాలంలో చాలామంది కాల్షియంలేమితో బాధపడుతున్నారు. అయితే, సమస్య వచ్చాక ఇబ్బందిపడే బదులు రాకముందే కొన్ని లక్షణాల ద్వారా కాల్షియం లోపాన్ని అధిగమించొచ్చు. మరి ఆ లక్షణాలేంటంటే..

  • Share this:
శరీరంలోని ఎముకలు, దంతాలు, గుండె ఇలా ప్రతి అవయవానికి కాల్షియం అవసరముంటుంది. కాల్షియం సరిగ్గా ఉంటేనే ఎముకలు దృఢంగా ఉంటాయి. అన్ని జీవక్రియలకు కాల్షియం అవసరం ఎంతో ముఖ్యం. కానీ, కాల్షియం లోపంతో చాలామంది బాధపడుతుంటారు. అలాంటిసమస్యలను ముందుగానే గుర్తించి దానికి తగినట్లుగా చికిత్స తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యను అధిగమించొచ్చు.
* కాలు, చేతి నరాలు లాగడం, కాళ్ళనొప్పులు, చేతులు నొప్పులు ఎక్కువగా ఉంటే సమస్యను ఈజీగా గుర్తించొచ్చు.
* కాల్షియం లోపంతో బాధపడేవారి గోర్లు చిట్లుతుంటాయి.
* గుండెకొట్టుకునే వేగంలో మార్పు ఉంటే కాల్షియం లోపంగా గుర్తించొచ్చు.
* త్వరగా బరువుతగ్గినా.. అధికబరువు తగ్గినా కాల్షియం లోపం ఉన్నట్లు భావించొచ్చు.
* కాలిపిక్కలు పట్టేయడం, కూర్చుని వెంటనే లేవలేకపోవడం ఉంటే కాల్షియం సమస్య అని గుర్తించొచ్చు.
* కాల్షియం తక్కువగా ఉంటే బీపీ పెరుగుతుంది.
* చిన్న చిన్న గాయాలకే ఫ్యాక్చర్, ఎముకలు విరిగితే బలహీనంగా ఉండి విరగడం కాల్షియం సమస్యగా భావించొచ్చు.
కొన్ని సందర్భాల్లో ఈ సమస్యలన్నీ వేరే కారణంగా కూడా వస్తాయి. అయితే వైద్యుడిని కలిసి పరీక్షలు నిర్వహించడం వల్ల సమస్య గురించి తెలుసుకోవచ్చు.
Published by:Amala Ravula
First published: