How to prevent back pain : కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోం(Work from home) సంస్కృతి సర్వసాధారణంగా మారింది. ప్రజలు ఇంటి నుంచే ఆఫీస్ పనులను నిర్వహిస్తున్నారు. అయితే ఇంటి నుంచి వర్క్ చేయడం సౌకర్యంగా ఉన్నప్పటికీ ఇంట్లో ఆఫీస్ వంటి సౌకర్యాలు సరిపడా లేకపోవడంతో చాలామంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంటి నుండి పని చేయడం వల్ల చాలా మంది వెన్ను, మెడ, కళ్ల నొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారు. మీరు కూడా ఇంటి నుండి పని చేస్తూ వెన్నునొప్పి(Back Pain)తో బాధపడుతున్నట్లయితే, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ద్వారా, ఈ నొప్పి సమస్య నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
ఇంటి నుండి పని చేసేటప్పుడు వెన్నునొప్పిని నివారించడానికి ఈ విషయాలను గుర్తుంచుకోండి
అలా చేయవద్దు
ఇంటి నుంచి పని చేసేటప్పుడు చాలామంది తరచుగా సాధారణ కుర్చీ లేదా టేబుల్‌ని ఉపయోగిస్తారు. కొంతమంది చాలా గంటలు మంచం మీద కూర్చుని పని చేస్తారు. దీని వల్ల వెన్నెముకలో నొప్పి రావడం సహజం. అటువంటి పరిస్థితిలో, మీరు ఇంట్లో ఎర్గోనామిక్ కుర్చీలను ఉంచడం లేదా డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చొని పని చేయడం మంచిది.
Student : పరీక్ష పాస్ చేయండి సార్.. ఎగ్జామ్ పేపర్ కి రూ.500 పిన్ చేసిన స్టూడెంట్,చివరికి..
తప్పుడు భంగిమలో ల్యాప్‌టాప్‌లో పని చేయవద్దు
సరైన భంగిమలో కూర్చుని పని చేస్తే మంచిది. మీరు బెండ్ పొజిషన్‌లో పని చేస్తే, ఇది వెన్నుపూస డిస్క్‌లపై రెండు రెట్లు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది,చుట్టుపక్కల కండరాలు ఒత్తిడికి గురికావడం ప్రారంభిస్తాయి. ప్రధాన కండరాలు ఒత్తిడికి గురికావడం ప్రారంభిస్తాయి.
అలాగే అతుక్కుపోవద్దు
రోజంతా ఒకే చోట కూర్చోకుండా, మధ్యలో 10 నిమిషాల విరామం తీసుకుని, ఈ సమయంలో శరీరాన్ని కదిలిస్తూ ఉండండి. మీరు అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. దీని వల్ల రక్తప్రసరణ బాగా జరిగి కణజాల పోషణలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో వెన్ను నొప్పి కూడా తగ్గుతుంది. మీరు కుర్చీపై కూర్చొని స్ట్రెచింగ్ లేదా రొటేషన్ వ్యాయామాలు కూడా చేయవచ్చు.
సూర్యరశ్మి అవసరం
ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంట్లో కూర్చొని ఉంటే సూర్యరశ్మిని కోల్పోతారు, దాని కారణంగా విటమిన్ డి లోపం ప్రారంభమవుతుంది. శరీరంలో నొప్పికి ఇది అతిపెద్ద కారణాలలో ఒకటి. అందుకే మధ్యమధ్యలో 15 నిముషాలు బయటకు వెళ్లి సూర్యరశ్మి తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Life Style