Pepper Chicken Curry: పెప్పర్ చికెన్ కర్రీ... కొంచెం స్పైసీ... అదిరే టేస్ట్

Pepper Chicken Curry Recipe : మన ఇళ్లలో చాలా కర్రీస్‌లో మిరియాల పొడిని కొద్దిగా వేస్తారు. మరి అదే మిరియాలతో చికెన్ కర్రీ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.

news18-telugu
Updated: November 22, 2020, 3:19 AM IST
Pepper Chicken Curry: పెప్పర్ చికెన్ కర్రీ... కొంచెం స్పైసీ... అదిరే టేస్ట్
Pepper Chicken Curry : పెప్పర్ చికెన్ కర్రీ... కొంచెం స్పైసీ... అదిరే టేస్ట్ (credit - twitter)
  • Share this:
Pepper Chicken Curry Recipe : మీకు చికెన్ కర్రీ అస్సలు వండటం రాదా. ఇదివరకు ఎప్పుడూ వండలేదా... అయితే... మీరు దీన్ని ట్రై చెయ్యవచ్చు. ఎందుకంటే ఇది ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ. పెప్పర్ (మిరియాలు) చికెన్ కర్రీ... కేరళలో ఫేమస్. దీన్ని కురుములకు చికెన్ అని కూడా అంటారు. ఎంతో రుచికరమైన ఈ కర్రీని రైస్, అప్పంలతో సెర్వ్ చేస్తారు. ప్రధానంగా భోజనానికి ఈ కర్రీ చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి 10 నిమిషాలు. వండేందుకు అరగంట పడుతుంది. మనం ముగ్గురికి సరిపడా ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Pepper Chicken Curry Recipe : కావాల్సినవి :

చికెన్ 500 గ్రాములు (చిన్న ముక్కలు చేసుకోవాలి)
మిరియాల పొడి - పావు (1/4) టీస్పూన్
నిమ్మరసం - 1 టీస్పూన్
ఉప్పు - సరిపడా

మసాలా కోసం కావాల్సినవి :

2 ఉల్లిపాయలు (కట్ చేసి పెట్టుకోవాలి)
2న్నర టీస్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్
2 పచ్చిమిర్చి... కట్ చేసి ఉంచుకోండి.
నల్ల మిరియాలు 1 1/4
గరం మసాలా - అర టీ స్పూన్
సోంపు పౌడర్ - 1/4 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
మాంసం మసాలా - అర టీస్పూన్
సోయ సాస్ - 1 టీస్పూన్
టమాటా సాస్ - 1 టీస్పూన్
కరివేపాకులు - కొన్ని
కొబ్బరినూనె - కొంత
ఉప్పు - తగినంత

Pepper Chicken Curry Recipe : వండే విధానం :
- ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసాన్ని కలపండి.
- ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు రాసేయండి. తర్వాత వాటిని అరగంట పక్కన పెట్టండి.

అరగంట తర్వాత.......
- బాణలి లేదా ప్యాన్‌లో నూనె వేసి... స్టవ్ ఆన్ చెయ్యండి. నూనె వెడెక్కుతుంటే... ఉల్లిపాయముక్కలు వెయ్యండి. అవి వేగుతున్నట్లు అవుతుంటే.... వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యండి. పనిలో పనిగా పచ్చిమిర్చి కూడా వెయ్యండి, చివర్లో కరివేపాకుల్ని జతచెయ్యండి. ఐదు నిమిషాలు అటూ ఇటూ కదుపుతూ వండండి.
- ఇప్పుడు వాటిలో మిరియాలు, పసుపు, గరం మసాలా, సోంపు పొడి, మంసం మసాలాను వేసి కలపండి.
- ఓ రెండు నిమిషాలు అటూ ఇటూ కదపండి.
- సోయ సాస్, టమాట సాస్ వేసి కలపండి.
- ఇప్పుడు పావు కప్పు నీరు పోసి... అది గ్రేవీ అయ్యేలా చేసుకోండి.
- ఇప్పుడు గ్రేవీలో చికెన్ వెయ్యండి. బాగా కలపండి
- చికెన్ ఉడకనివ్వండి. గ్రేవీ తగ్గిపోతున్న టైమ్ చూసి... వెంటనే అర కప్పు నీరు పొయ్యండి.
- మూతపెట్టి... మంట సిమ్‌లో పెట్టి... 10 నిమిషాలు సిమ్‌లో ఉడకనివ్వండి.
- నీరు ఇంకిపోతున్న సమయంలో... కరివేపాకుల్ని వెయ్యండి. మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వండి.
- ఇప్పుడు స్టవ్ నుంచి దింపి... వేడి వేడి అన్నంలో నిమ్మరసం వేసుకొని... చికెన్ ముక్కలు కలుపుకొని అలా అలా తింటుంటే... "అరే.. వండినంత సేపు కూడా పట్టలేదు తినడం" అని అనిపించకమానదు.
Published by: Krishna Kumar N
First published: November 22, 2020, 3:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading