HOME »NEWS »LIFESTYLE »how to over come camera phobia follow these tips krs

ఫొటో దిగాలంటేనే సిగ్గు, భయమా..? ఇలా చేస్తే కెమెరా ఫోబియా పోతుంది..

ఫొటో దిగాలంటేనే సిగ్గు, భయమా..? ఇలా చేస్తే కెమెరా ఫోబియా పోతుంది..
ప్రతీకాత్మక చిత్రం

కొందరికి కెమెరా ముందుకెళ్లాలంటే భయంగా ఉంటుంది. తెగ సిగ్గు పడుతుంటారు. దానివల్ల జీవితంలోని మధుర క్షణాలను జ్ఞాపకాలుగా దాచుకోలేకపోతున్నామని తర్వాత ఫీలవుతుంటారు. మరి కెమెరా (ఫొటో) ఫోబియా పోవాలంటే ఏం చేయాలంటే.. ఇవి పాటించండి..

 • Share this:
  చాలా మందికి ఫొటోలు దిగడమంటే చాలా ఇష్టం. వీడియోలో ఉండాలంటే సరదా. కానీ కొందరు అలా కాదు. బర్త్​డే పార్టీల్లో అమ్మనాన్నలు గ్రూప్​ ఫొటో దిగేందుకు పిలిచినా... స్నేహితులు సోషల్​ మీడియాలో వారి ఫొటో పెట్టినా చాలా కంగారు పడిపోతారు. ఎవరేమనుకుంటారో అని సిగ్గు పడతారు. కానీ జీవితంలో మధుర క్షణాలను జ్ఞాపకాలుగా దాచుకోలేదని ఆ తర్వాత బాధపడతారు. మరి ఫొటో దిగేందుకు భయం సిగ్గుగా ఉందా.. కెమెరా ఫోబియా(భయం) నుంచి బయటపడాలంటే..

  అందం గురించి భయం వద్దు...  ముఖ్యంగా చాలా మందికి ఫొటోలు దిగాలంటే ఎలా ఉన్నానో.. ఇతరులు ఏమనుకుంటారో అని భయపడుతుంటారు. అందం గురించి ఆందోళన చెందుతుంటారు. మీరు ఊహించినట్టుగా ఎదుటివారు మీ అందం గురించి తప్పుగా అనుకోరని  ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ధైర్యంగా, చిరునవ్వుతో కెమెరా ముందు నిలబడితే అందంగా కనబడతారని వెల్లడించింది. అందుకే ఎవరైనా ఫొటో తీస్తానంటే అందం గురించి ఏమనుకుంటారోనని భయపడాల్సిన అవసరం లేదు. చిరునవ్వుతో ఫొటోకు రెడీ అయిపోండి.  చిరునవ్వే అందం...  ఫొటో దిగాలంటే కొందరు ముందుగా చాలా రెడీ అవుతుంటారు. హడావుడి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల భయం మరింత ఎక్కువవుతుంది. అందుకే ప్రశాంతంగా ఉండాలి. మీ కళ్లు, ముఖ కవళికల(ఎక్స్​ప్రెషన్స్​) వల్ల ఫొటోలో అందంగా కనపడతారు. అందుకే ముఖంపై నవ్వు ఉంటే ఎంతో అందంగా ఫొటోలో ఉంటారు. ఇది గుర్తుంచుకొని చిరుమందహాసం చిందిస్తూ ఉండాలి.

  ఆత్మ విమర్శ తగ్గించుకోవాలి...  చాలా సార్లు ఫొటోలో మిమ్మల్ని మీరు చూసుకొని బాగాలేదనుకుంటారు. అందుకు బాధ పడకుండా కారణాలను చూడాలి. ఒక్కోసారి కెమెరా సరిగా ఉండదు. కెమెరా మిర్రర్​ మోడ్​లో ఉన్నప్పుడు ఫొటో రివర్స్​లో పడుతుంది. అలాంటప్పుడు ఫొటో తేడాగా ఉంటుంది. అలాగే వీడియో రికార్డ్​ చేసినప్పుడు స్వరంలో కూడా మార్పులు వస్తాయి. అంతమాత్రన గొంతు సరిగా లేనట్టుకాదు.

  కొన్నిసార్లు కెమెరా నుంచి తప్పించుకోలేరు... పార్టీలు, వేడుకల్లో ఎవరెప్పుడు ఫొటోలు తీస్తారో అనే భయంతో ఉంటారు. ఆనంద క్షణాలను కోల్పోతారు. ఏదో ఒక గదిలో దాక్కుంటారు. కానీ ప్రస్తుతం అందరి దగ్గర స్మార్ట్​పోన్లు ఉన్నాయి. మీకు తెలియకుండానే మీ స్నేహితులు ఫొటోలు తీయగలరు. వాటిని ఫేస్​బుక్​ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయగలరు. అందుకే ఇది గుర్తుంచుకొని ఫొటోలు దిగేందుకు మీరే సిద్ధమవ్వాలి.

  మౌనం వీడాలి... మీరు అందర్లోకి వచ్చేందుకు ఇబ్బందికరంగా అనుకుంటుండొచ్చు. కానీ ప్రపంచాన్ని పరిశీలించడానికి దాన్ని అవకాశంగా భావించాలి. సంతోషంగా ఉండేందుకు చాలా కారణాలు ఉంటాయి. మీరు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. అందరితో కలవాలి. దీనివల్ల ఇతరులతో ఫొటోలు దిగే సమయంలో ఇబ్బందిగా ఉండదు.

  సాధ్యం కానంతగా గొప్పగా ఊహించకూడదు..  కొందరు తమ ఫొటోలు సాధ్యంకానంత గొప్పగా ఉండాలని ఊహించుకుంటారు. హెయిర్​స్టయిల్​, దుస్తులు ఉన్నదానికంటే అందంగా కనిపించాలని భ్రమ పడుతుంటారు. అందుకే ఫొటో చూసినప్పుడు అసంతృప్తి చెంది అయిష్టంగా ఉంటారు.అలాంటి ఊహలు వదలాలి. నిజమేంటంటే మీరు మీ ఫొటో మీద చేసినంత లోతుగా ఇతరులు విశ్లేషించరు. అంత స్పష్టంగా, లోపాలను వెతికేంత చూడరు.
  Published by:Krishna P
  First published:December 23, 2020, 08:39 IST

  टॉप स्टोरीज