Health : బొప్పాయి ప్లాస్టిక్ చట్నీ... రుచి చూస్తే... తినకుండా ఉండలేరు

Raw Papaya Plastic Chutney : మామూలుగా బొప్పాయి చట్నీ అంటే చాలా మంది ఇష్టపడరు. కానీ తక్కువ ఖర్చులో చేసుకోతగ్గ చట్నీల్లో బొప్పాయి చట్నీ ఒకటి. దాన్లో ఈ మార్పులు చేస్తే... చట్నీ అదిరిపోతుంది.


Updated: February 8, 2020, 11:12 AM IST
Health : బొప్పాయి ప్లాస్టిక్ చట్నీ... రుచి చూస్తే... తినకుండా ఉండలేరు
Health : బొప్పాయి ప్లాస్టిక్ చట్నీ... రుచి చూస్తే... తినకుండా ఉండలేరు
  • Share this:
Raw Papaya Plastic Chutney : బొప్పాయి చాలా పండ్ల షాపుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇళ్లలో కూడా చాలా మంది బొప్పాయి చెట్లు పెంచుకుంటూ ఉంటారు. అందువల్ల బొప్పాయి తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ దాని టేస్టు దానిదే. దోరగా పండిన తర్వాత బొప్పాయిని తింటే... చాలా బాగుంటుంది అంటుంటారు కొందరు. బొప్పాయిలోని పపాయిన్... మన జీర్ణక్రియ వ్యవస్థను ఎంతో బాగుచేస్తుంది. కాబట్టే అప్పుడప్పుడూ అయినా బొప్పాయి తినాలి. "నువ్వు ఎన్నైనా చెప్పు... బొప్పాయి మాత్రం తినలేం" అంటారా... ఐతే... మీరు బొప్పాయి ప్లాస్టిక్ చట్నీ చేసుకొని రుచి చూడాల్సిందే. ప్లాస్టిక్ అంటే నిజమైన ప్లాస్టిక్ కాదు. చూడటానికి ఆ చట్నీ ప్లాస్టిక్‌లా కనిపిస్తుంది. అందువల్ల దానికి చెఫ్‌లు ఆ పేరు పెట్టారు. దీన్ని ఎక్కువగా బెంగాల్ ప్రజలు తింటుంటారు. అక్కడి స్టార్ హోటళ్లలోని మెనూలో ఇది ప్లాస్టిక్ చట్నీ పేరుతో ఉంటుంది. ఈ చట్నీని షుగర్ సిరప్‌లో తయారుచేస్తారు. ఈ చట్నీకి బ్యాక్టీరియాను తరిమికొట్టే శక్తి ఉంది. జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది. అందువల్ల ఈ చట్నీ ఎలా తయారుచెయ్యాలో తెలుసుకుందాం.

బొప్పాయి ప్లాస్టిక్ చట్నీ తయారీకి కావాల్సినవి :
బొప్పాయి ముక్కలు - 1 కప్పు (చిన్నగా కట్ చేసుకోవాలి)

షుగర్ - 1 కప్పు (మరీ ఎక్కువ తీపి కావాలనుకుంటే మరింత ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు)
ఉప్పు - కొద్గిగా


నీరు - 1 కప్పు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు.పాంచ్ ఫోరాన్ - 1 టీస్పూన్ ( ఇదో రకం ప్యాకెట్. ఇందులో జీర, రాయ్, సోంపు, మెంతులు, కలోంజీ కలిసి ఉంటాయి)
భాజా (Potala Bhaja) మసాలా (జీర, ధనియాలు, ఎండిమిర్చి ) - 1 టీ స్పూన్.
ఆవ నూనె లేదా రిఫైన్డ్ ఆయిల్ - 1 టేబుల్ స్పూన్.

తయారీ విధానం -
- బాణలి లేదా కడాయి‌లో నూనె వేసి మీడియం మంటలో వేపాలి.
- అందులో ఎండుమిర్చి, పాంచ్ ఫోరాన్ వేసి... ఓ నిమిషం వేపాలి. ఇవన్నీ లేకపోతే... సింపుల్‌గా ఎండుమిర్చి, ఆవాలు వేసి వేపవచ్చు.
- ఇప్పుడు బొప్పాయి ముక్కలు అందులో వేసి... 2 లేదా 3 నిమిషాలు వేపి... నీరు పొయ్యాలి.
- ఇప్పుడు సిమ్‌లో కాసేపు వండండి.
- బొప్పాయి బాగా ఉడికి... కలర్ మారుతూ ఉంటే... ఇప్పుడు షుగర్, ఉప్పు, కావాలంటే జీడిపప్పు కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టండి.
- నీరు పూర్తిగా ఉడికిపోయి ఆవిరైపోయిన తర్వాత... చట్నీ గట్టిగా అయిపోతుంది. అది పూర్తిగా ఎండిపోకుండా జిగురుగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ చేసిన మసాలా మిక్స్ వేసి... నిమ్మరసం కలిపి... స్టవ్ ఆర్పేయాలి.
- ప్లాస్టిక్ చట్నీ తయారైంది. దీన్ని చల్లారిన తర్వాత అన్నంలో వేసుకొని తినాలి.
- బెంగాల్‌లో ఈ చట్నీని అప్పడంతో కలిపి తింటారు. పరాఠాల్లో కూడా దీన్ని వేసుకొని తినవచ్చు. జామ్‌లా కూడా వాడుకోవచ్చు.
First published: February 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు