ఇంటిని క్లీన్ చేసేటప్పుడు నీటిలో వీటిని కలిపితే ఎన్నో బెనిఫిట్స్..

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా ఇంటిని తుడుస్తూనే ఉంటాం. ఆ నీటిలో మార్కెట్ నుంచి తీసుకొచ్చిన రకరకాల ద్రావణాలు కలుపుతాం. ఇలా కాకుండా ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను వేయడం వల్ల ఇల్లు మెరుస్తుంది. అవేంటంటే..

  • Share this:
ఇంటిని రెగ్యులర్ క్లీన్ చేయడం ఎంతో మంచిది. దీని వల్ల ఎన్నో రోగాలను కంట్రోల్ చేసినవారవుతాం. క్లీన్ చేశామంటే చేశామన్నట్లు కాకుండా కొన్ని చిట్కాలు పాటించండి.ఇలా చేయడం వల్ల అదనపు లాభాలుంటాయి. ఇందుకోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలనే వాడొచ్చు. ఇలా చేయడం వల్ల ఇల్లంతా క్లీన్‌గా, నీట్‌గా ఉంటుంది.
* ఇంటిని తుడిచే నీటిలో కొద్దిగా సోడా వేయండి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే జిడ్డు, మరకలు పోయి మెరుస్తుంటుంది.
* క్లీన్ చేసే నీటిలో ఉప్పు కలిపితే దోమలు, ఈగలు, సూక్ష్మక్రిములు రావు,
* అదే విధంగా కొంచెం పసుపు కలిపినా అందులోని యాంటీబయాటిక్ లక్షణాలు చెత్తని క్లీన్ చేస్తాయి.
* ఇంట్లో ఏదైనా మూల కర్పూరం వెలిగిస్తే సువాసన రావడమే కాదు.. చిన్న చిన్న క్రీములు కూడా నాశనమవుతాయి.
* ఎక్కడైనా మరకలు వదలకుంటే నిమ్మరసం, నిమ్మతొక్కలతో రుద్దితే మరలకలు ఇట్టే మాయమవుతాయి.
* వాడేసిన నిమ్మచెక్కల్ని మరిగించి ఆ నీటితో ఇల్లు క్లీన్ చేస్తే చాలా మంచిది.
* ఇంట్లో చెత్తవాసన వస్తుంటే నీటిలో కాస్తా లావెండర్ ఆయిల్, నిమ్మ, నారింజ తొక్కల్ని వేసి మరిగించాలి.. ఆ వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది.
First published: