Ugadi 2022 special:ఉగాది (Ugadi 2022) తెలుగువారికి నూతన సంవత్సరం, వసంతోత్సవం ప్రారంభం. ఈ రోజు ఏప్రిల్ 2, శనివారం (Saturday) జరుపుకుంటారు. ఇది తెలుగువాళ్లకు ఎంతో ఉత్సాహంతో ఆచరించే చాలా ప్రత్యేకమైన రోజు. వేడుకల గురించి చెప్పాలంటే ఈరోజు చేసుకునే ఆహారం కూడా ప్రత్యేకమైంది. రుచికరమైన వంటకాలు లేకుండా ఏ పండుగ పూర్తి కాదు. నేతిబొబ్బట్లు అనేది ఉగాది పండుగరోజు ఆస్వాదించవలసిన సాంప్రదాయ వంటకం. ఈ శుభ సందర్భంగా నేతిబొబ్బట్లు లేదా భక్షాలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం:
తయారీ విధానం..
స్టెప్ 1: ప్రెషర్ కుక్కర్లో చనగ పప్పు వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
స్టెప్ 2: ఇప్పుడు పంచదార/బెల్లం పప్పు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి.
ఇప్పుడు యాలకుల పొడి, సోంపు, ఉప్పుతో పాటు జాజికాయ తురుము కూడా వేయాలి. ఇప్పుడు తక్కువ మంటలో కలుపుతూ ఉండాలని గుర్తుంచుకోండి. తర్వాత గ్యాస్‌ను ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
స్టెప్ 3: ఆ తర్వాత మైదా లేదా గోధుమ పిండితో పిండిని పిసికి కలుపుకోవాలి. పిండిపై మూతపెట్టి, మెత్తగా వచ్చేలా కొన్ని నిమిషాలు పక్కన పెట్టండి.
స్టెప్ 4: ఇప్పుడు పిండిని చిన్న బాల్స్ లా సిద్ధం చేయండి. వాటిని మీ అరచేతులతో కాస్త వెడల్పుగా చేయండి. దానికి కొద్దిగా నెయ్యి రుద్ది, మీరు పక్కన పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని అందులో వేసి. అంచులను చక్కగా మూసివేయండి.
స్టెప్ 5: తర్వాత దానిని చపాతీలా రోల్ చేసి, నెయ్యితో అద్ది తవా లేదా పాన్‌పై ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి.
అంతే, ఎంతో రుచికరమైన నేతిబొబ్బట్లు వేడిగా వడ్డించడానికి సిద్ధంగా ఉంది.
ఈ సంతోషకరమైన ఉగాది సందర్భంగా మీ ప్రియమైన వారితో సంప్రదాయ మరియు ఆహ్లాదకరమైన నేతిబొబ్బట్లను ఆస్వాదించండి.
(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.