హోమ్ /వార్తలు /life-style /

Holi 2022: రంగుల హోలీకి ఇంట్లోనే నేచురల్ కలర్స్ తయారు చేసుకోండి...

Holi 2022: రంగుల హోలీకి ఇంట్లోనే నేచురల్ కలర్స్ తయారు చేసుకోండి...

Holi 2022: చిన్నప్పటి నుంచి ప్రతి హోలీకి  వారం ముందునుంచే రకరకాల రంగులు, స్ప్రేలు రెడీ చేసుకుంటారు. ఫ్రెండ్స్ కు హోలీ రంగులను పూస్తారు. ఈసారి నేచురల్ రంగులతో ట్రై చేయండి. అదేలానో చూద్దాం

    రంగురంగుల హోలీ (Holi 2022) సమీపిస్తోంది. అయితే, పండుగకు మనం వాడే కలర్స్ లో ఏవేవో కెమికల్స్ కలుపుతారు. అయితే, నేచురల్ పద్ధతిలో కూడా మనం ఇంట్లోనే హోలీ రంగులను (Colours) తయారు చేసుకోవచ్చు.  ఈ పండుగ కోసం చిన్నపిల్లలు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఓ వారం ముందునుంచే రకరకాల రంగులు, స్ప్రేలు రెడీ చేసుకుంటారు. ఫ్రెండ్స్ కు హోలీ రంగులను పూస్తారు. ఈసారి నేచురల్ రంగులతో ట్రై చేయండి. అదేలానో చూద్దాం.

    •  పసుపు, శనగపిండిని కలిపి రంగుగా పూయొచ్చు. పసుపు, శనగపిండి 20:80 రేషియోలో కలపాలి.
    • పసుపులో నిమ్మకాయ రసం కలిపింతే కూడా ఎరుపు రంగు వస్తుంది. దీంతో రెడ్ కలర్ ను నేచురల్ పద్ధతిలో పొందినట్లవుతుంది. కాకపోతే ముందుగా కాస్త ఎండ తగలనిచ్చి ఆరనివ్వాలి. అప్పుడే రెడ్ కలర్ తయారవుతుంది.
    • ఒకవేళ మీకు పింక్ కలర్ కావాలంటే.. ఈ పద్దతిలోనే కానీ, లైమ్ జ్యూస్ కాస్త తక్కువగా వేసుకుంటే రాణి రంగు వచ్చేస్తుంది.

    ఇది కూడా చదవండి: Finger millets: రాగులతో కళ్లు చెదిరే లాభాలు.. తెలియకపోతే బిగ్ లాస్..

    • పూలను కూడా ఆరబెట్టి వాటిని మిక్సీ పట్టాలి. వీటన్నింటిని నీటిలో కలిపి కూడా చల్లొచ్చు.
    • ఎర్రచందనం, చందనం పొడులను హోలీ రంగులుగా వాడొచ్చు. దీన్ని నేరుగా పూయొచ్చు లేదా నీటిలో కలిపి రాయొచ్చు.
    • దానిమ్మ గింజలు, బీట్‌రూట్ మంచి కలర్స్‌నిస్తాయి. వీటిని మిక్సీ పట్టి లేదా కాస్తా మెదిపి రంగుగా పూయొచ్చు.
    • గోరింటాకు , మైదాపిండిని కూడా సమపాళ్లలో తీసుకుంటే, గ్రీన్ కలర్ సిద్ధమవుతుంది. రకరకాల పూలు, పండ్లతో తీసిన రంగులను కూడా వీటికి కలిపి రాయొచ్చు. మంచి సువాసన రావంటే దీనికి 10 ఎంఎల్ రోజ్ వాటర్ ను కలపండి.

    పర్పుల్ కలర్..

    • 4-5 బ్లాక్ క్యారట్ గ్రైండ్ చేసి దానికి 250 గ్రాములు కార్న్ ఫ్లోర్ కలపాలి. ఇప్పుడు 10 ఎంఎల్ రోజ్ వాటర్ కలిపితే సరిపోతుంది.
    • ఒకవేళ మీకు ఊదా రంగు కావాలంటే ఉసిరి కాయను కావాల్సిన మోతాదులో గ్రైండ్ చేసి, దానికి కార్న్ ఫ్లోర్, రోజ్ వాటర్ కలపాలి. కాస్త ఎండలో ఆరనివ్వాలి.

    ఇది కూడా చదవండి: బ్రేక్ ఫాస్ట్ రోజూ తీసుకోవడం లేదా? అలా అయితే, జ్ఞాపకశక్తి త్వరగా కోల్పోతారట!

    •  రకరకాల చెట్ల ఆకులు, బెరళ్ళని నానబెట్టి ఆ రంగులను కూడా వాడొచ్చు.
    •  పండ్ల తొక్కలను కూడా రంగులుగా మార్చొచ్చు.
    • ఒకవేళ వెంటనే ఉపయోగించాలనుకుంటే వాటిని కాస్తా నీటిలో వేసి మరిగించి వాడుకోవచ్చు.
    • సహజసిద్ధమైన రంగులు కాకుండా కృత్రిమ రంగులు వాడడం వల్ల శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. అవి శ్వాస, కాలేయ సంబంధిత సమస్యలను కూబడా తీసుకొస్తాయి.

    First published:

    ఉత్తమ కథలు