Recipe: స్వీట్ చిల్లీ ఆల్మండ్స్ రెసిపీ... తయారీ ఈజీ... టేస్ట్ అదుర్స్...

Recipe: స్వీట్ చిల్లీ ఆల్మండ్స్ రెసిపీ... తయారీ ఈజీ... టేస్ట్ అదుర్స్...

Sweet Chilli Almonds Recipe : సాధారణంగా ఏ వంటలైనా అయితే తియ్యగా ఉంటాయి లేదా కారంగా ఉంటాయి. మరి ఈ స్వీట్, చిల్లీ బాదం రెసిపీ ఎలా ఉంటుంది? ఎలా తయారుచెయ్యాలి?

  • Share this:
    Sweet Chilli Almonds recipe : బాదం పప్పులంటే ఇష్టం ఉండని వారు తక్కువ. అవి రేటు ఎక్కువైనప్పటికీ... వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉండటంతో... చాలా మంది వాటిని తప్పనిసరిగా వాడుతున్నారు. ముఖ్యంగా... అధిక బరువు తగ్గాలన్నా, ఎనర్జీ రావాలన్నా బాదం పప్పులు తింటే మంచిదంటుంటారు డాక్టర్లు. ఏజ్ పెరుగుతుంటే... బాదం పప్పులు ఎంతో మేలు చేస్తాయి. అందువల్ల ఆల్మండ్స్ (బాదం)తో... స్వీట్ చిల్లీ స్నాక్ ఎలా తయారుచెయ్యాలో తెలుసుకుందాం. ఈ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్‌ అనిపించవచ్చు. కానీ ఈ స్నాక్ తింటే... విటమిన్స్, మినరల్స్, ఎనర్జీ అన్నీ లభిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ ఆకలితో ఇబ్బంది పడేవారికి ఈ స్నాక్... పొట్ట నిండిన ఫీల్ కలిగిస్తుంది. పైగా ఇందులో ఎగ్ వైట్ కూడా కలుస్తుంది కాబట్టి... ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదే. గెస్టులకు ఈ స్నాక్ చేసి... డ్రింక్స్‌తో కలిపి ఇస్తే... పండగ చేసుకుంటారు. మరి స్వీట్ చిల్లీ ఆల్మండ్స్ రెసిపీ ఎలా తయారుచెయ్యాలో చకచకా తెలుసుకుందాం.

    స్వీట్ చిల్లీ ఆల్మండ్స్ రెసిపీకి కావాల్సినవి :
    - బాదం పప్పులు - 1 కప్పు
    - సగం ఎగ్ వైట్ (గుడ్డులో తెల్ల సొన - సగం)
    - 2 నుంచీ 4 కరివేపాకులు
    - అర టీస్పూన్ ఉప్పు
    - 2 టీస్పూన్ల షుగర్
    - అర టీస్పూన్ కారం పొడి

    స్వీట్ చిల్లీ ఆల్మండ్స్ రెసిపీకి తయారీ విధానం :
    1 - కరివేపాకుల్ని మైక్రోవేవ్‌‌లో పెట్టి... తక్కువ వేడిలో డ్రై చెయ్యాలి. లేదంటే కడాయి (ప్యాన్ లేదా బాణలి)లో వేసి కూడా వేపవచ్చు.
    2 - ఇప్పుడు డ్రై అయిన కరివేపాకుల్ని ముక్కలు చేసి ఓ గిన్నెలో వెయ్యాలి. ఉప్పు, పంచదార, కారంపొడి వెయ్యాలి. బాగా కలపాలి.
    3 - అందులో బాదం పప్పులు వెయ్యాలి. బాగా కలపాలి.
    4 - ఇప్పుడు గుడ్డులోని తెల్ల సొనలో సగం వేసి బాగా కలపాలి. అన్ని బాదంలకూ ఎగ్ వైట్ చేరేలా చెయ్యాలి.
    5 - ఇప్పుడు కాస్త మసాలా పొడి వేసి కలపాలి.
    6 - ఇప్పుడు రోస్టింగ్ ట్రేలో ఈ బాదం పప్పుల మిశ్రమాన్ని వెయ్యాలి.
    7 - ఆల్రెడీ హీట్ అయిన ఓవెన్‌లో రోస్టింగ్ ట్రేని ఉంచి... 120 డిగ్రీల దగ్గర 10 నిమిషాలు వేడి చెయ్యాలి. లేదంటే బాణలిలో కూడా వేపుకోవచ్చు.
    8 - వేడి చేసిన తర్వాత... ఓవెన్ నుంచీ బయటకు తీసి... పూర్తిగా చల్లారేలా చెయ్యాలి.

    దీన్ని వెంటనే తినవచ్చు. లేదా... గాలి చేరని జార్‌లో వేసి... తర్వాతైనా తినవచ్చు. ఇద్దరు వ్యక్తులు కలిసి తినేందుకు ఇది స్నాక్స్‌లా ఉంటుంది. మంచి టేస్ట్... కాస్త తీపి, కాస్త కారంగా ఉంటూ... కరకరలాడుతూ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది.
    Published by:Krishna Kumar N
    First published: