అందం (Beauty) ప్రతీ ఒక్కరూ కోరుకునేదే. ఈ బిజీ లైఫ్‌లో శరీరం, అందంపై ప్రత్యేక శ్రద్ధ వహించే సమయమే లేకుండా పోతుంది. దీంతో చిన్న వయసులోనే ముఖంపై (face) ముడతలు వస్తున్నాయి. ముడతలు పడే చర్మం కోసం మీరు ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్ (face pack)లను ఉపయోగించవచ్చు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకం చర్మం (skin) ఉంటుంది. ఆ చర్మం ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుంది. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటే,మరి కొంత మందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది. అలాగే కొంతమందికి నార్మల్ స్కిన్ ఉంటుంది. మరికొంత మందికి సున్నితమైన చర్మం (Sensitive skin) ఉంటుంది. అయితే మిగతా స్కిన్ వాళ్ళని పక్కన పెడితే, ఈ సున్నితమైన చర్మం ఉన్నవారు ఎప్పుడూ చర్మ సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కారణం వీరికి ఎలాంటి క్రీమ్స్ (Creams) పడతాయో.. పడవో..తె లియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ సెన్సిటివ్ స్కిన్ (Sensitive skin) ఉన్నవారు కొన్నికొన్ని సార్లు, మార్కెట్లో దొరికే స్కిన్ కేర్ ప్రొడక్ట్ ను ఉపయోగించినా కూడా సమస్యలు రాకుండా ఉండాలి అంటే కొన్ని రకాల క్రీములకు దూరంగా ఉండాలి. అవేంటో ఒకసారి చూద్దాం..
తెల్లగా (white) అవడానికి లేదా డ్రై స్కిన్ (dry skin) నుంచి బయటపడాలని చాలామంది సున్నితమైన చర్మం వాళ్ళు, ఏదో ఒక ప్రొడక్ట్ ని ఎవరో చెప్పారని కొనుగోలు చేసి, ఉపయోగిస్తూ ఉంటారు. వీటివల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం వుంది. ఇలాంటి వాళ్లు ముఖ్యంగా ఎటువంటి ప్రొడక్ట్స్ ను ఉపయోగించకూడదు అంటే AHAs, BHAs, glycolic acid కి దూరంగా ఉండాలి. అప్పుడే మీ సెన్సిటివ్ స్కిన్ (sensitive skin) సమస్యల (problems) బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఏది పడితే ఆ ఫేస్ ప్యాక్ వాడకుండా ఇంట్లో తయారుచేసినవి వాడితే మీ ముఖంలో కొంచెం యాక్టీవ్నెస్ ఉంటుంది. అందం కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: చర్మం కాలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయకూడదు.. తెలుసా?
సున్నితమైన చర్మంతో ఇబ్బంది పడే వాళ్లు మంచి ప్రొడక్ట్స్ (products)ని మాత్రమే వాడాలి. అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ (Organic products) చర్మానికి చాలా మంచిది అని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు వీటిలో ఉండే పదార్థాలు ఎలర్జీ లాంటి వాటికి దారి తీస్తాయి. అలాగే చాలా మంది ఈ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల చర్మం చాలా బాగుంది, మెరిసిపోతోంది అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియంది ఏమిటంటే దానిలో ఇంగ్రిడియంట్స్ ఏమిటి అనేవి తెలియవు. దీనితో వాళ్ళు కేవలం రిజల్ట్ మాత్రమే చూసుకుంటారు. ఎప్పుడైనా మీరు కనుక ఏదైనా ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా దాని మీద ఉండే పదార్థాలని చూసుకోండి. లేదు అంటే ఎలర్జీ వంటి వస్తూ ఉంటాయి.
ఇది కూడా చదవండి: జుట్టు రాలిపోవడం ఆగాలంటే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండే బెటర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beauty, Beauty tips, Face mask, Life Style