Food : కరోనాకి చెక్... లెమన్ చికెన్ కర్రీ... తింటే ఉండదు వర్రీ...

కరోనాకి చెక్... లెమన్ చికెన్ కర్రీ... తింటే ఉండదు వర్రీ... (credit - twitter - Jen Food and Travel Blogger)

Lemon Chicken Recipe : సండే రోజు చికెన్ తినడం భారతీయులకు హాబీ. మరి కరోనా డేస్ కాబట్టి... కాస్త లెమన్ టచ్ ఇస్తే... వైరస్‌కి తిక్క కుదురుతుంది.

  • Share this:
    Lemon Chicken Recipe : చికెన్ తినాల... ఆరోగ్యాన్ని పెంచుకోవాల... కరోనాకి చెక్ పెట్టాల... ఇందుకోసం మనం రెగ్యులర్‌గా చికెన్ కర్రీ వండుకున్నట్లు కాకుండా... కాస్త డిఫరెంట్‌గా ట్రై చేస్తే... మంచిదే. పైగా... ఈ టైపు కర్రీ చేసుకోవడం చాలా తేలిక. పైగా దీనికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో ఎక్కువగా ఐటెమ్స్ వేసుకునే పని లేదు కాబట్టి.. ఎక్కువ మంది దీన్ని ట్రై చేసుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్స్... మళ్లీ మళ్లీ చేసుకుంటున్నారు. కావాలంటే... లెమన్ చికెన్ కర్రీతోపాటూ... కొన్ని వెజిటబుల్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ మొత్తానికీ నచ్చే లెమన్ చికెన్ ఎలా తయారుచెయ్యాలో తెలుసుకుందాం చకచకా...

    Lemon Chicken Recipeకి కావాల్సినవి :
    - 4 స్కిన్ ఉన్న బోన్స్ ఉన్న చికెన్ బ్రెస్ట్స్
    - 1 టీ స్పూన్ ఉప్పు
    - మిరియాల పొడి - అర టీస్పూన్
    - పావు కప్పు మైదా
    - బటర్ - 4 టేబుల్ స్పూన్లు
    - ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు (ఏ ఆయిలైనా ఓకే)
    - నిమ్మరసం - పావు కప్పు.
    - కొత్తిమీర (ఇది ఆప్షన్)

    Lemon Chicken Recipe తయారీ విధానం :
    Step 1 - ప్రతీ చికెన్ బ్రెస్ట్‌నీ పొడవుగా రెండు భాగాలుగా చెయ్యండి. ముక్కలన్నింటినీ వరుసగా పెట్టి... వాటిపై ఉప్పు, మిరియాల పొడి చల్లండి. తర్వాత... ముక్కల్ని మైదా పిండిలో ముంచి తియ్యండి. తర్వాత వాటికి ఎక్కువ మైదా అంటుకుంటే... అటూ ఇటూ ఊపి... అనవసర మైదా ఊడి పోయేలా చెయ్యండి.

    Step 2 - ప్యాన్ లేదా బాణలి లేదా కడాయిలో... 1 టేబుల్ స్పూన్ బటర్ వెయ్యండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వెయ్యండి. మీడియం ఫ్లేమ్‌లో వేడి చెయ్యండి. సగం చికెన్ ముక్కల్ని అందులో వేసి... వేపండి. 2 నుంచి 3 నిమిషాలు వేపండి. తర్వాత ముక్కల్ని తిరగేసి... మళ్లీ 2 నుంచి 3 నిమిషాలు వేగిన తర్వాత... బ్రౌన్ కలర్ వచ్చాక... ఓ ప్లేటులోకి వాటిని మార్చండి. మిగతా సగం చికెన్ ముక్కల్ని కూడా ఇలాగే చెయ్యండి.

    Step 3 - ఇప్పుడు చికెన్ ముక్కలపై నిమ్మరసం వెయ్యండి. మళ్లీ అన్ని ముక్కల్నీ అలా అలా రెండు నిమిషాలు ఫ్రై చెయ్యాలి. ఇప్పుడు వాటిపై మిగిలిన 2 టేబుల్ స్పూన్ల బటర్ వెయ్యాలి. బటర్ కరిగే వరకూ ముక్కల్ని అటూ ఇటూ కదపాలి. అంతే... కొత్తిమీర చల్లుకొని... తింటే... ఇక సండే అదుర్సే... కరోనా బెదుర్సే...
    Published by:Krishna Kumar N
    First published: