హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Beard Oil : ఇంట్లోనే నేచురల్ బియర్డ్ ఆయిల్ తయారు చేసుకోండిలా

Beard Oil : ఇంట్లోనే నేచురల్ బియర్డ్ ఆయిల్ తయారు చేసుకోండిలా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మగవాళ్లు తమ స్టైలింగ్‌కు అనుగుణంగా గడ్డం పెంచుకోవడానికి ఇష్టపడతారు. అదే సమయంలో గడ్డం మందంగా చేయడానికి గడ్డం ఆయిల్(Beard Oil)ను ఉపయోగించడం కూడా పురుషులలో చాలా సాధారణం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సాధారణంగా గడ్డం(Beard) కొందరి వ్యక్తిత్వానికి బాగా సరిపోతుంది. అందుకే చాలా మంది మగవాళ్లు తమ స్టైలింగ్‌కు అనుగుణంగా గడ్డం పెంచుకోవడానికి ఇష్టపడతారు. అదే సమయంలో గడ్డం మందంగా చేయడానికి గడ్డం ఆయిల్(Beard Oil)ను ఉపయోగించడం కూడా పురుషులలో చాలా సాధారణం. కోరుకున్న గడ్డం స్టైల్‌(Beard Style)ని పొందటానికి బియర్డ్ ఆయిల్ ఉపయోగించడం బెస్ట్ ఆప్షన్. బియర్డ్ ఆయిల్ సాధారణంగా చాలా ఖరీదైనది. బియర్డ్ ఆయిల్ కొనడం మీకు ఖరీదైనదిగా అనిపిస్తే కొన్ని టిప్స్ ద్వారా మీరు ఇంట్లో కూడా గడ్డం ఆయిల్ ని తయారు చేసుకోవచ్చు. వీటిని అనుసరించడం ద్వారా మీరు మీ గడ్డాన్ని సులభంగా మందంగా చేసుకోవచ్చు.

యూకలిప్టస్ నూనె ఉపయోగించండి

యూకలిప్టస్ ఆయిల్.. యాంటీ-ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్‌తో సమృద్ధిగా ఉంటుంది, ఇది గడ్డం పెరుగుదలను వేగవంతం చేస్తుంది. దీని కోసం 6 టీస్పూన్ల ఆలివ్ నూనెలో 3-4 చుక్కల యూకలిప్టస్ నూనె కలపండి. ఇప్పుడు ఈ నూనెను ఒక గాజు పాత్రలో నింపి, ప్రతిరోజూ ఈ నూనెతో గడ్డానికి మసాజ్ చేయండి. 30 నిమిషాల మసాజ్ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లో మీ గడ్డం మందంగా మారుతుంది.

Laptop cleaning tips: ల్యాప్‌టాప్‌ స్క్రీన్ పై గీతలు,మరకలు ఉన్నాయా?ఇలా చేస్తే అవన్నీ మాయం

కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది

కొబ్బరి నూనె కూడా గడ్డాన్ని తేమగా ఉంచడం ద్వారా వెంట్రుకల పెరుగుదలకు సహాయపడుతుంది. కొబ్బరి నూనె నుండి బార్డ్ ఆయిల్ తయారు చేయడానికి 50 ml పచ్చి కొబ్బరి నూనెలో 10 చుక్కల రోజ్మేరీ లేదా లావెండర్ ఆయిల్ కలపండి. ఇప్పుడు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ నూనెతో గడ్డానికి మసాజ్ చేసి ఉదయం శుభ్రమైన నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది మీ గడ్డం మందంగా, మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

టీ ట్రీ ఆయిల్ ప్రయత్నించండి

ఇది యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాల యొక్క ఉత్తమ మూలంగా పరిగణించబడుతుంది. టీ ట్రీ ఆయిల్ గడ్డం దట్టంగా చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇందుకోసం 50 మిల్లీలీటర్ల బాదం నూనెలో 4 చుక్కల టీ ట్రీ ఆయిల్, 4 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ మిక్స్ చేసి గడ్డానికి మసాజ్ చేయాలి. తర్వాత 15-20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇది మీ గడ్డాన్ని మందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Lifestyle

ఉత్తమ కథలు