Palak Chicken Recipe: పాలక్ చికెన్ కర్రీ... మళ్లీ మళ్లీ తినాలనిపించే టేస్ట్

Palak Chicken Recipe: చికెన్‌కి పాలక్‌ని జోడించడం వల్ల ఈ కర్రీ రుచి అత్యంత కమ్మగా, నోటికి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎలా తయారుచెయ్యాలో తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 27, 2020, 6:07 AM IST
Palak Chicken Recipe: పాలక్ చికెన్ కర్రీ... మళ్లీ మళ్లీ తినాలనిపించే టేస్ట్
పాలక్ చికెన్ కర్రీ... మళ్లీ మళ్లీ తినాలనిపించే టేస్ట్ (credit - twitter)
  • Share this:
Palak Chicken Recipe: బచ్చలికూర (Palak)... చికెన్ కర్రీకి బాగా సెట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ చెఫ్ లంతా... ఈ కర్రీని రెగ్యులర్‌గా వండుతారు. పెద్ద పెద్ద పార్టీల్లో ఇది ప్రత్యేక రెసిపీగా ఉంటుంది. పాలక్ కారణంగా... ఈ చికెన్ కర్రీలో ఎక్కువ పోషకాలు లభిస్తాయి. కొవ్వు తక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. హెల్తీ డైట్ మెయింటేన్ చేసేవాళ్లు పాలక్ చికెన్ కర్రీ వండుకోవడం మేలు. దీన్ని ప్రిపేర్ చేయడానికి 30 నిమిషాలు పడుతుంది. వండుకోవడానికి 40 నిమిషాలు పడుతుంది. ఉత్తరాది రాష్ట్రాల వారు ఈ కర్రీని అత్యంత ఎక్కువగా ఇష్టపడతారు. ఐదుగురికి సరిపడా వండుకోవడం ఎలాగో సింపుల్‌గా మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Palak Chicken Recipe తయారీకి కావాల్సినవి:

- బచ్చలికూర - 2 కట్టలు (పెద్దవే తీసుకోండి - చక్కగా తరిగి పెట్టుకోండి)
- చికెన్ - 800 గ్రాములు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 2 టీస్పూన్లు
- అల్లం - ఒక అంగుళం - తరిగిపెట్టుకోండి.- పచ్చి శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - సరిపడా
- పసుపు - పావు టీస్పూన్
- 2 మీడియం సైజు ఉల్లిపాయలు
- చిన్న ఆనపకాయ - (చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోండి)
- 5 లేదా 6 పచ్చిమిర్చి (సన్నగా కట్ చేసి పెట్టుకోండి)
- కొన్ని మెంతి ఆకులు - కట్ చేసి పెట్టుకోండి.
- 2 మీడియం సైజు టమాటాలు - చిన్నగా కట్ చేసి పెట్టుకోండి.
- కారం - అర టీస్పూన్
- గరం మసాలా పౌడర్ - అర టీ స్పూన్

Palak Chicken Recipe తయారీ విధానం:
- కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్‌ను చికెన్ ముక్కలపై వేసి... బాగా కలిపి... ఓ పక్కన ఉంచండి. కనీసం పావు గంట అలా ఉంచాలి.
- ముందుగా స్టవ్ వెలిగించి... మీడియం ఫ్లేమ్ పెట్టి... ప్యాన్ పెట్టి... నూనె వెయ్యండి.
- నూనె చిన్న బుడగలు వస్తున్న టైంలో జీలకర్ర, అల్లం, పచ్చి శనగపప్పు వేసి కలపండి. అవి వేగాక... 1 కప్పు నీరు పొయ్యండి. ఉప్పు (చికెన్‌కి ఆల్రెడీ ఉప్పు వేసిన విషయం మర్చిపోవద్దు), పసుపు వేసి కలపండి. మూత మూసి 2 నిమిషాలు అలా ఉడకనివ్వండి.
- మూత తీసి... ఉల్లిపాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వెయ్యండి. బాగా కలుపుతూ... వెంటనే మెంతి ఆకులు, బచ్చలి కూర ఆకు ముక్కలు వేసి... బాగా కలపండి. 2 లేదా 3 నిమిషాలు వండండి. ఇప్పుడు ఈజీగా టమాటాలు వేసి... బాగా కలపండి. మూత పెట్టి... అన్నీ బాగా ఉడికేవరకూ ఉడికించండి.
- కూరగాయలన్నీ ఉడికాక... హ్యాండ్ బ్లెండర్‌తో వాటిని మాష్ (పచ్చడిలా) చెయ్యండి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి బాగా కలపండి. మూత పెట్టి వండండి. మధ్యమధ్యలో మూత తీసి... చికెన్ ముక్కలు కలుపుతూ... అలా అవి పూర్తిగా ఉడికే వరకూ వండండి. అంతే... అదిరిపోయే టేస్టు, ఆరోగ్యకరమైన పాలక్ చికెన్ కర్రీ రెడీ. వేడిగా ఉన్నప్పుడే సెర్వ్ చెయ్యండి... ఇదెలా చేశావని అంతా అడుగుతారు మిమ్మల్ని.
Published by: Krishna Kumar N
First published: September 27, 2020, 6:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading