హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

సండే ఫుల్ ఫండే, ఏంటి సార్.. మండే అంటే మండిపోతుందా? ఇలా పోగొట్టుకోండి..

సండే ఫుల్ ఫండే, ఏంటి సార్.. మండే అంటే మండిపోతుందా? ఇలా పోగొట్టుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సోమవారం వచ్చేసరికి ఆ ఉత్సాహం నీరుగారుతుంది. వారంతంలో ఉండే సందడి.. వారం ప్రారంభపు రోజు మాత్రం ఉండదు. ఇలాంటి ప్రతికూల భావాలు.. ప్రతిఒక్కరూ తమ స్కూలు జీవితంలో అనుభవించే ఉంటారు.

ఆదివారం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో.. సోమవారం ఉదయాన్నే అంత విసుగ్గా, బాధగా ఉంటుంది. ముఖ్యంగా బాల్యంలో పాఠశాలకు వెళ్లాలంటే అదోరకమైన ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. ఇందుకు కారణంలేకపోలేదు.. ఆదివారం నాడు కుటుంబం, స్నేహితులతో కలిసి ఆడుకోవడం, సరదాగా గడపడం, సినిమాలు చూస్తూ మంచి సమయాన్ని వారితో ఉత్సాహంగా గడుపుతాం. సోమవారం వచ్చేసరికి ఆ ఉత్సాహం నీరుగారుతుంది. వారంతంలో ఉండే సందడి.. వారం ప్రారంభపు రోజు మాత్రం ఉండదు. ఇలాంటి ప్రతికూల భావాలు.. ప్రతిఒక్కరూ తమ స్కూలు జీవితంలో అనుభవించే ఉంటారు.

బాల్యంలో సైకలాజికల్ గా ప్రతికూల భావాలు..

ఫార్మల్స్ ధరించి ఇంటిని విడిచి కార్యాలయానికి వెళ్లే ఆలోచన మానసిక స్థితి ఆకస్మిక మార్పులా మనకు అనిపించవచ్చు. మనుషులు సాంఘీక జీవులు. అంటే వారు పరిచయాలను ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతను(Security) కోరుకుంటారు. మన సామర్థ్యంలో ఏదైనా మార్పు ఆందోళనకు దారితీయవచ్చు. పాఠశాల స్థాయి నుంచి ఇలాంటి ఆందోళనలను ఎదుర్కొంటున్నాం.

సహజంగా పిల్లలు కూడా కొత్తదనాన్ని అన్వేషించడానికి ఉత్సహాన్ని ప్రదర్శిస్తారు. సాధారణంగా బొమ్మలు, కథల పుస్తకాలు లేదా స్నేహితులతో ఆరు బయట ఆడుకోవడం లాంటివి చేస్తున్నప్పుడు సంతోషంగా ఉంటారు. పాఠశాలలో క్రమశిక్షణ, దినచర్య, బెదిరింపుల ద్వారా శిక్షలు అమలు చేయడం లాంటి వాటి వల్ల ఆదివారం ఉన్న ఉత్సాహం సోమవారానికి వచ్చేసరికి దిగజారి పోయి భయపడుతున్నారు. సోమవారానికి, పాఠశాలలకు ప్రతికూల అనుబంధం ఉందని మన మనస్సులో నాటుకుపోయింది. ఉద్యోగులుగా మారినప్పటికీ ఘనపు ఆకారంలోని తరగతి గదులు, చెక్క బెంచీలు, బ్లాక్ బోర్డు లాంటి పాఠశాల సరంజామా చూసేసరికి భయంకరంగా అనిపిస్తుంది.

పనిచేసేవారిలోనూ ఒత్తిడి...

ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, సంపాదకులు, అకౌటెంట్లు, ఐటీ నిపుణులు, సర్జన్లు, నర్సింగ్ సిబ్బంది ఇలా అధిక ఒత్తిడితో ఉండే ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి. పాఠశాల మాదిరిగా క్రమశిక్షణా చర్యలు ఇక్కడ కూడా ఉంటున్నాయి. సర్జన్లు లేదా నర్సింగ్ సిబ్బంది విషయంలో స్వల్ప పొరపాటు కూడా జీవన్మరణ సమస్యకు దారితీస్తుంది. జర్నలిస్టులు, ఐటీ నిపుణులు, ఆఫీసులో పనిచేసే ఇతర ఉద్యోగులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతారు.

చాలా మంది పాఠశాలలో సానుకూల వాతావరణాన్ని అనుభవించి ఉండరు. ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తున్న సందర్భాల్లో పని వాతావరణం ఉద్యోగికి విషపూరితంగా మారుతుంది. అలాంటి ఉద్యోగులకు సోమవారాలు, వారాంతంలో ఇంట్లో సౌకర్యం, విశ్రాంతితో పోలిస్తే మిగిలిన వాటిలో ప్రతికూల అర్థాన్ని పొందుతాయి.

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Work From Home

ఉత్తమ కథలు